తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు..యాక్టివ్ పాలిటిక్స్‌లో పాల్గొనబోతున్నారు.. ఈ రెండు విషయాలు ఇపుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ శాసనసభలో మాజీ సీఎం చంద్రబాబునాయుడి కుటుంబం గురించి అధికార పక్ష సభ్యులు అగౌరవ పరిచే విధంగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం ఇంకా కళ్ల ముందు కనపడుతూనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఆ […]
Category: Politics
కారు దిగనున్న ‘జూపల్లి’..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కారు పార్టీ పట్టించుకోకపోవడంతో ఆయన కినుక వహించినట్లు తెలిసింది. కేసీఆర్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఆయన తన అనుచరులు, అభిమానులతో చర్చించినట్లు తెలిసింది. ఒకవేళ కారు పార్టీ నుంచి బయటకు వచ్చేలా ఉంటే ఏ పార్టీ కండువా కప్పుకోవాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. […]
తమిళనాడు ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాలిన్ వరుసగా ప్రజా ఆమోద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాలనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదం బారిన పడి గాయాలపాలైన వారికి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన వారికి ఆపరేషన్లు కూడా చేయాల్సి […]
ఇప్పుడే వద్దు.. కాస్త ఓపిక పట్టండి..
ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుత టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. గురువారం ఢిల్లీలో సోనియాను కలిసి డీఎస్..శుక్రవారం పార్టీలో చేరాల్సి ఉంది. అయితే.. ఎందుకో డీఎస్ కాంగ్రెస్‌కు కండువా కప్పే విషయంపై కాంగ్రెస్ నాయకులు, హైకమాండ్ ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని, అందుకే వాయిదా పడిందని తెలిసింది. పార్టీలో చేరే తేదీని తరువాత చెబుతామని.. అంతవరకు ఓపిక పట్టాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ […]
గరం..గరం..గద్వాల రాజకీయం
డీకే అరుణ.. అప్పట్లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. ఇప్పుడు బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. అయితే ఇప్పుడు అరుణ సొంత నియోజకవర్గం (గద్వాల) ఎమ్మెల్యే అయిన తన మేనల్లుడు బండ్ల క్రిష్ణ మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2014లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించారు. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ […]
జనంలో కాదు సోషల్ మీడియాలో యాక్టివ్
ఆర్‌కే అలియాస్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. ఈ పేరు వింటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఓ భరోసా.. ఓ నమ్మకం.. అయితే ఇది ఇప్పుడు కాదు.. గతంలో..ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలుపొందిన నాటి సంగతి. ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడి 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. కేవలం 12 ఓట్లతో మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికై వార్తల్లో నిలిచాడు. ఆ తరువాత జనం కోసం నిలబడి వారి మద్దతు కూడగట్టాడు. […]
కేటీఆర్ సార్.. మేయర్ గారెక్కడ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. కార్పొరేటర్లందరికీ కాదు కదా సొంతపార్టీ కార్పొరేటర్లకు కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి అందుబాటులో ఉండటం లేదు. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మేయర్ ను కలిసి వివరిద్దామనుకుంటే వారికి నిరాశే ఎదురవుతోంది. మాకే మేయర్ అందుబాటులో లేకపోతే మేం ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించగలం? అని వాపోతున్నారని సమాచారం. 2021 ఫిబ్రవరిలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి పేరు బయటకు రావడం.. ఆమెను […]
టీడీపీ ఎమ్మెల్యే ‘ ఏలూరి ‘ తనయుడి ఖండాంతర ఖ్యాతి.. సరిలేరు నీకెవ్వరూ…!
సాధారణంగా రాజకీయ నేతల కుమారులు.. తమ తండ్రుల రాజకీయాలను వారసత్వంగా అందిపుచ్చుకు ని మళ్లీ రాజకీయాల్లోకే వస్తారు. అయితే.. చాలా చాలా తక్కువ మంది మాత్రమే.. దీనికి భిన్నంగా అడుగు లు వేస్తారు. అదికూడా.. అతి కొద్ది మంది మాత్రమే రికార్డు సొంతం చేసుకునే రేంజ్‌లో ముందుకు సాగు తారు. ఇలా.. టీడీపీ ఎమ్మెల్యే.. ఏలూరి సాంబశివరావు కుమారుడు.. ఏలూరి దివ్యేష్.. అతి పిన్న వయసు లోనే ఖండాంతర ఖ్యాతిని గడించారు. నిజానికి ఒక రాజకీయ రంగంలో […]
రేపే ఫస్ట్ మీటింగ్.. టెన్షన్.. టెన్షన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)..ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికీ ఇదే ఆయువుపట్టు.. ఇక్కడ సక్సెస్ అయితే రాజకీయ నాయకులు త్వరగా పేరు వస్తుంది.. మీడియా, సోషల్ మీడియాలో కూడా హైదరాబాదులో జరిగే కార్యకలాపాలు, వ్యవహారాలు కనిపిస్తాయి.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రేపు (శనివారం) జరుగనుంది. బల్దియాకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచినా కనీసం ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయంపై ఏకంగా దాడిచేసినంత పని చేశారు. కార్పరేటర్లుగా […]