సాధారణంగా రాజకీయ నేతల కుమారులు.. తమ తండ్రుల రాజకీయాలను వారసత్వంగా అందిపుచ్చుకు ని మళ్లీ రాజకీయాల్లోకే వస్తారు. అయితే.. చాలా చాలా తక్కువ మంది మాత్రమే.. దీనికి భిన్నంగా అడుగు లు వేస్తారు. అదికూడా.. అతి కొద్ది మంది మాత్రమే రికార్డు సొంతం చేసుకునే రేంజ్‌లో ముందుకు సాగు తారు. ఇలా.. టీడీపీ ఎమ్మెల్యే.. ఏలూరి సాంబశివరావు కుమారుడు.. ఏలూరి దివ్యేష్.. అతి పిన్న వయసు లోనే ఖండాంతర ఖ్యాతిని గడించారు. నిజానికి ఒక రాజకీయ రంగంలో ఉన్న నాయకుడి కుటుంబం అంటే.. రాజకీయాలు.. వ్యాపారాల్లోనే బిజీగా ఉంటారు.
ఇక, ఆ రంగంలోనే ఎదుగుతుంటారే తప్ప.. ప్రపంచఖ్యాతినేమీ సొంతం చేసుకునే అవకాశం కానీ.. ఆదిశ గా ఆలోచించడం కానీ చేయరు. కానీ.. దివ్యేష్ మాత్రం అతి పిన్నవయసులోనే ప్రపంచ స్థాయిని సొంతం చేసుకున్నారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే.. ఆయన పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టారు. నిజానికి ఆ వయసులో పెద్దగా ఆలోచనలు ఎదుగుతున్న దశలోనే ఉంటారు. అయితే.. దీనికి భిన్నంగా.. దివ్యేష్ ఎదిగారు. అందరి లాగా ఆలోచిస్తే.. ఆయన ఇప్పుడు ఇలా.. చర్చించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ, ఆయన అందరికంటే భిన్నంగా ఆలోచన చేశారు.
సాధారణంగా వినియోగించే టవల్స్ స్థానంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల టవల్స్ వచ్చాయి. అయి తే.. వీటన్నింటికీ భిన్నంగా దివ్యేష్ తన మెదడుకు పదును పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనాను నిరోధించేలా.. దివ్యేష్ ఒక ప్రముఖ.. టవల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. వెండి ద్రావణంతో తయారు చేసిన యాంటీ మైక్రోబియల్ ప్రత్యేకత కలిగి ఉన్న టవల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు.
కరోనా సమయంలో బ్యాక్టీరియాను దగ్గర రానివ్వకుండా వినూత్నంగా యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములాతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ టవల్స్ అతి తక్కువ సమయంలోనే ప్రజలందరి మన్ననలు పొందాయి. 99% బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించేలా ప్రత్యేకంగా ఈ టవల్స్ ను రూపొందించారు. ఈ బ్రాండ్‌కు ప్రపంచం ఫిదా అయింది. ఈ క్రమంలోనే దివ్యేష్‌కు.. అరుదైన పురస్కారం లభించింది. పదహారేళ్ల వయసులోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యువ పారిశ్రామికవేత్త అవార్డును సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించారు.
వికనెక్ట్ ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఏటా వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రము ఖులకు `గ్లోబల్ ఫేమ్ అవార్డ్స్` ను 2020-21కిగాను సొంతం చేసుకున్నారు. ఇలా అతి పిన్నవయ సులోనే ప్రపంచస్థాయి అవార్డును సొంతం చేసుకోవడం.. ఏలూరి కుటుంబంలోనేకాకుండా.. టీడీపీ కుటుంబంలోనూ సంతోషాన్ని నింపింది. ఖండాంతర ఖ్యాతిని సొంతం చేసుకున్న దివ్యేష్‌కు సరిలేరు నీకెవ్వరు.. అంటూ.. ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. పుత్రోత్సాహం.. తండ్రికి పుత్రుడు వృద్ధిలోకి వచ్చినప్పుడే కదా.. కలిగేది.. ఇదే ఇప్పుడు.. ఏలూరి విషయంలో అక్షర సత్యం అయిందని అంటున్నారు టీడీపీ నేతలు.