టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను థ్రిల్ చేసే అడవి శేష్.. గొప్ప నటుడే కాదు మంచి అందగాడు కూడా. పైగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలిర్ లిస్ట్ లో ఈయన కూడా ఒకడు. అయితే శేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడవి శేష్.. తన పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటర్వ్యూలో పెళ్లి కబురు ఎప్పుడు వినిపిస్తారు? అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు ఆయన `నేను పనినే ప్రేమిస్తున్నా. మా ఇంట్లోనూ మొదట ఈ విషయం గురించి అడిగారు, కొన్నాళ్ల తర్వాత తిట్టారు, ఇక లాభం లేదనుకుని వదిలేశారు.
పనిలో పడి బిజీ బిజీగా గడపడం వల్లేనేమో ఈమధ్యే మనకంటూ వ్యక్తిగత జీవితం ఉండాలి కదా అనిపించింది.` అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈయన వ్యాఖ్యలు బట్టీ చూస్తుంటే.. శేష్ మనసు పెళ్లిపై మల్లిందని, త్వరలోనే అందుకు సంబంధించిన గుడ్న్యూస్ అందరితో పంచుకోనున్నాడని స్పష్టమైంది. కాగా, శేష్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన మేజర్, హిట్ 2 చిత్రాలను చేస్తున్నాడు.
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ‘మేజర్’ సినిమాను రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల కానుంది. అలాగే హిట్ 2 విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చి మంచి విజయం సాధించిన `హిట్ .. ది ఫస్టు కేస్`కు సీక్వెల్గా తెరకెక్కుతోంది. హీరో నాని నిర్మిస్తున్న ఈ మూవీ కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది.