ముద్రగడ దీక్ష..సెకండ్ రిలీజ్!!

ఆరునెలల క్రితం వరకు ఆయనెవరో ఎవరికీ పెద్దగా తెలీదు.అంతలోనే కాపులను వుద్దరించేస్తానని కాపు జాతికి తానే బ్రాండ్ ఐకాన్ అని సెల్ఫ్ డబ్బా కొట్టేసి ఎడా పెడా వివాదాలు రేపుతూ వార్తల్లో నిలుస్తు హల్చల్ చేసేస్తున్నాడు. ఖాళి సమయాల్లో పిచ్చాపాటి మాట్లాడుకున్నంత వీజీగా ఈయన దీక్షలపై దీక్షలు చేస్తున్నారు.అంతేనా పోలిసోల్లు కనబడితే చాలు నన్ను అరెస్ట్ చెయ్యండి మొర్రో అని మొత్తుకుంటున్నాడు.అరెస్ట్ లన్నా పోలిసులన్నా ఆయనకి మహా సరదా. సినిమాల్లో బాగా ప్రజాదరణ పొందిన సినిమాలు మళ్లీ […]

మేస్టారు వీక్‌ కాదు, యమ స్ట్రాంగ్‌

పిల్లలకు పాఠాలు చెప్పుకునే మేస్టారు, రాజకీయంగా తాను కొట్టే దెబ్బను తట్టుకోలేరులే అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విషయంలో అనుకుని, భంగపడినట్లున్నారు. కెసియార్‌ కారణంగానే కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా కనిపించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి. అక్కడికి కోదండరామ్‌ చాలా సంయమనం పాటించారు. రెండేళ్ళు వేచి చూసి, తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు తీరతాయనీ, […]

సాక్షి గూటికి కొమ్మినేని!

కొమ్మినేని శ్రీనివాస రావు పరిచయం అక్కర్లేని జర్నలిస్ట్.ఈనాడు,ఆంధ్రజ్యోతి, టివి5,ఎన్టివి వంటి సంస్థల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. NTV లో రోజు ఉదయం ప్రసారమయ్యే KSR లైవ్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు.వివిధ పత్రికల్లో, ఛానళ్లలో పనిచేసిన ఆయన ఇటీవలే ఎన్టివి నుంచి బయటకు వచ్చారు. ఏ పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చిందో,అధికార పార్టీ నుండి ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో,ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మీడియా నడవకపోతే పరిణామాలెలా ఉంటాయో తన బ్లాగ్ లో వివరిస్తూ వాపోయాడు.కాగా […]

జగన్‌ కంచుకోటలో చంద్రబాబు పాగా !

కడప జిల్లా అంటే వైఎస్‌ జగన్‌ కంచుకోటగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటుంది. చిత్తూరు జిల్లాని చంద్రబాబు సొంత జిల్లా అనడం అరుదుగానే జరుగుతుంటుంది గానీ, రాజకీయంగా స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లాను తన కంచుకోటగా మలుచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాలో తన పట్టుని నిలబెట్టుకుంటూ వస్తున్న వైఎస్‌ జగన్‌కి షాక్‌ ఇచ్చేందుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, కడప జిల్లాలో మహా సంకల్ప సభను నిర్వహించారు. కడప జిల్లాలో ఈ దీక్ష కోసం పార్టీ […]

డిప్యూటీ సీఎం రేసులో నారా లోకేష్‌ !

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలోకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేరతారని వినవస్తున్న ఊహాగానాలకు సంబంధించి లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏమిటంటే, ఏదో ఒక మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడికి కట్టబెడితే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే తన కుమారుడ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. ఏప్రియల్‌ లేదా మే నెలల్లో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టవచ్చునని టిడిపి వర్గాలు భావించాయి. అయితే […]

కోదండరామ్ పై గులాబీ దండయాత్ర

తెలంగాణ సర్కార్ తీరే వేరు. తమ వైఖరిని ప్రతిపక్షాలు ఎండగట్టినా పట్టించుకోదు. పైగా విపక్షనేతలపై తనదైన తరహాలో విరుచుకుపడుతుంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తుతుంది. ఇలాంటి అధికార పార్టీ కోదండరామ్ తమను విమర్శించగానే అగ్గి మీద గుగ్గిలమైంది. అధిష్టాన పెద్దలతో పాటూ చిన్నాచితకా నేతలూ ఆయనపై ఫైర్ అయిపోతున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడి ఎన్నికలు రాగానే ఫక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని ప్రకటించుకుంది. టీఆర్ఎస్ లక్ష్యం స్వరాష్ట్రాన్ని సాధించడమే […]

పట్టుబడ్డ రూ.570 కోట్లు ఆ రాజకీయ నేతవే..?!

తమిళనాడు నుంచి ఏపీ వైపు తరలి వస్తూ పట్టుబడి సంచలనం సృష్టించిన రూ.570 కోట్లు ఎవరివి? ఇంత సంచలనం కలిగించిన అంశం గురించి వార్తలు, చర్చలు చప్పున చల్లారి పోయాయేం? నిజంగానే ఈ డబ్బు బ్యాంకులదేనా.. నిజంగానే ప్రభుత్వానికి చెందిన సొమ్మేనా? ఒకవేళ బ్యాంకు వారే ఈ డబ్బును తెప్పించుకుంటున్నట్టు అయితే… ఆ పని సైలెంట్ అయిపోతుంది. కంటెయినర్లలో డబ్బుకు కాపాలాగా పోలీస్ ఫోర్సే ఉంటుంది. అయితే ఇక్కడ కంటైనర్లకు భద్రతగా వచ్చిన వ్యక్తులు చెక్ పోస్ట్ […]