ప్రశ్నిస్తాను అనే ఏకైక నినాదంతో 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అన్ని వర్గాల్లోనూ ఎన్నో ఆశలు రేకెత్తాయి. ప్రశ్నించడం అంటే.. నేరుగా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటాడని, సమస్యలకు పరిష్కారం కనుగొంటాడని, ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్మిస్తాడని అనుకున్నారు. అయితే, తన ప్రశ్నలు, పోరాటాలు కేవలం పిట్ట కూతలకే పరిమితం చేస్తాడని అనుకున్నారా?! అయితే, అది తన తప్పు కాదని అంటున్నాడు పవన్!! అంతేకాదు, అసలీమాత్రం స్పందిస్తున్న వాళ్లెవరైనా ఉన్నారా? […]
Category: Latest News
వైసీపీలోకి కాపు మంత్రి జంప్..!
ఏపీ ప్రధాన, ఏకైక విపక్షం.. వైకాపాకి కొత్త ఊపు రానుందా? ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న కాపు సామాజిక వర్గం త్వరలోనే జగన్ బాట పట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దీనికి ప్రధాన కారణం.. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. రేపో మాపో.. జగన్ జట్టులో చేరనున్నారట! వినడానికి కొంత ఆశ్చర్యం అనిపించినా.. ఇది నిజమేనని అంటున్నారు కొందరు. కాంగ్రెస్‌లో కీలక నేతగా, ముఖ్యంగా వైఎస్ […]
కేసీఆర్ ఆత్మకథలో ఏముంది..!
తెలంగాణ ముద్దుబిడ్డ.. సీఎం కేసీఆర్.. తన రాజకీయ జీవితానికి సంబంధించి ఆత్మకథను అక్షర రూపంలో వెలుగులోకి తెస్తున్నారట. ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సాధారణంగా ఆత్మకథలు రాయడం, పుస్తక రూపంలో తీసుకురావడం కొత్తకాదు. మహాత్మా గాంధీ మొదలుకుని అనేక మంది మేధావులు, మహాత్ములు పుస్తకాలు రాశారు. కానీ, కేసీఆర్ కి వాళ్లకి భిన్నమైన వాతావరణం ఉంది. సొంత దేశంలో స్వపరిపాలన కోసం చేసిన పోరుగా కేసీఆర్ సాగించిన తెలంగాణ ఉద్యమం నేడు చరిత్ర పాఠమైంది! […]
బాబు నుంచి జూనియర్ భలే ఎస్కేప్… లేకుంటే ?
మనం అనుకుంటాం కానీ, అంతా ఆలస్యం అయిపోతోంది! అంతా ఆలస్యం అయిపోతోంది! అని!! ఒక్కొక్కసారి ఆ ఆలస్యమే.. ఎంతో మేలు చేస్తుందట! ఇప్పుడు ఇదే విషయం తారక్ విషయంలోనూ జరిగిందని తెలుస్తోంది. అదేంటంటే.. మొన్నామధ్య ఉధృతంగా తెరమీదకి వచ్చిన తమిళనాడులో జల్లికట్టు విషయం.. అందరికీ తెలిసిందే. దీనిపై సాధారణ ప్రజలు కోలీవుడ్ రోడ్ల మీదకి సైతం వచ్చి పోరాడారు. అదే సమయంలో కొందరు టాలీవుడ్ హీరోలు సైతం తమ స్టైల్లో స్పందించారు. మహేష్ బాబు, పవన్ ఇలా […]
పవన్ కి కేటీఆర్ అలా ఎర్త్ పెట్టారా..?
పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో.. తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ వద్దే నేర్చుకోవాలి! తనకు పోటీగా ఎవరైనా వస్తున్నారని ఆయన భావిస్తే చాలు.. ఎలా వారిని అణగదొక్కాలో బాగా తెలుసు. సొంత పార్టీలోనే మేధావులను సైతం లైన్లో పెట్టిన కేటీఆర్ ఇప్పుడు పవన్ లాంటి పరాయి పార్టీ నేతలను ఎలా లైన్‌లో పెట్టాలో తెలీదా?! ఇప్పుడు అదే జరిగింది తెలంగాణలో.. పవన్ వల్ల తన ఇమేజ్‌కి భంగం వాటిల్లుతుందని అనుకున్న కేటీఆర్ రాత్రికి రాత్రి […]
వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!
ఇంకా రెండేళ్లు ఉండగానే వైసీపీలో టికెట్ల ముసలం మొదలైంది. ముఖ్యంగా ఎలాగైనా ఈసారి పట్టు సాధించాలని చూస్తున్న గోదావరి జిల్లాల్లోనే ఈ రచ్చ ప్రారంభమైంది. కాపు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారం ఆ పార్టీ అధినేత జగన్‌కు తలనొప్పిగా మారింది. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ స్థానంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా […]
హిందూపురం టీడీపీలో సెగలు…సీక్రెట్ మీటింగ్
టీడీపీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది బాలయ్యపై అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయా ? ఆయన ప్రాథినిత్యం వహిస్తోన్న నియోజకవర్గం, టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో బాలయ్యకు యాంటీగా సీక్రెట్ మీటింగ్ పెట్టే వరకు పరిస్థితి వెళ్లిందా ? అంటే అవుననే ఆన్సరే వినిపిస్తోంది. హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇది పెట్టని కోట. ఎన్టీఆర్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కూడా అయ్యారు. ఆయన తర్వాత హరికృష్ణ, […]
ఏపీ పీసీసీ చీఫ్‌గా చిరు ,రఘువీరా వైసీపీలోకి జంప్..!
రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఏ నాయకుడు పార్టీకి గుడ్ బై చెపుతారో ? తెలియని పరిస్థితి ఉంది. అసలు ఏపీ కాంగ్రెస్‌లో కాస్త క్రేజ్ ఉన్న నాయకులు ఎవరా ? అని ప్రశ్నించుకుంటే వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి కూడా లేదు. అలాంటి కాంగ్రెస్‌లో మిణుగురుల్లా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే పెద్ద […]
గోదావరి నేతలకు బాబు క్లాస్ అందుకేనా..!
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చగల నిర్ణయాత్మక శక్తిగా మారాయి. 2014 ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజలు టీడీపీకి అండగా నిలిచాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ సాధించింది, అయితే ఈ మూడేళ్లలో రెండు జిల్లాల్లోనూ టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితులను చక్కదిద్దాలని తన దగ్గరకు వచ్చిన గోదావరి జిల్లాల నేతలకు గట్టిగా చెబుతున్నారని సమాచారం! విభజన […]