తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కోసం అధికార, ప్రతిపక్షంతో పాటు బీజేపీ నుంచి మహామహులు రంగంలో ఉండనున్నారు. దీంతో గెలుపోటములపై ఎవ్వరూ అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార అన్నాడీఎంకే నుంచి పార్టీని తెరవెనక ఉండి అంతా నడిపిస్తోన్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన […]
Category: Latest News
తెలంగాణలో జనసేన టైం స్టార్ట్ అయ్యిందా!
సినీనటుడు పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ ఇటీవలే మూడో వార్షికోత్సవం జరుపుకుంది. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గత ఎన్నికల్లో టీడీపీ+బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించాడు. ఆ తర్వాత పవన్ ఈ రెండు పార్టీలను ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాలపై నిలదీస్తూ జనసేన స్వతంత్య్రతను చాటుతున్నాడు. ఈ క్రమంలోనే పార్టీ పెట్టి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా పవన్ పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చేశాడు. 2019 ఎన్నికల్లో జనసేన రెండు రాష్ట్రాల్లో […]
ఏపీ బీజేపీ నేతల దూకుడుకు బాబు కళ్లెం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత.. ఏపీ రాజకీయ చిత్రంలో అనేక మార్పులు జరిగే వాతావరణం కనిపిస్తోంది. ఎవరు ఎవరికి మిత్రులు అవుతారో.. మరెవరు శత్రువులవుతారో కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీని డీల్ చేసే విషయంలో టీడీపీ నాయకులు, టీడీపీతో వ్యవహరించే విషయంలో బీజేపీ నాయకుల్లోనూ కొంత మార్పు వచ్చినట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పార్టీని విస్తరించాలని బీజేపీ నాయకులు తహతహలాడుతున్నారు. విస్తరణకు ఇదే సరైన సమయమని పార్టీ పెద్దలకు చెబుతున్నారు. ఇదే […]
కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ ఝలక్
తనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బడ్జెట్ రూపంలో సమాధానమిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్! తన వ్యూహాలకు తిరుగులేదని, తనతో పెట్టుకుంటే ఎవరైనా చిత్తు కావాల్సిందేనని మరోసారి రుజువుచేశారు. అంతేగాక కాంగ్రెస్‌ను మళ్లీ మాట్లాడకుండా చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు సందిగ్ధ స్థితిలో పడిపోయారు! ఇప్పటికే అన్ని వర్గాలపై పట్టు సాధించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకే పెద్ద పీటే వేశారు. దీంతో ఇప్పటివరకూ బీసీలకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలకు.. చెక్ చెప్పారు. […]
చిదంబరం ఏంటి.. బీజేపీలో చేరడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా!!
తమిళనాడుపై పట్టు సాధించాలనే ఆశ బీజేపీలో ఇంకా కనిపిస్తూనే ఉంది. మాజీ సీఎం దివంగత జయలలిత మరణం తర్వాత.. ఆమె విధేయుడైన పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చి ఎన్నో ఆటలు ఆడించింది. ఆయన్ను ముందుంచి వెనుక నుంచి చక్రం తిప్పుదామని కలలుగంది. చివరకు సీఎం పీఠం ఎక్కుదామని భంగపడిన శశికళ వర్గానికే సీఎం కుర్చీ దక్కింది. దీంతో ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న ఆశ ఆవిరైంది. అయితే ఇప్పుడు చేరికలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ […]
తెలంగాణలో పవన్ బలం ఎంత..?
2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి! ప్రజాసమస్యలపై పోరాటం, బహిరంగ సమావేశాలు వంటివి నిర్వహించి.. ఏపీ ప్రజల్లోకి జనసేనను తీసుకెళ్లాడు. మరి తెలంగాణలో ఇప్పటివరకూ ఏ సమస్యపైనా స్పందించలేదు! తెలంగాణ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు. అసలు జనసేన ఉనకి తెలంగాణలో అసలు లేనే లేదు. మరి ఇలాంటి సమయంలో.. ఏధైర్యంతో పవన్ తెలంగాణలో పోటీకి దిగుతానని ప్రకటించాడు? ఆయన బలమేంటి? […]
రోజాకు ఏమైనా ప్రత్యేక రూల్స్.. చట్టాలు ఉన్నాయా?
కొత్త అసెంబ్లీలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమామహేశ్వరావు.. మధ్య గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గొడవపై విచారణ కొలిక్కి వచ్చింది. రోజాను `ఆంటీ` అని సంబోధించడం, తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇవన్నీ పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు కొత్త అసెంబ్లీనీ ఈ అంశం కుదిపేస్తోంది. అయితే రోజాను `ఆంటీ` అనడంపై బోండా ఉమామహేశ్వరరావు […]
ఏపీ మంత్రి వర్గంలో `ఫ్యామిలీ` రాజకీయాలు
మంత్రి వర్గ విస్తరణ ముందు.. మంత్రుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి! అసలే మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక ఒకపక్క తీవ్రంగా ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక రూపొందించి.. సీఎం చంద్రబాబుకు అందించాయి. దీంతో అందులో ఏముందో తెలియక మంత్రులు ఒకటే టెన్షన్ పడుతున్నారు. మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. వెనకాల ఉండి చక్రం తిప్పేదంతా వారసులేననే విషయం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చిందట. వారసులే చక్రం తిప్పుతున్నారని, మంత్రులంతా […]
