సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికార పగ్గాలు చేపట్టినపుడు ఆ పార్టీ పైనా.., పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైనా ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కాంగ్రెస్ ఆడిన రాజకీయ జూదంలో ఆ పార్టీ వ్యూహాలు ఎదురుతన్ని.. పరిస్థితులు టీఆర్ఎస్‌కు అనుకూలించడంతో… ఏదో గాలివాటంగా అధికారంలోకి వచ్చిందని భావించినవారే రాజకీయ విశ్లేషకుల్లో అధికశాతం. నిజానికి అందులో వాస్తవం లేకపోలేదు. […]
Category: Latest News
రోజా బూతుల పంచాంగం అందుకేనా..!
వర్తమాన రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉండటం కంటే… ప్రజలను ఏ స్థాయిలో నమ్మించగలమనేదానిపైనే తమ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది అధిక శాతం రాజకీయ నాయకుల నమ్మకం. అందుకే మీడియాలో రాజకీయ నేతల ముఖాముఖి చర్చల్లో దాదాపు మాటల యుద్ధమే జరుగుతోంది. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల చేసే విషయంలో కొందరు నేతలైతే అన్నిహద్దులను ఎప్పుడో దాటేశారు. తమ నోటి దురుసుతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు జుగుప్స కలిగిస్తోంది. ఇక తనను […]
2016లోనే జనసేన పోటీ చేస్తుందా..!
రాజకీయపార్టీగా అవిర్భవించినా ఇప్పటిదాకా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించని జనసేన పార్టీ తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగబోతోందా..? ఆ పార్టీ రాజకీయ తొలి రాజకీయ ప్రత్యక్ష పోరుకు జీవీఎంసీ ఎన్నికలు వేదిక కాబోతోన్నాయా..? ఈ వార్తలు నిజమేనా…? లేక ప్రస్తుతానికి ఊహాగానాలేనా..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రస్తుతం.. ఏపీలో చాలామందికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. విషయమేమిటంటే మహా నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికలపై జనసేన పార్టీ గురిపెట్టిందని తాజాగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ […]
ఏపీకి కొత్త హోం మంత్రి వస్తున్నాడు..!
ఏపీకి కొత్త హోం మంత్రి వస్తున్నారా? ప‌్రస్తుతమున్న హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఊష్టింగ్ తప్పదా? ఆయన వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఔననే సమాధానమే వినిపిస్తోంది అమరావతి పరిసరాల్లో! ఏపీలోని హోం శాఖపై చంద్రబాబు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడు అభివృద్ధి బాటలోకి వస్తున్న ఏపీని అన్ని విధాలా ఫాస్ట్‌గా దూసుకుపోయేలా చేయడంలో హోం శాఖ కీలక మని ఆయన ఎప్పటికప్పుడు చెబుతున్నారు. అయితే, గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాల […]
డీకే అరుణకు కేసీఆర్ దిమ్మతిరిగే ఆఫర్
తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అయిన డీకే అరుణ పట్టుబట్టి ఉద్యమాలు చేసి ప్రత్యేక గద్వాల్ జిల్లాను ఏర్పాటు చేయించుకున్నారు. అరుణ మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్నారు. 1999 నుంచి వరుసగా ఓటమి లేకుంగా గద్వాల్ నుంచి విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసేందుకే విపక్షాల నాయకులు భయపడిపోతున్నారు. కేసీఆర్‌తో పాటు అధికార టీఆర్ఎస్‌పై విమర్శలు చేసే తక్కువ మందిలో డీకే […]
పవన్ వార్నింగ్ – టీడీపీ కౌంటర్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విషయం.. ఇప్పుడు జనసేన, టీడీపీల మధ్య కౌంటర్-రివర్స్ కౌంటర్‌లకు దారితీస్తోందా? అక్కడ ప్లాంట్ వద్దు, ప్రజలను బాధపెట్టొద్దు అన్న పవన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చిందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. పార్క్ విషయంలో రైతుల గోడు విన్న పవన్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టి.. బాధితుల సమస్యలను నేరుగా మీడియాకే వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదులు […]
ఆ సమస్య చంద్రబాబును నలిపేస్తోందిగా
దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది- ఇది ఓ మూవీలో నూతన్ ప్రసాద్ డైలాగ్! అప్పట్లో ఇది పాపులర్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే అనుకోవాల్సి వస్తోందట! పశ్చిమ గోదావరిలో కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఆక్వా ఫుడ్ పార్క్ చంద్రబాబుని క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేసింది. పార్కుని వద్దంటూ జిల్లా వ్యాప్తంగా రైతులు నిసరన గళం వినిపిస్తున్నారు. మొన్నటి వరకు భీమవరం పరిసర ప్రాంతాలకే పరిమితం అయిన ఈ ఆందోళన ఇప్పుడు […]
కేసీఆర్ సత్తాకు..ఈ సమస్యలే పెద్ద సవాల్
సంపన్న రాష్ట్రం ఏంటి? సమస్యలేంటని ఆశ్చర్యంగా ఉందా? ఉమ్మడి రాష్ట్ర విభజనతో సంపన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన విషయం తెలిసిందే. 2014-15 లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రూ.7500 కోట్ల మిగులు బడ్జెట్‌తో పాలనను ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక సంఘమే స్పష్టం చేసింది. దీంతో దేశంలో గుజరాత్ తర్వాత సంపన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ప‌్రభుత్వం డబ్బుల విషయంలో నిక్కచ్చిగానే వ్యవహరిస్తోందా? అంటే అందరూ తెల్లమొహం […]
బాబుకు మరో తలనొప్పి తప్పదా..!
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో తలనొప్పి తప్పేలా లేదు! కాపుల రిజర్వేషన్ రూపంలో ఇప్పటికే చంద్రబాబును ఆయన ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఇప్పుడు తాజా గా మరోసారి సత్యాగ్రహ పాదయాత్ర రూపంలో ఉద్యమించేందుకు సిద్ధం అవుతున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చి రెండేళ్లకాలం పూర్తయిపోయినా.. ఇప్పటి వరకు చంద్రబాబు తన హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ.. ముద్రగడ ఆరోపించడమే కాకుండా […]