ఆ రాయలసీమ మంత్రి కి ఉద్వాసన.. ఆ ఎమ్మెల్సీ లీకువీరుడేనా..!

టీడీపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ స‌రికొత్త లీకుల‌కు వేదిక‌గా మారుతోంది. ఫ‌లానా వ్య‌క్తి మంత్రి ప‌ద‌వి పోతుంద‌ని.. ఆ స్థానంలో మ‌రోవ్య‌క్తి మంత్రి అవుతార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ముఖ్యంగా అనంత‌పురానికి చెందిన  మంత్రి ప‌ల్లె ర‌ఘనాథ‌రెడ్డికి కూడా ఈసారి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేగాక ప‌ల్లె స్థానంలో అదే జిల్లాకు చెందిన ప‌య్య‌వుల కేశ‌వ్ పేరు సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ లీకుల వెనుక కేశ‌వ్ ఉన్నాడ‌ని, మంత్రి ప‌ద‌వి […]

టీ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన స‌ర్వే

టీ కాంగ్రెస్‌లో ఐదుగురు లీడ‌ర్లు…60 గ్రూపులు అన్న చందంగా ప‌రిస్థితి ఉంది. ఒక‌రికి ఒక‌రికి అస్స‌లు ప‌డ‌డం లేదు. సీనియ‌ర్ నాయ‌కులు ఎవ‌రికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఈ టైంలో ఓ స‌ర్వే ఇప్పుడు వీరి మ‌ధ్య పెద్ద చిచ్చు రేపింది. తాజాగా స‌ర్వే ఫ‌లితాలంటూ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ చేసిన ప్ర‌క‌ట‌న అగ్నికి ఆజ్యం పోసింది. టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో ఓ స‌ర్వే చేశామ‌ని చెప్పిన కాంగ్రెస్ కు 55 స్థానాలు గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. […]

ఆ మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ … ఎందుకంటే ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీన్ రివ‌ర్స్ అయింది. మొన్న‌టివర‌కూ అధికార ప‌క్షం హ‌వా న‌డిచిన చోట‌.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి. వైసీపీని వీడి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోతుంటే.. వారి ప్ర‌త్య‌ర్థులుగా, టీడీపీలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న‌వారు వైసీపీ కండువా క‌ప్పేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌ల స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న అధినేత జ‌గ‌న్‌కు.. పార్టీలో చేరిన, చేర‌బోయే వారిని అస్త్రాలుగా మార్చ‌బోతున్నారు. ప్ర‌స్తుతం తాడిప‌త్రి, ఆళ్ల‌గ‌డ్డ‌, […]

కేసీఆర్ కు కోవర్టుగా కాంగ్రెస్ మాజీమంత్రి

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఉనికి కాపాడుకోవాల‌ని కాంగ్రెస్ చేస్తున్న ప్రయ‌త్నాలు ఒక‌డుగు ముందుకి వంద‌డులు వెన‌క్కి అన్న చందంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ముదురుతున్న విభేదాలు.. అంత‌ర్గ‌తంగా ఉన్న క‌ల‌హాల‌కు ఆజ్యం పోస్తున్నాయి! ముఖ్యంగా మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నార‌ని, టీఆర్ఎస్‌కు ఏజెంట్‌లా మారిపోయార‌నే విమ‌ర్శ‌లు  వినిపిస్తున్నాయి. వ్య‌క్తిగ‌త […]

వైసీపీ క్యాడర్ ను తికమక పెడుతున్న మాజీమంత్రి

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో `గోపి(గోడ మీద పిల్లి)`లు ఎక్కువమంది! ఏమాత్రం మంచి అవ‌కాశం వ‌చ్చినా  ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి..  ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిపోయే నాయ‌కులే ఎక్కువ‌! ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉంటూ.. అటు అధికార పార్టీ నేత‌లోనూ స‌న్నిహిత సంబంధాలు నెరుపుతూ.. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్న వారే అధికం!! ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని ఒక మాజీ మంత్రి కూడా ఇలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఆమె ఏ పార్టీకి చెందిన వారో తెలియక […]

శశికళ వర్గంపై పోరు ఆగదు … పన్నీరు సెల్వం కొత్త పార్టీ

మ‌డ‌మ తిప్పే అవ‌కాశం లేదంటున్నారు త‌మిళ‌నాడు మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం! శశిక‌ళ వర్గంపై పోరు ఆగ‌దు అని స్ప‌ష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో.. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ప‌న్నీర్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. త‌న‌పై వేటు ప‌డ‌టం ఖాయ‌మ‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న‌.. స‌రికొత్త రాజ‌కీయ వేదిక‌ను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకేలో కొన‌సాగ‌లేక‌.. డీఎంకేలో చేరే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో సొంతంగా పార్టీ పెట్టాల‌ని నిర్ణయించుకున్నార‌ట‌. పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారుచేసిన‌ట్టు […]

బాబు చతురతలో చిక్కుకున్న బీజేపీ.

వ్యూహ ర‌చ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేరనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! మిత్ర ప‌క్షం బీజేపీని కూడా తన చ‌తుర‌త‌తో ఇబ్బంది పెట్టి.. తెలివిగా ప‌నులు చేయించుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేత‌లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. అవి బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం చేర‌కుండా చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టికెట్ల కేటాయింపుల్లోనూ బాబు చ‌తుర‌త‌ బ‌య‌ట‌ప‌డిందట‌. బీజేపీకి టికెట్ ఇవ్వ‌లేద‌నే మాట నుంచి త‌న‌ను కాపాడుకోవ‌డానికి, ఇచ్చినా గెలుపొంద‌లేక‌పోయార‌నే అప‌వాదు బీజేపీపై నెట్టేయ‌డానికి సూప‌ర్ […]

టీఆర్ఎస్ ఎంపీగా గుత్తా జ్వాల..! రెండు నియోజకవర్గాలపై కన్ను..!

బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిగా ఆమె ఎంత ఫేమ‌స్సో.. ఆట‌లో రాజ‌కీయాల్లోనూ ఆమె అంతే ఫేమ‌స్సు!! నిత్యం వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తూ.. త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది గుత్తాజ్వాల‌! ప్ర‌స్తుతం ఆమె ఆట‌కు గుడ్‌బై చెప్పాల‌నే యోచ‌న‌లో ఉంద‌ట‌. అయితే ఏంటి అంటారా! ఆట‌కు ఫుల్‌స్టాప్ పెట్టి.. రాజ‌కీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాని భావిస్తోంద‌ట‌.  అంతేగాక తెలంగాణ‌లో టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎంపీగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఈ మేర‌కు సంబంధింత నాయ‌కుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. అంతేగాక ఎక్క‌డి నుంచి పోటీ […]

బలపరీక్ష వెనుక పళని స్వామి `హైబడ్జెట్` మూవీ

త‌మిళ‌నాట ఎన్నో రాజ‌కీయ ప‌రిణామాల త‌ర్వాత కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. చిన్న‌మ్మ న‌మ్మినబంటు ప‌ళ‌నిస్వామి బ‌ల ప‌రీక్ష‌లో విజ‌య‌వంతంగా గ‌ట్టెక్కారు. ఎమ్మెల్యేలు అంతా చేజారిపోర‌నే ధీమా.. అంతా త‌న‌కే మద్దతు ఇస్తార‌నే ఆత్మ‌విశ్వాసం ఆయ‌న‌లో తొలి నుంచి మెండుగా ఉన్నాయి. అయితే దీని వెనుక చాలా `హైబ‌డ్జెట్‌` క‌థే న‌డించింద‌ని స‌మాచారం. గెలుపు కోసం.. అంత‌కుమంచి సీఎం కుర్చీని ద‌క్కించుకునేందుకు చేతి చ‌మురు బాగానే వ‌దుల్చు కున్నార‌ట‌. ఎన్నిక‌ల్లో ఖర్చు పెట్టే దాని కంటే.. `అంతకు మంచి` […]