అమలాపురం దళిత ఎంపీ రవీంద్రబాబు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లానని అయితే అక్కడ ఉన్న సీఎం క్యాంప్ ఆఫీసు సిబ్బంది తీవ్రంగా అవమానించారని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంపీ అని చెప్పిన కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారు అన్నారు . సీఎం లేరని భద్రతా సిబ్బంది చెప్పారని, పేషీలో కార్డు ఇస్తానంటే వినలేదన్నారు. పార్లమెంటు సభ్యుడి గుర్తింపు కార్డు చూపినా […]
Category: Latest News
వైసీపీలో నూతన ఉత్సాహం కారణం అదే!
చాలాకాలం నుండి ప్రధాని అపాయింట్మెంట్ దొరకక లోలోపల జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ మదనపడుతున్నవేళ ప్రధాని అపాయింట్మెంట్తో జగన్ తో సహా వైస్సార్సీపీ నాయకులకి మొహాలలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతుంది . టీడీపీ దోస్తీతో మరియు చంద్రబాబు స్నేహం కారణంగా మోడీ జగన్ ని దూరం పెడుతున్నారు అని వైస్సార్సీపీ నాయకులూ అనుకునేవారు .ఎట్టకేలకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకటం మోడీ జగన్‌ను చూసిన వెంటనే జగన్ ను పేరు పెట్టి పిలవటం చూసి చంద్రబాబు మీద ప్రేమ […]
నియోజకవర్గంలో తిరుగులేని లీడర్ కానీ ప్రజల మాట మరోలా..!
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి ధూళిపాళ్ల ఫ్యామిలీకి బలమైన అనుబంధం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే నరేంద్ర గెలుస్తున్నారు. గతంలో ఆయన తండ్రి వీరయ్య చౌదరి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 1994 నుంచి అక్కడ తిరుగులేని విజయాలు సాధిస్తోన్న నరేంద్ర పొన్నూరును తన అడ్డాగా చేసుకున్నారు. 2004లో వైఎస్ గాలిలో జిల్లాలో 18 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా నరేంద్ర గెలిచాడంటే నరేంద్ర స్టామినా అర్థమవుతోంది. ఐదుసార్లు […]
`కంటెంట్` లేని ట్వీట్లతో పవన్‌కే నష్టమా?
రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ట్వీట్లు లేదా బహిరంగ లేఖల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాన్! ప్రస్తుతం ఆయన రాసిన ఒక లేఖ, చేసిన ఒక ట్వీట్ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంతేగాక జనసేన రీసెర్చి డిపార్ట్‌మెంట్‌పై సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి! ఏదైనా అంశంపై మాట్లాడాలంటే అధ్యయనం తప్పనిసరి. అన్ని విషయాల్లోనూ కంటెంట్ తో మాట్లాడే పవన్.. రెండు విషయాల్లో మాత్రం కంటెంట్ లేకుండా మొక్కుబడిగా […]
సౌమ్యుడన్న మంచి ఇమేజె.. కానీ జనసేన పోటీ ప్రభావం ఎంత?
మండలి ఫ్యామిలీ నుంచి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మండలి బుద్ధ ప్రసాద్ పేరు వినగానే మనకు రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష కోసం పరితపించే వ్యక్తిగా మదిలో మెదులుతుంది. దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మండలి బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ నుంచి 1999, 2004లో రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పాలనలో మంత్రిగా పనిచేసిన బుద్ధప్రసాద్‌కు వ్యక్తిగతంగా సౌమ్యుడన్న మంచి ఇమేజ్ ఉంది. 2009లో ఓడిపోయిన […]
తెలుగు గడ్డపై మరో కొత్త పార్టీ
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కొత్తగా ఆవిర్భవించిన జనసేన.. ఇంకా కొన్ని చిన్న చిన్న పార్టీలు లెక్కకు మంచి ఉండనే ఉన్నాయి. వీటిలోనే ఏ పార్టీ ఓటు వెయ్యాలా అని ఓటర్లు గందరగోళపడుతుంటే ఇప్పుడు మరో పార్టీ రాబోతోంది. అదికూడా టీఆర్ఎస్ బలంగా ఉన్న తెలంగాణలో కొత్త పార్టీ పురుడుబోసుకోబోతోంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ పక్కగా ప్రణాళికలు రూపొందిస్తుంటే.. ఆ పార్టీ మాజీ పొలిట్ […]
లోకేష్ ముందు వాళ్ళ ఆటలు సాగవా?
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీలో తన పట్టు పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీనియర్ మంత్రులు ఉన్నా.. వారి వ్యవహారాలు కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు తనతోపాటు మంత్రి వర్గంలో చేరిన వారి వంతు వచ్చింది. కేవలం వారిది మంత్రి వర్గంలో నామమాత్రపు పాత్రేనని తేలిపోయింది. మంత్రులే అయినా వారి పీఏ, పీఆర్వోలను కూడా నియమించుకోలేని పరిస్థితి. తమ సిబ్బందిని కూడా లోకేష్ […]
రేవంత్‌పై ఉన్న నమ్మకం టీడీపీపై లేదా?
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలు కూడా జోరందుకుంటాయి. ఇందులో కొన్ని సర్వేలు ఆశ్చర్యకంగానూ, మరికొన్ని షాకింగ్‌గానూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణాలో నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి తెలుగుదేశం, కాంగ్రెస్‌కు పార్టీలకు ఒక తీపి, ఒక చేదు వార్తను అందించాయి. ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్.. అత్యంత పాపులర్ నాయకుడు. వారి తర్వాత ఎవరు అంటే? కేటీఆర్, హరీశ్‌రావు ఇలా పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ సర్వే ప్రకారం కేసీఆర్ తర్వాత.. అంతటి […]
టీటీడీ ఈవో నియామకంపై రచ్చ తగునా?
`టీటీడీ ఈవోగా ఉత్తరాదివారిని ఎందుకు నియమించారు? అందుకు తగిన సమర్థులు ఏపీలో లేరా?` అంటూ ట్విటర్లో ఘాటుగా స్పందించారు జనసేనాని పవన్ కల్యాణ్!! `తెలుగు రాని వ్యక్తిని ఆ పదవికి ఎందుకు కట్టబెట్టారు` అంటూ శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామి ప్రశ్న!! ఒక వ్యక్తి నియామకంపై ఇప్పుడు ఏపీలో సరికొత్త చర్చ మొద లైంది. రాజకీయ నాయకుడు ఒకరు.. ఆధ్యాత్మక వేత్త మరొకరు ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా ఫోకస్ చేస్తున్నారు? దీని వల్ల వారికి […]