తెలంగాణలో వెల్లువలా ముంచుకొస్తున్న అసంతృప్తి సెగ

మా ప్రాంతం వారికే ఉద్యోగాలు, మా నీళ్లు మాకే సొంతం- నినాదంతో ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు పోరాడిన సంగ‌తి తెలిసిందే! కానీ ఇప్పుడు అదే రాష్ట్రంలో మ‌రోసారి మ‌ళ్లీ ఈ నినాదంతో పోరాటం రాబోతోందా? తెలంగాణను విభ‌జించి మ‌రో రాష్ట్రం చేయాల‌నే ఉద్య‌మాలు రాబోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలంగాణ అనే మాట‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ‌పై సీఎం కేసీఆర్ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని […]

టీబీజేపీ కొత్త ప్లాన్‌.. `ఆప‌రేష‌న్ కాంగ్రెస్

దేశ‌మంతా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాషాయ జెండా రెప‌రెప‌లాడించాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా!! ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ‌పై పూర్తిగా ఫోక‌స్ పెట్టారు. ఎలాగైనా అక్క‌డ క‌మ‌లానికి కొత్త ఉత్సాహాన్ని నింపాల‌ని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే త్వ‌ర‌లో అక్క‌డ పర్య‌టించ‌బోతున్నారు. అయితే అంత‌కంటే ముందే తెలంగాణ‌లో భారీగా వ‌ల‌స‌లు జ‌ర‌గ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరందుకుంది. అనుకున్న స్థాయిలో బ‌ల‌ప‌డేందుకు అంతే స్థాయిలో వ‌ల‌స‌ల‌ను కూడా ప్రోత్స‌హించాల‌ని బీజేపీ నాయక‌త్వం బ‌లంగా న‌మ్ముతోంద‌ట‌. ముఖ్యంగా […]

టీడీపీ నేత‌ల‌ అత్యుత్సాహం కొంప‌ముంచుతోందా?

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది. ప్రభుత్వ‌-విప‌క్ష నేత‌ల మధ్య మాట‌ల యుద్ధం ప్రారంభ‌మైంది. అలాగే తెలుగు త‌మ్ముళ్ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంత‌రం వైసీపీ నేత‌లు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. ప‌రామ‌ర్శించ‌డం మాని.. విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం కొంత విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. దీంతో ఎన్న‌డూ లేని […]

తెలంగాణ‌లో వైసీపీలోకి రివ‌ర్స్ జంపింగ్‌లు

ఏపీలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ.. తెలంగాణ‌లో మ‌నుగ‌డ సాధించ‌డానికి అవ‌స్థలు ప‌డుతోంది. ఆ పార్టీకి చెందిన నాయ‌కులంతా గులాబీ కండువా క‌ప్పేసుకోవ‌డంతో నాయ‌కులు ఎవ‌రైనా ఉన్నారో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ఇప్పుడు వైసీపీలో జోష్ నింపే ప‌రిణామం జ‌రిగింది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో పార్టీనుంచి వెళ్లిపోయిన నేత‌లు.. మ‌ళ్లీ సొంత‌గూటికి వ‌స్తున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ స్త‌బ్ధుగా ఉన్న వైసీపీకి కొత్త ఉత్తేజం వ‌చ్చినట్ట‌యింది. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్‌లో ఇమ‌డ‌లేక‌పోయిన వారు మ‌రికొంద‌రు బ‌య‌టికి వ‌స్తారేమో […]

పోటీకి స‌సేమిరా అంటున్న వైసీపీ నేత‌లు

క‌ర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక అటు టీడీపీ. ఇటు వైసీపీకి తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. ఆ సీటు త‌మ వ‌ర్గం వారికి కావాలంటే..  త‌మ వారికి కావాల‌ని మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, శిల్పా మోహ‌న్ రెడ్డి వ‌ర్గం తీవ్రంగా ప‌ట్టుబట్టాయి. ఇప్పుడు ఆ సీటు ఏ వ‌ర్గానికి కేటాయించాల‌నే అంశంపై సీఎం చంద్ర‌బాబు స‌ర్వే నిర్వ‌హిస్తున్నార‌నే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. వైసీపీలో ప‌రిస్థితి ఇంకోలా ఉంది. అభ్య‌ర్థులు ఉన్నా.. పోటీ […]

ఆప్ ఇంటిపోరులో స‌మిధ‌లెవ‌రు?

ఇంత‌లోనే ఎంత వ్య‌త్యాసం! ఢిల్లీ రాజ‌కీయాల‌ను `చీపురు`తో తుడిచేయాల‌ని ఉన్న‌త ఉద్యోగాన్ని వ‌దిలి వ‌చ్చిన `సామాన్యుడి`ని ప్ర‌జ‌లు అంద‌ల‌మెక్కించారు. రాజ‌కీయాల్లో మార్పు త‌థ్య‌మ‌ని భావించి అనూహ్య విజ‌యాన్ని అందించారు. ఏళ్లు గ‌డుస్తున్న కొద్దీ.. ఆ సామాన్యుడిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. లంచం తీసుకున్నాడంటూ.. ఏకంగా ఏసీబీకి కూడా ఫిర్యాదుచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏకంగా సామాన్యుడి సైన్యంలోని కొంత‌మంది తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో ఆ సామాన్యుడు, ఆమ్ ఆద్మీ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స‌త‌మ‌త‌మవుతున్నారు. ఆమ్ ఆద్మీలో […]

బాబుపై రాయ‌పాటి వ్యాఖ్య‌ల వెనుక రీజ‌న్ ఇదే

విశాఖ రైల్వే జోన్ అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఎంపీలంతా ఒక స‌మావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే దీని నుంచి అర్ధంత‌రంగా బ‌య‌టికొచ్చిన ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఎన్నిసార్లు భేటీ అవుతున్నా జోన్ ఎందుకు రావ‌డం లేదని ఘాటుగానే ప్ర‌శ్నించారు. అయితే చంద్ర‌బాబుపై ఇంత‌లా ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డం వెనుక కారణం కూడా లేక‌పోలేద‌ట‌. […]

టీడీపీకి షాక్‌:  బీజేపీకి వైసీపీ మ‌ద్ద‌తు

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. మిత్రుల మ‌ధ్య క‌ల‌హాలు.. కొత్త పొత్తులు, వ్యూహాల‌తో రాజ‌కీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తోంద‌ని మీడియా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు చూచాయ‌గా ఒప్పుకున్న‌ట్లు ఆస‌క్తిక‌ర క‌థ‌నం చ‌క్కెర్లు కొడుతోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం.. ఇప్పుడు టీడీపీకి మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. ప్ర‌తిప‌క్ష వైసీపీతో బీజేపీ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తోంద‌నే […]

లోకేష్ `ఐటీ`లో పాస‌య్యే బాధ్యత చంద్ర‌బాబుదే

ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్నారు చంద్ర‌బాబు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌.. ఐటీ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం.. పెద్ద ఎత్తున కంపెనీలు, ఉద్యోగాలు తీసుకొస్తాన‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. సంక్షోభాల నుంచి అవ‌కాశాలు సృష్టించుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. ఇప్పుడు ఏపీలో శ‌ర‌వేగంగా ఐటీ కంపెనీల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మరి ఈ […]