ఏపీలో వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ ఫీవర్ పట్టుకుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారికి అయినా ఈ ఫీవర్ మామూలుగా లేదు. ఇప్పుడు అందరి నోట ప్రశాంత్ సర్వే మాటే వినిపిస్తోంది. ప్రశాంత్ ఏకంగా రూ. 8 కోట్ల వరకు ఖర్చు చేసి గ్రామస్థాయి గ్రామస్థాయి వరకు రిపోర్టులు తయారు చేయించారు. ఈ సర్వే నివేదికలు జగన్ వద్దకు వెళ్లిపోయాయి. జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినవి అన్నీ పాటిస్తున్నాడన్న లీకులు వైసీపీ నాయకులందరికి తెలిసిపోయాయి. దీంతో […]
Category: Latest News
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం చాలా హాట్‌హాట్
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో ఫైరైయ్యారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కొందరు మంత్రులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల బాబు పనితీరుపై జాతీయ స్థాయి సంస్థ చేసిన సర్వేలో 47 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్టు ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి శాతాన్ని 47 శాతం నుంచి […]
టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు?
తెలంగాణలో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. తర్వాత ఇది సాధ్యపడేదే కాదంటూ కొందరు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్యే ఈ చర్చ రావడంతో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంగతేంటి? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్-రేవంత్ ఒకే ఒరలో ఇమడని రెండు కత్తులన్న విషయం […]
జనసేనలో కన్నాకు ప్రత్యర్థి రెడీ..!
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి! విభజన తర్వాత రాజకీయాలకు అత్యంత కీలకంగా మారిన గుంటూరులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలియదుగానీ.. ప్రస్తుతం మాత్రం రాజకీయ పార్టీల నేతలకు మాత్రం కల్పతరువుగా మారబోతోంది. ఇప్పటికే ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో గుంటూరు రాజకీయాల్లో ఊహించని పరిణామం ఎదురైంది. జిల్లాకు చెందిన పారిశ్రామిక […]
టార్గెట్ జగన్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్‌ను, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విడదీసి చూడలేం! అంతలా కాంగ్రెస్‌ను తనలో ఐక్యం చేసేసుకున్నాయాన! ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా జగన్ వైపు వెళ్లిపోవడం.. ఇదే సమయంలో విభజన జరగడం.. ఇలా దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఏపీలో కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది. అయితే వచ్చే ఎన్నికల సమయానికి కొంతైనా పుంజుకోవాలని పార్టీ తహతహలాడుతోంది. ఇదే సమయంలో వైఎస్ పేరు చెప్పి.. తమ […]
రామోజీకి – చంద్రబాబుకు దూరం ఎందుకు
తెలుగుదేశం-ఈనాడు బంధం బీటలు వారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుకు మధ్య దూరం పెరుగుతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈనాడు, టీడీపీది దశాబ్దాల అనుబంధం! ప్రస్తుతం ఇది క్రమక్రమంగా తగ్గుతోందనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఈనాడు తర్వాత టీడీపీని ఎక్కువ మోస్తున్న సంస్థ ఆంధ్రజ్యోతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. తన రాజకీయ గురువు రామోజీరావును చంద్రబాబు పక్కనపెట్టడం వెనుక కారణాలేంటనే […]
టీడీపీకి ఓట్లు వేయం…ఇది వారి మాట!
ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకుండానే అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి నోటిఫికేషన్ రాకుండానే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసేశాడు. మంత్రి అఖిలప్రియకు సైతం తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవడం కఠినపరీక్షగా మారింది. దీంతో ఆమె సోదరుడిని వెంటపెట్టుకుని ఆశీర్వాద […]
ఆయన విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్..మరి అఖిలప్రియ ఏం చేస్తదో!
ఉప ఎన్నికల వేళ నంద్యాల టీడీపీలో రగడ రగడ జరుగుతోంది. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ వీడడంతో జగన్ ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. శిల్పా వైసీపీలోకి వెళ్లిపోవడంతో ఆయన సోదరుడు ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అయిన శిల్పా చక్రపాణిరెడ్డి సైతం వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఎలా ఉన్నా చక్రపాణిరెడ్డి మాత్రం తాను టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. చక్రపాణిరెడ్డి తాను టీడీపీని […]
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏపీ, తెలంగాణలో గెలుపెవరిది…
ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పటినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. కొత్తగా రాజకీయ తెరపై భవితవ్యాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించిన జనసేన.. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? సీఎం కావాలనుకునే ప్రతిపక్ష నేత జగన్ ఆశలు ఈసారి నెరవేరతాయా? అటు టీఆర్ఎస్‌లో మళ్లీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయి? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు […]
