ఏపీ పొలిటికల్ పార్టీల్లోకి నేతల చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉన్నా కూడా.. నేతలు ఇప్పటి నుంచే తమ స్టేజ్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు, మాజీ సీఎం దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి విపక్ష వైకాపా లోకి జంప్ చేశారు. ఈయన తండ్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కూడా అయిన కాసు వెంకట కృష్ణారెడ్డి ఇప్పటికీ […]
Category: Latest News
కల్వకుంట్ల ఫ్యామిలీకి తలనొప్పిగా కంట్లో నలుసు
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) స్టేట్‌లో తనకు తిరుగులేని శక్తిగా అవతరించారనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టి.. ఇప్పటి వరకు అన్ని విషయాల్లోనూ ఆయన చేసిన ప్రయత్నం ఆయనను సీఎంను చేసింది. దీంతో తన కుమారుడు, కుమార్తెను సైతం పాలిటిక్స్‌లోకి దింపేశారు. ఇక, స్టేట్‌లో కారు మాత్రమే దూసుకుపోవాలని పక్కా ప్లాన్ వేసిన కేసీఆర్.. ఇటు టీడీపీని, అటు వైకాపాను కూడా దాదాపు నామ రూపాలు […]
రెడ్లకూ యాంటీ అవుతోన్న జగన్
పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరమూ కాదు! ఈ రోజు జై కొట్టిన నోళ్లే రేపు విమర్శిస్తాయి. ఈ రోజు జెండా మోసిన చేతులే రేపు ఛీత్కరిస్తాయి! ఈ పరిస్థితి రాజకీయాలకు, రాజకీయ నేతలకు కొత్తకాదు. ఇలాంటి పరిస్థితే.. ఏపీ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్‌కి ఎదురుకానుందనే టాక్ నడుస్తోంది. ఇంత వరకు తనకు నైతిక బలంగా ఉన్న తన సొంత సామాజిక వర్గం రెడ్లే ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని, తనను […]
ఏపీలో బీజేపీ – టీడీపీ మధ్య కొత్త చిచ్చు
ఏపీకి ప్రత్యేక హోదా మిత్రపక్షాలు అయిన టీడీపీ – బీజేపీ మధ్య చాలా రోజుల పాటు చిచ్చు రాజేసింది. ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో బీజేపీ, టీడీపీ నేతలు చాలా రోజుల పాటు సవాళ్లు , ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చివరకు టీడీపీనే ‘ప్యాకేజీ’తో సరిపెట్టుకుని హోదా వేస్ట్ అని తేల్చటంతో అసలు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొద్ది రోజుల వరకు చంద్రబాబుపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ నేతలు సైతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు […]
కామ్రేడ్లతో జనసేన పొత్తు ఎవరికి లాభం..!
పొలిటికల్ పార్టీలన్నాక పొత్తులు, ఎత్తులు తప్పవు! ఏపీ విషయానికి వచ్చే సరికి 2019 ఎన్నికలు అత్యంత కీలకం. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన పాలనకు మార్క్‌గా 2019 ఎన్నికలను భావిస్తున్నారు. ఇక, విపక్షం వైకాపా అధినేత జగన్ ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఇక, 2014లో పురుడు పోసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ జనసేనను అధికారంలోకి తీసుకురావాలని(పైకి చెప్పకపోయినా?) యత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఎవరి రేంజ్‌లో వాళ్లు […]
ఏపీలో వైకాపా మంత్రులు వీరే!
ఏంటి., ఆశ్చర్యంగా ఉందా? ఆలు లేదు చూలు లేదు.. అన్నట్టు.. వైకాపా మంత్రులు ఏంటి? పాలించడం ఏంటి? అని నొరెళ్ల బెడుతున్నారా? కానీ, ఇది నిజం. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు.. తమను తాము మంత్రులుగా ఊహించుకుని మొన్నామధ్య భలే ఎంజాయ్ చేసేశారు. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని పేర్కొంటూ మొన్నామధ్య సీఎం చంద్రబాబును కలిశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన 32 మంది వైకాపా […]
చంద్రబాబుకు మరో ఇరకాటం
ఏపీ ఏకైక విపక్షం జగన్ నేతృత్వంలోని వైకాపా నుంచి చంద్రబాబుకు మరో ఇబ్బంది ఎదురుకానుందా? తాను ఎంతో ఫ్యూచర్ ఆలోచించి వైకాపా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సైకిల్ ఎక్కించుకున్న పాపానికి ఇప్పుడు బలి కావాల్సి వస్తోందా? త్వరలోనే దీనిపై రాజ్యసభలో పెద్ద ఎత్తున గందరగోళం జరిగే ఛాన్స్ కనిపిస్తోందా? అంటే.. ప్రస్తుతం ఉన్న పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. జగన్ ఇమేజ్ కానివ్వండి, వాళ్ల సొంత ఇమేజ్ కానివ్వండి 2014 ఎన్నికల్లో గెలిచిన వైకాపా అసెంబ్లీ సభ్యులు మొత్తంగా […]
పవన్ కొత్త ఫ్రెండ్ షిఫ్
పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవరు ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తారో? ఎప్పుడు ఎవరితో తెగతెంపులు చేసుకుంటారో? చెప్పడం కష్టం. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే జనసేన, సీపీఐల మధ్య సాగుతోందని సమాచారం. తొలి నుంచి ఏదో ఒక పార్టీతో అంటకాగడం తప్ప సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే సత్తాలేని కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు తమకు కలిసివచ్చే నేతలు, పార్టీల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా వారికి జనసేనాని కొండంత అండగా కనిపించాడట. వాస్తవానికి టీడీపీతో జత కట్టాలని భావిస్తున్నా.. […]
బాబు మోడీని సేవ్ చేస్తాడా..!
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అతి పెద్ద సమస్య కరెన్సీ! కేవలం 0.28% మంది ఉన్న నల్ల కుబేరుల కోసం 99.73% మంది ప్రజలు బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో జీతాలు, తదితర డబ్బు ఉన్నా.. కనీసం ఖర్చులకు సైతం చేతిలో చిల్లి గవ్వలేక నానాతిప్పలు పడుతున్నారు. ప్రధాని మోడీ రాత్రికి రాత్రి వెల్లడించిన కరెన్సీ స్ట్రైక్స్ నల్ల కుబేరుల మాటేమో కానీ.. సామాన్యులు, మధ్యతరగతి వారిని మాత్రం షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా… ఏటీఎంల ముందు, […]