చంద్ర‌బాబు త‌ల‌నొప్పులు వ‌ద్దంటోన్న కేసీఆర్‌..!

ఎప్ప‌టి నుంచో ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే పూర్త‌య్యింది. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న చాలా సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువైంది. సంచ‌ల‌నాలు అనేకంటే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించ‌ని వారికి అనూహ్యంగా కేబినెట్‌లో బెర్త్ ద‌క్కితే…మంత్రి ప‌ద‌వి ఆశ‌లు పెట్టుకున్న వారికి మొండిచేయి ఎదురైంది. దీంతో మంత్రి ప‌ద‌వి రాని సీనియ‌ర్లు రాజీనామాల అస్త్రాలు సంధించ‌డంతో ఏపీ రాజ‌కీయం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారి ఒక్క‌సారిగా హీటెక్కింది. ఇక మంత్రి వ‌ర్గం నుంచి ఊస్టింగ్‌కు గురైన సీనియ‌ర్ […]

మీడియాకు కేసీఆర్ కూల్ వార్నింగా..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాట‌ల మాంత్రికుడ‌ని, ప్ర‌తిప‌క్షాల‌న్నా…రాజ‌కీయ చ‌తుర‌త క‌లిగిన నాయ‌కుడ‌ని, అభిమానులు అన్నా…ఈ గులాబీ బాస్ స్టైలే సెప‌రేటు. ప్ర‌తిప‌క్షాలు, మిత్ర‌ప‌క్షాలు, సొంత పార్టీ నేత‌లు…ఇలా ఎవ‌రినైనా స‌రే మాట‌ల‌తో క‌ట్టిప‌డేసే నైజం ఆయ‌న‌కే సొంతం. ఈ విష‌యంలో మీడియా కూడా మిన‌హాయింపు కాదు. ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. తాజాగా క్యాబినెట్ స‌మావేశం అనంత‌రం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్ మీడియాను హ్యాండిల్ చేసిన విధాన‌మైతే అదుర్స్ అని చెప్పొచ్చు. ఒక్క […]

చంద్రబాబు కొత్త బాధ్యతలు ట్రయిలర్‌… ఉక్కిరిబిక్కిరి లో కొత్త మంత్రులు

అన్న ప్రాస‌న రోజే ఆవ‌కాయ అనే నానుడి ఎంతో సుప‌రిచితం!!  ఇప్పుడు ఏపీలో కొత్త కేబినెట్లో మంత్రులు కూడా దీనిని గుర్తుచేసుకుని బోరుమంటున్నారు. ఎన్నో రోజులు ఊరించి ఊరించిన సీఎం చంద్ర‌బాబు.. ఆఖ‌రుకి తన క్యాబినెట్‌ను ప్ర‌క‌టించారు. ఇందులో పాత‌, కొత్తవారితో క‌లిపి మొత్తం 25 మంది ఉన్నారు. దీంతో కొత్తగా ప‌ద‌వి పొందిన వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. అలాగే త‌మ ప‌ద‌వి ప‌దిలమైనందుకు కొంత‌మంది సంబ‌ర‌ప‌డ్డారు. కానీ ఆ ఆనందం, సంబ‌రం కొద్ది గంటల్లోనే ఆవిరి […]

కేసీఆర్ వ్యూహం తెలిస్తే బీజేపీకి నిద్ర ప‌ట్ట‌దేమో..

రాజ‌కీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎంత‌టి నేర్పరో ఇప్ప‌టికే అంద‌రూ ఒక అంచ‌నాకు వ‌చ్చేశారు. ఆయ‌న ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప‌క్క తెలంగాణ‌లో బ‌ల‌పడేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు పావులు క‌దుపుతుండ‌టంతో.. ఇప్పుడు ముస్లిం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ల్లే కాలేదు.. ఇప్పుడో కేసీఆర్ ప‌రిస్థితి కూడా అంతే అనేవాళ్లూ లేక‌పోలేదు. ఈ మాత్రం తెలియ‌కుండా ప‌దేప‌దే ఈ అంశంపై మాట్లాడటం వెనుక […]

అందుకే ఫంక్ష‌న్‌ల‌కు ఎన్టీఆర్‌ను పిల‌వ‌డం లేద‌ట‌..

నారా-నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య దూరం త‌గ్గే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో నిర్వహించిన పొలిట్ బ్యూరో స‌మావేశానికి నంద‌మూరి హ‌రికృష్ణ హాజరై.. బావ‌తో పాటు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీంతో విభేదాలు త‌గ్గాయ‌ని అంతా భావించారు. కానీ చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్.. మంత్రి ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి నంద‌మూరి హ‌రికృష్ణ‌, ఆయ‌న త‌న‌యుడు క‌ల్యాణ్ రామ్ హాజ‌రైనా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రుకాకపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు చంద్ర‌బాబు కొత్త‌గా నిర్మించుకున్న ఇంటి గృహ‌ప్ర‌వేశానికి కూడా ఎన్టీఆర్ రాక‌పోవ‌డంతో […]

పవన్ ట్విట్టర్…విమర్శలు విన్నపాలు కితాబులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా టీడీపీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.అంటే విరుచుకుపడిపోయాడా అని అడిగిగితే అవును విరుచుకుపడినట్టే పడి అంతలోనే తనకి బాగా ఇష్టమైన అర్థిస్తున్నాను..విన్నవిస్తున్నాను అంటూ ముక్తాయించేసాడు ఎప్పటిలాగే. ఇంతకీ విషయం ఏంటంటే..ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చిన సందర్భంలో సదరు టీడీపీ ఎంపీ ల తీరును జనసేనాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించేశాడు.సభలో టీడీపీ ఎంపీ అశోక గజపతి […]

చంద్ర‌బాబు మాట‌ల్లో పేద‌.. చేతల్లో రాజు

హంగులూ ఆర్భాటాల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆమ‌డ దూరంలో ఉంటార‌నే విష‌యం ఆయ‌న మాట‌లు, దుస్తుల‌ను బ‌ట్టి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయ‌న హైద‌రాబాద్‌లో కొత్త‌గా నిర్మించుకున్న ఇల్లు చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. అత్యంత ఖ‌రీదైన ఫ‌ర్నీచ‌ర్‌, అత్యాధునిక హంగులతో విశాల‌మైన ప్రాంగ‌ణంలో.. క‌ట్టుకున్న ఈ అద్భుత‌మైన రాజ్‌మ‌హ‌ల్ గురించి రోజుకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. అదేంటంటే.. సినిమాల్లో చూసిన విధంగా.. కారుతో నేరుగా ఫ‌స్ట్ ఫ్లోర్‌లోకే వెళ్లిపోవ‌చ్చ‌ట‌. `నా చేతికి వాచీ ఉండ‌దు. […]

రోజా ఇలాకాలో టీడీపీకి లీడ‌ర్ లేడా..!

సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించి.. నిత్యం వార్త‌ల్లో నిలిచే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నియోజ‌క‌వ‌ర్గ‌మైన న‌గ‌రిలో టీడీపీ ప్రాభవం కోల్పోతోంది. అక్క‌డ అధికారంలో లేక‌పోయినా.. నిధులు మంజూరు చేసుకుని పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టిసారించాల్సిన నేత‌లు.. కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారుతోంది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన‌.. గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఎమ్మెల్సీ అయినా.. ఇప్ప‌టికీ జిల్లాల్లో కీల‌క‌మైన ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌డంలో వెన‌క‌డుగు వేస్తున్నారు. నాయ‌కుల నిర్లక్ష్యంతో […]

అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు లోకేష్ 

టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత నుంచి చంద్ర‌బాబు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే వ‌రకూ ఎన్టీఆర్ కేంద్రంగానే రాజ‌కీయాల‌న్నీ జ‌రిగేవి. ఇక చంద్ర‌బాబు వ‌చ్చాక‌.. పార్టీలో కొత్త ప‌వ‌ర్ సెంట‌ర్ ఏర్ప‌డింది. ఎవ‌రైనా ఆయ‌న ద్వారానే ఎన్టీఆర్‌ను క‌లిసేవారు. ఎన్టీఆర్ హ‌యాం త‌ర్వాత చాలా ఏళ్లు చంద్ర‌బాబు కేంద్రంగానే రాజ‌కీయాలు న‌డిచాయి.. ప్ర‌స్తుతం న‌డుస్తున్నాయి. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడి ఎంట్రీతో మ‌ళ్లీ ఆనాటి రోజులు మ‌ళ్లీ పార్టీలో క‌నిపిస్తున్నాయి. ఇప్పుటి వ‌ర‌కూ తెర వెనుకే ఉన్న నారా లోకేష్‌.. చంద్ర‌బాబు […]