పటేల్ S .I .R – TJ రివ్యూ

సినిమా : పటేల్ S .I .R

రేటింగ్ : 2.75/5

పంచ్ లై : పర్లేదు S .I .R

 నటీ నటులు: జగపతి బాబు, తాన్యా హోప్, పద్మప్రియ ,పోసాని కృష్ణ మురళి
నిర్మాత: సాయి కొర్రపాటి
బ్యానర్ : వారాహి చలన చిత్రం,
సంగీతం : DJ వసంత్
సినిమాటోగ్రఫీ : శ్యామ్ K నాయుడు
ఎడిటింగ్ : గౌతమ్ రాజు
డైలాగ్ : విజయ ప్రకాష్
కథ : సునీల్ సుధాకర్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వాసు పరిమి

 

జగపతి బాబు తో విల్లన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందే వారాహి బ్యానర్.మళ్ళీ జగపతి బాబు తో హీరో గా ఓ ఫుల్ లెంగ్త్ మూవీ చెయ్యాలని అదే వారాహి సాయి కొర్రపాటి కి ఎందుకనిపించిందో తెలీదు.అందుకు బలంగా రెండు కారణాలు ఉండాలి.ఒకటి జగపతి బాబు అంటే ఉన్న ఇష్టం తో ఆయన్ను ఈ టైం లో హీరో గా చూడాలనే కోరిక కావచ్చు, రెండోది ఒక బలమైన కథ దొరికి ఆ కథకి జగపతి బాబే న్యాయం చేయగలడు అనిఅయినా అనిపించి ఉండాలి.సినిమా చూసాక చిన్న పిల్లాడు కూడా చెప్పేదేంటంటే జగపతి బాబుని పక్కన పెడితే ఇది కదిపి కుమ్మేసి కలిసి మెలేసి అరగదీసేసిన ఓ మామూలు రివెంజ్ స్టోరీ.

జగపతి బాబు ఈ సాదా సీదా రివెంజ్ స్టోరీ ని భుజానికెత్తుకొని ఎంత సేపు మోసినా రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడిని సినిమాలో కూర్చోబెట్టడం పాపం జగ్గు భాయ్ కి తలకు మించిన భారమయిపోయింది.ఓ వైపు అస్త వ్యస్థమైన స్క్రీన్ ప్లే అది చాలదన్నట్టు అప్పుడప్పుడూ పాటల రూపం లో పలకరించే తలనొప్పి వెరసి ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంకా సినిమా అవ్వలేదా ఇంకో సగం సినిమా బాకీ ఉందా అన్న భయం మనల్ని వెంటాడుతుంది.

ఇంటర్వెల్ అంటే ట్విస్ట్ వుండాలన్నట్టు..అందుకోసం 1 st హాఫ్ స్క్రీన్ ప్లే అంతా తలకిందులు చేసి, చెయ్యాల్సిన డామేజ్ అంతా చేసేసాడు దర్శకుడు.ఇంటర్వెల్ కే సినిమా దాదాపు అయిపోయిందనిపిస్తుంది.రివేంజ్,విలన్స్,ఫైట్స్,స్కెచెస్,ఇవన్నీ ఉన్న 1st హాఫ్ ఏ ఈ మాత్రం ఉంటే కథయిపోయాక ఇంక సెకండ్ హాఫ్ ఏముంటుంది అన్న అనుమానం కలుగుతుంది.

అయితే దర్శకుడు సెకండ్ హాఫ్ ని మాత్రం పర్ఫెక్ట్ గా హేండిల్ చేసాడు.అప్పటివరకు రెగ్యులర్ రివెంజ్ తో విసిగిపోయిన ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ పెద్ద రిలీఫ్ ని ఇస్తుంది.ఆ ఫామిలీ ఎమోషన్స్,తండ్రి,కొడుకుల అనుబంధం,చిన్న పిల్లలతో పటేల్ ఎపిసోడ్ అన్ని అద్భుతంగా వున్నాయి.సెకండ్ హాఫ్ చూసాకే 1st హాఫ్ లో జరిగిన రివెంజ్ కి మనం కనెక్ట్ అవుతాము.అంత వరకు ఎదో జగపతి బాబుని స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తూ ముర్డర్లు చేయిస్తున్నారనిపిస్తుందే తప్ప కథతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేది మాత్రం సెకండ్ హాఫ్ లోనే.

జగపతి బాబుని సరిగ్గా వాడుకోవాలే కానీ..భయాన్ని,బాధని,ఏడుపుని టన్నుల్లో ఇచ్చేయగలడు.కేవలం జగపతి బాబే ఓ సదా సీదా రివెంజ్ పటేల్ ని పటేల్ S .I .R ని చేసింది.ఓ మిలిటరీ మేజర్ దుర్మార్గుల చేతుల్లో తన ఫామిలీ మొత్తాన్ని పోగొట్టుకుంటే అతని పగ ప్రతీకారం ఎలా ఉంటాయన్నది కథాంశం.కాస్త బెటర్ స్క్రీన్ ప్లే 1st హాఫ్ కి యాడ్ అయ్యుండుంటే సినిమాని ఇంకో మెట్టెక్కించేది.

సాంకేతికంగా సినిమా హై స్టాండర్డ్స్ తో వుంది.శ్యాం గారి సినిమాటోగ్రఫీ సూపర్బ్.గౌతమ్ రాజు గారి ఎడిటింగ్ పర్ఫెక్ట్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.మాటలు ఇప్పటి ట్రెండ్ కి సరిపడా మోతాదు లేదు.డైరెక్టర్ వాసు పరిమి డైరెక్టర్ గా సక్సెస్ అయినా స్క్రీన్ప్లే రైటర్ గా మాత్రం కాలేకపోయాడు.పోలీస్ ఆఫీసర్ గా తాన్యా హోప్ అందాల బాగానే ఆరబోసింది.జగపతి భార్యగా పద్మప్రియ పర్లేదు.పోసాని కామెడీ సో.సో..,మనకు ప్రతి సినిమాలో తగిలే పెద్ద పెద్ద విల్లియన్స్ అందరికి పటేల్ S .I .R ఛాన్స్ ఇచ్చాడు.

ఎమోషనల్ రివేంజ్ డ్రామా జగపతి బాబుని మల్లి హీరోగా చూపిస్తూ తీయడం తప్పు కాదు కానీ,దానికి కమర్షియల్ హంగులు అద్దాలనుకోవడమే సినిమాకు అడుగడునా అడ్డుతగులుతుంది.అరగదీసేసిన రివెంజ్ డ్రమనే అయినా జగపతి బాబు,సెకండ్ హాఫ్ సినిమాని కాస్తంత సేవ్ చేశారు.