విపక్షం వైసీపీకి రాజధాని ప్రాంతం అమరావతిలో గట్టి పట్టు దొరుకుతోందా? వచ్చే ఎన్నికల్లో విజయవాడ ప్రాంతంలో పార్టీని ముందుండి నడిపించగల నేత వస్తున్నాడా? ముఖ్యంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి.. మొగుడు లాంటి కేండిట్ వైసీపీలోకి వస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. గతంలో సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన మల్లాది విష్ణు ఇప్పుడు జగన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైందని రెండు మూడు రోజులుగా […]
Category: Latest News
నంద్యాల ఓటర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు
నంద్యాలలో పసుపు జెండా రెపరెపలాడించేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇది తమ నియోజకవర్గమని, నాయకులు వెళ్లినా క్యాడర్ మాత్రం తమ వైపే ఉందని.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. తమ అభ్యర్థిగా ఆర్థికంగా, శ్రేణుల్లోనూ బలంగా ఉన్న శిల్పామోహన రెడ్డిని ప్రకటించడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కేవలం సెంటిమెంట్‌ను నమ్ముకునే బరిలోకి దిగుతున్నామన్న అపవాదు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాయిలాల మీద తాయిలలు ప్రకటిస్తున్నారు. నిధులు, […]
టీకాంగ్రెస్‌లో మూడు ముక్కలాట
విభజన తర్వాత ఏపీలో పూర్తిగా దెబ్బతిన్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పునర్వైభవం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఉన్న నేతలందరూ సీఎం పీఠంపై కన్నేసి.. లాబీయింగ్‌కు కూడా తెరలేపారు. ఎవరికి వారు తామే సీఎం అభ్యర్థి అని ప్రకటించేసుకుంటున్నారు. సర్వేలు చేయించేస్తున్నారు. తన కంటే జూనియర్లు సీఎం కుర్చీ కోసం తెగ ప్రయత్నిస్తుంటే.. నేనెందుకు ప్రయత్నించకూడదు అనుకున్నారో ఏమో.. ఇప్పుడు ఈ రేసులోకి […]
ఉండవల్లి అమరావతి టూర్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
నిత్యం వార్తలో నిలుస్తూ.. సంచలనాలకు మారు పేరుగా నిలిచే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి అందరికీ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో ఆయనకూడా ఒకరు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. ఒంటికాలిపై లేస్తూ ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరిపోతారనే ప్రచారం కూడా జరిగిపోయింది. అలాంటి ఉండవల్లి.. ఏపీ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించడం ఆశ్చర్యం కలిగించకమానదు. అంతేకాదు.. […]
ఏపీ టీడీపీ -బీజేపీ గ్యాప్‌కు దుర్గమ్మే సాక్ష్యం
మిత్రపక్షాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజధాని ప్రాంతం, ఏపీకి కీలకమైన విజయవాడలో టీడీపీ-బీజేపీ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకూ ఇరు పార్టీల నేతల మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగిన సంఘటన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు… కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణాస్వీకారానికి గైర్హాజరవడం […]
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలలో టెన్షన్..టెన్షన్
ఏపీలో వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ ఫీవర్ పట్టుకుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారికి అయినా ఈ ఫీవర్ మామూలుగా లేదు. ఇప్పుడు అందరి నోట ప్రశాంత్ సర్వే మాటే వినిపిస్తోంది. ప్రశాంత్ ఏకంగా రూ. 8 కోట్ల వరకు ఖర్చు చేసి గ్రామస్థాయి గ్రామస్థాయి వరకు రిపోర్టులు తయారు చేయించారు. ఈ సర్వే నివేదికలు జగన్ వద్దకు వెళ్లిపోయాయి. జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినవి అన్నీ పాటిస్తున్నాడన్న లీకులు వైసీపీ నాయకులందరికి తెలిసిపోయాయి. దీంతో […]
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం చాలా హాట్‌హాట్
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో ఫైరైయ్యారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కొందరు మంత్రులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల బాబు పనితీరుపై జాతీయ స్థాయి సంస్థ చేసిన సర్వేలో 47 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్టు ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి శాతాన్ని 47 శాతం నుంచి […]
టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు?
తెలంగాణలో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. తర్వాత ఇది సాధ్యపడేదే కాదంటూ కొందరు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్యే ఈ చర్చ రావడంతో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంగతేంటి? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్-రేవంత్ ఒకే ఒరలో ఇమడని రెండు కత్తులన్న విషయం […]
జనసేనలో కన్నాకు ప్రత్యర్థి రెడీ..!
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి! విభజన తర్వాత రాజకీయాలకు అత్యంత కీలకంగా మారిన గుంటూరులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలియదుగానీ.. ప్రస్తుతం మాత్రం రాజకీయ పార్టీల నేతలకు మాత్రం కల్పతరువుగా మారబోతోంది. ఇప్పటికే ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో గుంటూరు రాజకీయాల్లో ఊహించని పరిణామం ఎదురైంది. జిల్లాకు చెందిన పారిశ్రామిక […]