ఏపీలో విపక్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు చెపితే తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రోజా తెలుగు రాజకీయాల్లో గత దశాబ్దంన్నర కాలంగా కొనసాగుతున్నారు. టీడీపీతో ప్రారంభమైన రోజా రాజకీయ ప్రస్థానం ఆ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన రోజా ఓడిపోయారు. ఇక గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆమె నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ […]
Category: Latest News
ఏపీలో మరో ఉప ఎన్నిక!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లా రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఏ క్షణానికి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన శిల్పా చక్రపాణి రెడ్డికి వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో చేరాలంటూ వైసీపీ […]
కథ-స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రబాబు
హెడ్డింగ్ వినడానికి షాకింగ్‌గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇదే జరుగుతోంది. `అక్టోబర్ నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌ను లక్ష్యంగా చేసుకునే పవన్ దీనిని ప్రకటించాడా? అనే సందేహం కలగకమానదు. `అన్న వస్తున్నాడు` పేరుతో జగన్.. అక్టోబర్ నుంచే పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కూడా రంగంలోకి దిగుతుండటం.. అది కూడా […]
20 రోజులు జగన్ ఫ్యామిలీ అడ్రస్ చేంజ్
కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ క్రమక్రమంగా పట్టు బిగిస్తోంది. గత వారం రోజులుగా ఇక్కడ ఎవరో ఒకరు ప్రముక వ్యక్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాకేశ్‌రెడ్డి, టీడీపీ కార్పొరేటర్ హనీఫ్, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్కడ ఎన్నిక 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా అందరూ భావిస్తుండడంతో జగన్ కూడా ఇక్కడ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే […]
నంద్యాలలో టీడీపీ అల్లుడు వర్సెస్ వైసీపీ మామ
ఏపీలో ఇప్పటికే హైటెన్షన్‌గా మారిన కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ట్విస్టులు అదిరిపోతున్నాయి. గత వారం రోజులుగా నలుగురు కీలక వ్యక్తులు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి జంప్ చేయడం, ఇక్కడ ఇటీవల కాలంలోనే సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించడం, ఇక ఇక్కడ ప్రచారానికి వైసీపీ అధినేత జగన్, షర్మిల, విజయలక్ష్మితో పాటు టీడీపీ నుంచి బ్రాహ్మణి లాంటి వాళ్లు ప్రచారానికి వస్తుండడంతో ఇప్పటికే ఇక్కడ రాజకీయం అదిరిపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇక్కడ […]
రక్షణనిధి గ్రాఫ్ ఎలా ఉంది?ప‌్లస్‌లు, మైనస్‌లు ఇవే
కృష్ణా జిల్లాలోని పశ్చిమప్రాంతంలో వెనకపడిన నియోజకవర్గం తిరువూరు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయిన తిరువూరులో గత మూడుసార్లు టీడీపీ గెలవకపోవడం ప్రత్యేకత. గత ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గానికి చెందిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తిరువూరు నుంచి పోటీ చేసి 1676 ఓట్ల స్వల్ప మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పనిచేసిన రక్షణనిధి ఎమ్మెల్యేగా కొన్ని పరిమితులకు లోబడడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ చూపించలేకపోతున్నారు. విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కావడం, నియోజకవర్గంలో […]
2019 క్లారిటీ: ఎన్టీఆర్+పవన్+లోకేశ్ ఒకవైపు జగన్ ఒక వైపు
2019 ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను హీటెక్కిస్తున్నాయి. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంది. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. నేడు మిత్రపక్షాలుగా ఉన్నవాళ్లు ఎన్నికల వేళ శత్రువులు అవుతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ+టీడీపీ పొత్తు బ్రేకప్ అవుతుందన్న వార్తల నేపథ్యంలో బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. […]
ప్రభుత్వం ఆలోచించింది ఒకటైతే.. జరిగిన ప్రచారం మరొకటి
ఒకే ఒక్క వార్త మూడేళ్ల కష్టాన్ని వృథా చేసింది. ఇన్నాళ్లూ జాగ్రత్తగా చూసుకుంటున్న ఉద్యోగులను దూరం చేసేసింది. సీఎం చంద్రబాబు కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరు చేసింది. అది వాస్తవమో అవాస్తవమో తెలీదు గాని.. ఉద్యోగుల్లో మాత్రం ప్రభుత్వంపై అభద్రతా భావాన్ని కలిగించేలా చేసింది. `నేను గతంలోలా కఠినంగా వ్యవహరించను. నేను మారాను. నన్ను నమ్మండి` అంటూ 2014 ఎన్నికల సమయంలో ఉద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అలా వ్యవహరిస్తున్నా.. ఒకే ఒక్క కథనంతో మొత్తం సీన్ […]
నంద్యాలలో పవన్ ఎన్ని ఓట్లను ప్రభావితం చేస్తాడు…!
`నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై రెండు రోజుల్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తా` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన నాటి నుంచి అందరిలోనూ ఒకటే చర్చ! పవన్ ఎన్ని ఓట్లు ప్రభావితం చేస్తాడు? ఏఏ వర్గాల ఓట్లను తనవైపు తిప్పుకోగలుగుతాడు? ఎవరికి ఇది ప్లస్? ఎవరికి మైనస్? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ నిర్ణయంపై అటు టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉత్కంఠతో […]
