ఉలిక్కిపడ్డ పార్టీ … టెన్షన్ లో నాయకులు

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో పాతాళానికి ప‌డిపోయిన కాంగ్రెస్‌.. ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతోంది. పార్టీకి వీర విధేయులైన నాయ‌కులు.. అంతోఇంతో క్యాడ‌ర్ త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఉన్న వారితోనే నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామ‌ని ప్ర‌కటించినా అంత‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ప్ర‌క‌ట‌న అయితే చేసేసింది కానీ ఇప్పుడు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఎంతో క‌ష్ట‌ప‌డి.. భూత‌ద్ధంలో వెతికి.. నేను పోటీచేయ‌ను అన్నా బుజ్జ‌గించి మరీ ఒక అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌బెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ […]

క‌ల‌క‌లం: బీజేపీలోకి ఆరుగురు టీఆర్ఎస్‌ ఎంపీలు జంప్‌

ప్ర‌త్య‌ర్థుల‌కు అంతుచిక్క‌ని వ్యూహాల‌తో దూసుకుపోతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇవ్వ‌బోతున్నారా? మూకుమ్మ‌డిగా రాజీనామా చేసి.. ఇక బీజేపీ గూటికి చేరిపోయేందుకు ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇటీవ‌ల కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ చేరిపోతుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. ఇక కేసీఆర్ కూతురు, ఎంపీ క‌విత‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని కూడా హ‌ల్‌చల్ చేశాయి. కానీ త‌ర్వాత అవ‌న్నీ ఊహాగానాలే అని తేలిపోయాయి. అయితే టీఆర్ఎస్‌ ఎంపీల్లో కొందరిని […]

ప్ర‌కాశం టీడీపీలో ఫ‌స్ట్ వికెట్ డౌన్‌.. లైన్లో 2, 3 వికెట్లు

ప్ర‌కాశం జిల్లాలో కొంత‌మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ బ‌లంగానే ఉంది. ఇక్క‌డ చంద్ర‌బాబు ఫిరాయింపుల‌తో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుని టీడీపీని చేజేతులా నాశ‌నం చేసేశారు. విప‌క్ష వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోను పార్టీ రెండు గ్రూపులుగా నిలువునా చీలిపోయింది. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా జిల్లాలో నివురు గ‌ప్పినా నిప్పులా ఉన్న అసంతృప్తి అన్నా రాంబాబు రూపంలో ఫ‌స్ట్ వికెట్ రూపంలో ప‌డిపోయింది. అద్దంకిలో […]

వెంక‌య్య వార‌సుడిపై ర‌చ్చ ర‌చ్చ‌

ఏపీ త‌ర‌ఫున ఎంపీ కాక‌పోయినా.. సొంత రాష్ట్ర అభివృద్ధికి ఇప్ప‌టివ‌ర‌కూ అంతో ఇంతో సాయం చేస్తూ వ‌చ్చారు వెంక‌య్య‌నాయుడు! ప్ర‌ధాని మోదీని నేరుగా అడిగినా అవ్వ‌ని వాట‌న్నింటినీ.. వెంక‌య్య‌తో రిక‌మెండ్ చేయించుకునేవారు సీఎం చంద్ర‌బాబు! ఇప్పుడు ఆ అవ‌కాశం లేకుండా పోయింది. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌విలోకి వెళిపోవ‌డంతో.. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. వెంకయ్య స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారు? అంతేగాక వెంక‌య్య నాయుడి వార‌సుడు ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ స్థానం […]

ఏపీ బీజేపీలో నిప్పు – ఉప్పు

ఏపీ బీజేపీ వింత ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని ఒక‌ప‌క్క పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న త‌రుణంలో.. కీల‌క‌మైన ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేత‌లు.. చెరో దారి ప‌ట్టారు. ఇందులో ఒక‌రికి కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య‌నాయుడి మ‌ద్ద‌తు పూర్తిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయ‌న కూడా ఢిల్లీకే ప‌రిమిత‌మయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఆ ఇద్ద‌రు నేత‌ల‌కూ స‌ర్దిచెబుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేక‌పోవ‌డంతో పాటు రాజ‌మండ్రి […]

పవ‌న్ ప్ర‌భావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!

నంద్యాల ఉప ఎన్నిక సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తోంది. 2019 ఎన్నిక‌ల‌కు రిఫ‌రెండంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ ఎన్నిక‌ను భావిస్తున్నాయి. ఇప్ప‌టికే అటు సీఎం చంద్ర‌బాబు, ఇటు ఆయ‌న త‌న‌యుడు లోకేష్ నంద్యాల‌లో ఓట‌ర్లపై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు. అన్ని వ‌ర్గాలు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తాయ‌ని భావించిన టీడీపీ ఆశ‌లు.. వైసీపీ నిర్వ‌హిం చిన ఒక్క‌ స‌భ‌తో చెల్లాచెదురైపోయాయి. ఇక మంత్రులు, నాయ‌కుల వ‌ల్ల కాద‌ని టీడీపీ అధినేత చంద్ర బాబుకు అనుభ‌వంలోకి వ‌చ్చింది. అందుకే […]

ఒక్క రాజీనామాతో ఆత్మ‌రక్ష‌ణ‌లో టీడీపీ

నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న‌రెడ్డి తమ్ముడు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఇప్పుడు రాజకీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయ‌న‌.. వైసీపీలో చేరిన 24 గంట‌ల్లోనే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు, ఇక్క‌డే వైసీపీ అధినేత జ‌గ‌న్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌కుండానే టీడీపీలో చేరిపోవ‌డం.. ఇంకా కొన‌సాగుతున్న త‌రుణంలో సీఎం చంద్ర‌బాబు చేసిన జ‌గ‌న్ […]

అన్నాచెల్లి వ‌ర్సెస్ అన్న‌ద‌మ్ములు… గెలుపు ఎవ‌రిది

తెలుగు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి రేపుతోన్న నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అన్న‌చెల్లెళ్లు వర్సెస్ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రుగుతోన్న పోరులో ఎవ‌రు గెలుస్తారు అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. నంద్యాల ఉప ఎన్నిక‌ను బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ వ‌ర్సెస్ రానా యుద్ధంతోను, కురుక్షేత్ర సంగ్రామంతోను పోలుస్తున్నారు. ఇక 2019 ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక‌ను సెమీఫైన‌ల్స్‌గాను భావిస్తున్నారు. నంద్యాల‌లో ఓట‌ర్ల‌ను వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ శ్రీకృష్ణుల‌తో పోల్చారు. ఇక్క‌డ జ‌రిగేది ధ‌ర్మ‌యుద్ధ‌మ‌ని చెప్పారు. ఇక ఇక్క‌డ టీడీపీ నుంచి భూమా బ్రహ్మానంద‌రెడ్డి […]

ఆ మంత్రిపై చంద్ర‌బాబు సీక్రెట్ నిఘా..!

ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబుకు ఇంటి పోరు త‌ప్ప‌డం లేదు. ముఖ్యంగా కేబినెట్‌లోని మంత్రి తీరుపై ఇప్పుడు ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. కీల‌క‌మైన నిర్ణ‌యాల‌ను త‌నకు స‌న్నిహితుడైన‌, మ‌రో పార్టీ అధినేత‌కు చెబుతుండ‌టంతో ఏం చేయాలో తెలియ‌ని సందిగ్థ స్థితిలో టీడీపీ అధినేత ఉన్నార‌ట‌. మంత్రి ప‌ద‌వి నుంచి తీసేస్తే.. ఆయ‌న సామాజిక‌వర్గం నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించి వెన‌క‌డుగు వేస్తున్నార‌ట‌. పార్టీని ఇబ్బందుల కు గురిచేస్తున్న ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. గ‌తంలో మంత్రిగా […]