డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా తాజాగా విడుదలైంది. బోలెడంత రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో ఫ్రెష్‌లుక్‌ని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 నుండి ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ కానుంది. 24 నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అదే రోజు ‘కాటమరాయుడు’ న్యూలుక్‌ని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్లుగా శృతి […]
Author: admin
ప్యాకేజీతో రాజకీయ సమాధి.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రచారాన్ని చేస్తూ, ప్యాకేజీ కాకుండా ప్రత్యేక సహాయంతో సరిపెట్టాలనుకున్న బిజెపికి, దాన్ని స్వాగతిస్తున్న తెలుగుదేశం పార్టీకీ ఆంధ్రప్రదేశ్‌లో నూకలు చెల్లే రోజులు ముందు ముందు ఉన్నాయి. ప్యాకేజీ లేదా సాయం పేరుతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాయని ప్రజలు పరిశీలిస్తున్నారు. అయితే అధికార పార్టీ, ప్రజల ఆలోచనల్ని బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతోంది. ప్యాకేజీ పేరు చెప్పకపోయినా, సాయం పేరుతో విదుల్చుతామని కేంద్రం చెప్పినా స్వాగతించక తప్పని […]
మెగాస్టార్ విత్ స్టైలిష్ స్టార్.
మెగాస్టార్ ప్రస్తుతం 150వ సినిమా ‘ఖైదీ నెం 150’లో నటిస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. శరవేగంగా షూటింగ్ కార్యమ్రాలు జరుపుకుంటోంది. మరో పక్క అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘డిజె(దువ్వాడ జగన్నాధం)’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్, స్టైలిష్ స్టార్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ఓ హాట్ టాపిక్. అది ఒక కన్నడ మూవీ అట. కన్నడంలో సూపర్ సక్సెస్ అయిన ఆ సినిమాను […]
ఈ నాయకులా నీతులు చెప్పేది?
పొద్దున్న లేచింది మొదలు.. ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం, అధికార పక్షం చేసిన విమర్శలపై ప్రతిపక్షం.. ఇలా విమర్శలూ ప్రతివిమర్శలే కనిపిస్తాయి!! మైకుల్లో అరుస్తూ.. ఎదుటి వారిపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. వినేవాళ్ల చెవుల్లో దుమ్ము దులిపేస్తూ అనర్గళంగా, ఏకధాటిగా.. ఊకదంపుడు ఉపన్యాసాల్ని కొనసాగిస్తారు! ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల్లో ఎక్కువమంది రోజూ కనిపించే ముఖాలు కొన్ని ఉన్నాయి. మరి వీళ్లు ఎంతవరకూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు? వీరి శ్రీరంగనీతులను చూసి జనాలు ఏమనుకుంటున్నారు? అనేవి ఎప్పుడైనా ఆలోచించారా? సమాధానం […]
టీడీపీని ఖాళీ చేసే పనిలో బీజేపీ
మిత్రధర్మాన్ని బీజేపీ పక్కన పెట్టబోతోందా? ఇక సొంతంగా తెలంగాణలో ఎదిగేందుకు పావులు సిద్ధంచేస్తోందా? విమోచన దినాన్ని బీజేపీ అట్టహాసంగా నిర్వహించడం వెనుక అసలు వ్యూహం ఏమిటి? టీడీపీ, కాంగ్రెస్‌లు ఢీలా పడిపోయిన సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. వరంగల్ పర్యటన ఆ పార్టీకి ఎంత వరకూ మైలేజ్ తీసుకొచ్చింది? ఇదే సమయంలో టీడీపీని ఖాళీ చేసే పనిలో బీజేపీ పడిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి! తెలంగాణలో ప్రధాని మోడీ తొలి పర్యటన సూపర్ […]
పవన్‌తో బీజేపీ రాజీ యత్నాలు
హోదా ప్రకటించనందుకు ఏపీ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇదే సమయంలో దూరమవుతున్న మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడింది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తీవ్ర స్వరంతో బీజేపీపై విరుచుకుపడుతున్నాడు. దశల వారీ పోరాటానికి కార్యాచరణ కూడా ప్రకటించాడు. ఒకవేళ పోరాటానికి దిగితే భవిష్యత్తులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే!! అందుకే పవన్ రంగంలోకి దిగకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. జనసేనానితో రాయబారానికి దిగారు. `కాంగ్రెస్ వెన్నుపోటు […]
కేసీఆర్ రియల్ మాయలో పడ్డారా
రియల్ ఎస్టేట్ మాయ అంతా ఇంతా కాదు. ఒక్కసారి హిట్టయ్యామా.. వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. అంతేకాదు, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్ పడిందంటే అక్కడ డెవలప్‌మెంట్ జరుగుతున్నట్టుగా పబ్లిక్ టాక్! ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. అధికారులతో ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా.. రియల్ ఎస్టేట్ గురంచే కేసీఆర్ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. దీనికి ఒక కారణం ఉంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మొత్తం రాష్ట్రంలోని […]
మురళీమోహన్ వారసురాలు వస్తోంది!
ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి! 2019 ఎన్నికల్లో తమ కొడుకులు, కూతుళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటినుంచే సీనియర్ నాయకులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ తరుణంలో తన కోడలిని రాజకీయ వారసులిగా తీసుకొస్తున్నారు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్!! భవిష్యత్తులో రాజమండ్రి ఎంపీగా ఆమెతో పోటీచేయించేందుకు ఇప్పటినుంచే ఆమెను సిద్ధం చేస్తున్నారు! తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమర్..కు ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. […]
పొత్తుల కోసం జగన్ తహతహ
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉంది. అయితే ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్.. సొంతంగా పోటీచేస్తానని ప్రకటించాడు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి! ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్.. ఈ సారి ఎలాగైనా `సీఎం` పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సొంతంగా పోటీచేసేకంటే ఎవరో ఒకరిని కలుపుకుని వెళితే సీఎం అయిపోవచ్చని భావిస్తున్నారు. అందుకే అటు జనసేన, ఇటు వామపక్షాలతో పొత్తు కోసం […]