భూమా మృతికి సంతాప‌మా? ఎన్నిక‌ల ప్ర‌చారమా?

కాదేదీ క‌వితక‌నర్హం అన్నాడో మ‌హాక‌వి!! ఇప్పుడు కాదేదీ రాజ‌కీయాల‌క‌న‌ర్హం అంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు! ఏ అంశాన్న‌యినా రాజ‌కీయాన్ని చేసి.. దానిని త‌మ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవ‌డం ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్నతో పెట్టిన విద్య‌! క‌రెక్టుగా ఇప్పుడు భూమా నాగిరెడ్డి మ‌ర‌ణాన్ని కూడా ఎవ‌రికి వారు.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. చివ‌రికి ఆయ‌న‌కు సంతాప స‌భ కూడా రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం!! ఒక నాయకుడు మృతి చెందిన వెంటనే ఆ నాయకుడికి, ఆ నాయకుడి […]

టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆశ‌ల‌కు అఖిలేశ్ గండి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల విజ‌యం ఎంతోమంది ఆశ‌లకు గండి క‌ట్టింది. ఈ విజ‌యంతో ప్ర‌ధాని మోదీ కంటే తాను గ్రేట్ అనిపించుకోవాల‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, త‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని భావించిన మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ భావించారు. కానీ వీరిద్ద‌రికీ పెద్ద షాక్ త‌గిలింది. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ బ‌డా నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు కూడా బీజేపీ విజ‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌. త‌న ఆశ‌ల‌ను బీజేపీ చిదిమేసింద‌ని తెగ బాధ‌ప‌డుతు న్నార‌ట‌. అదేంటి బీజేపీ […]

అమిత్ మ్యాజిక్ ఇక్క‌డ ప‌ని చేస్తుందా..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాధించిన అనంత‌రం.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొల్పుతోంది. ముఖ్యంగా షా త‌దుప‌రి ల‌క్ష్యం తెలంగాణ అని ఇప్ప‌టికే సంకేతాలు వెలువ‌డిన నేప‌థ్యంలో.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారని అంద‌రూ ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ‌లో బ‌ల‌మైన నాయకుడిగా మారిన కేసీఆర్‌ను.. షా ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తారు? మ‌రి అంద‌రిలానే అమిత్ షా వ‌ల‌లో కేసీఆర్ చిక్కుతాడా? అనే […]

మూడేళ్ల జ‌న‌సేన ఇన్న‌ర్ రిపోర్ట్‌

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పాడు ప‌వ‌న్‌!! ఇలా చెప్పి మూడేళ్లు పూర్త‌యింది. అడ‌పాద‌డ‌పా రావ‌డం.. ఆవేశంగా మాట్లాడ‌టం.. కొన్ని స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌డం.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వారికి ఒకేసారి బ‌దులు చెప్ప‌డం.. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌పుడు ట్విట‌ర్‌లో నాలుగు ముక్క‌లు రాసేయ‌డం.. మిన‌హా ఈ మూడేళ్ల‌లో ప‌వ‌న్ పెద్ద విజ‌యాలు సాధించ‌లేద‌నే చెప్పాలి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఆయనపై పొలిటికల్ ఎంట్రీపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. ప్రజల సమస్యలపై సమరశంఖారావం పూరిస్తారని […]

కేంద్రం నియోజ‌క‌వ‌ర్గాల‌ పెంపు…బాబుకి కొత్త జిల్లాల డిమాండ్

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశం తెర‌పైకి వ‌చ్చింది. విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల్లోనూ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ప్ర‌తిపాద‌న అంశాన్ని కేంద్రం ప‌క్క‌న పెట్టింది. అయితే కొన్ని రోజులుగా ఈ అంశంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికే నియోజ‌క‌వ‌ర్గాలను పెంచాల‌ని కేంద్రం నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకో ఆసక్తిక‌ర అంశం ఏంటంటే.. నియోజ‌క‌వ‌ర్గాలే గాక‌.. ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఉన్న 13 […]

బాహుబ‌లి-2 గురించి షాకింగ్ రిపోర్ట్‌

`క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు? ` ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. అంద‌రిలోనూ టెన్ష‌న్ పెరిగిపోతోంది. బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఎలా ఉండ‌బోతోంద‌నే ఉత్సుకత దేశ వ్యాప్తంగా మొద‌లైంది. బాహుబ‌లి-1లో కేవ‌లం కేరెక్ట‌ర్‌ల‌ను ప‌రిచ‌యం చేసి.. విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దినా.. క‌థ‌నం నెమ్మ‌దిగా ఉండ‌టంతో ఒకింత నిరుత్సాహ‌ప‌డ్డారు ప్రేక్ష‌కులు. అయితే ఇప్పుడ బాహుబ‌లి-2 మాత్రం అంద‌రి అంచ‌నాల‌కు మించి ఉంటుంద‌ని టాక్‌. బాహుబలి-2 ఇన్‌సైడ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్‌గా… అంద‌రిక‌ళ్లూ ఇప్పుడు బాహుబ‌లి […]

నెల్లూరు ఎమ్మెల్సీ పోరులో ఆధిప‌త్య పోరు

ఎమ్మెల్సీ ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ‌ నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీకి చుక్కెదుర‌య్యేలా క‌నిపిస్తోంది. మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు గాను.. రెండింటిలో సునాయాసంగా గెలుస్తామ‌ని నేత‌లు ధీమాగా ఉన్నారు. ఇక మూడో స్థానంలో మాత్రం ప్ర‌తిప‌క్షానికి దక్కే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం! ముఖ్యంగా త‌మ అభ్య‌ర్థుల విజ‌యం కోసం మంత్రి నారాయ‌ణ‌, మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర రెడ్డి వ‌ర్గం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో త‌మ […]

అఖిల్ ప్రియ ఎంట్రీతో ఎవరికి చెక్..!

తండ్రికి ద‌క్క‌నిది కూతురికి ద‌క్కుతుందా? అనే ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో.. ఆయ‌న అనుచ‌రులను తీవ్రంగా క‌లిచివేస్తోంది. మంత్రి వ‌ర్గంలో చేరాల‌నే కోరిక‌.. తీర‌కుండానే ఆయ‌న క‌న్నుమూశారు! దీంతో ఇప్పుడు ఆయన కూతురు అఖిల ప్రియకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే డిమాండ్ పెరుగుతోంది. ఈనేప‌థ్యంలో కేబినెట్‌లోకి ఆమె ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడు ఎవ‌రికి చెక్ చెబుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ముగ్గురు మ‌హిళ‌లు మంత్రులుగా కేబినెట్లో ఉన్నారు. మ‌రి అఖిల‌ప్రియ‌కు […]

కాంగ్రెస్ పీఎం అభ్య‌ర్థిగా శ‌శిథ‌రూర్‌..!

125 ఏళ్ల ఘ‌న చ‌రిత్ర ఇప్పుడు క‌నుమ‌రుగు అయిపోయింది! ఎంద‌రో గొప్ప‌ నాయ‌కుల‌ను అందించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు ఒకే ఒక్క నాయ‌కుడి కోసం వెతుకుతోంది!! మ‌రో ప‌క్క ప్ర‌ధాని మోదీ బ‌లం రెట్టింపు అవుతుంటే.. కాంగ్రెస్ భావి సార‌థి ఇంకా ఇంకా అథఃపాతాళానికి ప‌డిపోతున్నారు. మ‌రి 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్ ను ప్ర‌క‌టిస్తే అది పార్టీకి న‌ష్ట‌మ‌ని ఇప్ప‌టికే అందరికీ అర్థ‌మైంది. మ‌రి ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పీఎం అభ్య‌ర్థిగా ఎంపీ శ‌శిథ‌రూర్ […]