ఎమ్మెల్యే సీటే మోజంటోన్న టీఆర్ఎస్ ఎంపీలు..!

ఓ ఎమ్మెల్యే, ఎంపీ మ‌ధ్య తేడా చూస్తే ఎమ్మెల్యే స్టేట్‌కు ప‌రిమిత‌మైతే ఎంపీ జాతీయ స్థాయిలో ఉంటాడు. ఎమ్మెల్యేల ప్రాబ‌ల్యం స్టేట్‌లో మాత్ర‌మే ఉంటే ఎంపీ ఢిల్లీ స్థాయిలో కూడా ప‌నులు చ‌క్క‌బెట్టే సామ‌ర్థ్యం క‌లిగి ఉంటాడు. అదే స్టేట్‌లెవ‌ల్లో ఎమ్మెల్యే మంత్రి అయితే ఆ స్టేట్‌లో తిరుగులేని లీడ‌ర్‌గా ఎదిగే స్కోప్ కూడా ఉంటుంది. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎంపీలంద‌రూ ఎమ్మెల్యే ప‌ద‌వి మీదే ఆస‌క్తి చూపుతున్నారట‌. వారి దృష్టిలో ఎంపీ ప‌ద‌వి […]

ఆ మంత్రి డైరెక్ష‌న్‌లో నారా లోకేష్‌..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌లే మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. నారా లోకేశ్‌కు మంత్రి అయ్యేనాటికి రాజ‌కీయ అనుభ‌వం ఎంత అని లెక్క వేసుకుంటే మూడు రోజులే అని చెప్పాలి. లోకేశ్ ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే మంత్రి అయ్యాడు. అది కూడా ఆయ‌న‌కు కీల‌క‌మైన పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖ‌లు చంద్రబాబు అప్ప‌గించారు. ఇక లోకేశ్‌కు ప్ర‌జ‌ల‌తో అటాచ్‌మెంట్ కూడా లేదు. మ‌రి […]

రాజ‌ధానిలో టీడీపీ ప‌ట్టు స‌డ‌లుతోందిగా..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో రోజు రోజుకు టీడీపీ గ్రాఫ్ త‌గ్గుతోందా ? అక్క‌డ రైతుల నుంచి బ‌ల‌వంతపు భూసేక‌ర‌ణ, ప్ర‌జ‌ల‌కు క‌నీస సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం, అక్క‌డ సామాన్య జ‌నాల ఇబ్బందులు అడుగ‌డుగునా కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతున్నాయి. అయితే ఇదంతా పైకి మాత్ర‌మే క‌న‌ప‌డుతోన్న వ్య‌తిరేక‌త‌…అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్య‌తిరేక‌త‌ను అధికారంలో ఉంది కాబ‌ట్టి టీడీపీ ఏదోలా మేనేజ్ చేసుకుంటూ క‌వ‌రేజ్ చేసేసింది. అయితే ఇది ఓట్ల రూపంలో వ్య‌తిరేకంగా వ‌స్తే ఇక క‌వరేజ్ […]

బెంగాల్‌లో తీగ‌లాగితే … వైసీపీ డొంక క‌దులుతోందా..!

వైసీపీ నేత‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) ఉక్కుపాదం మోపుతోంది. దీంతో వారి గుండెల్లో గుబులు మొద‌లైంది. ఏపీలోనే గాక ప‌క్క రాష్ట్రంలో జ‌రిగిన భారీ కుంభ‌కోణాల్లోనూ వైసీపీ నేత‌ల పేర్లు ఉండ‌టంతో.. ఇప్పుడు పార్టీలో తీవ్ర గంద‌ర‌గోళం మొద‌లైంది. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన భారీ కుంభ‌కోణంలో తీగ‌లు లాగితే.. వైసీపీ డొంక క‌దులుతోంది. ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో పాటు మ‌రికొంద‌రు ఈడీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు ప‌డుతుండ‌గా.. తాజాగా ఈ జాబితాలో చిత్తూరు ఎంపీగా పోటీచేసిన […]

కేసీఆర్‌ సర్వేలకే సవాలు విసురుతున్న తెరాస ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు కంటి నిండా నిద్ర క‌రువవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వ‌హిస్తున్న స‌ర్వేలు.. వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ స‌ర్వే జ‌రుగుతుందో… అందులో తాము ఎక్క‌డ ఉంటామో తెలియ‌క అంతా స‌త‌మ‌త‌మైపోతున్నారు. ఇక ఈ స‌ర్వే ఫ‌లితాలే 2019 ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చేందుకు కొల‌మాన‌మ‌ని చెబుతుండ‌టంతో.. ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ మొద‌లైంది. `పార్టీ ప‌రిస్థితి బాగుంది.. కానీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి బాలేదు` అని సీఎం చెబుతుండ‌టంతో.. ఎక్క‌డ […]

టీడీపీలో న‌ల్లారి ఫ్యామిలీ క‌థ అడ్డం తిరుగుతుందా..!

కాలం క‌లిసి రాక‌పోతే.. అధికార పార్టీలో ఉన్నా.. ఎవ‌రు ఎంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం మాత్రం శూన్యం! వీరిని చూస్తే జాలి క‌ల‌గ‌క మాన‌దు! ఇప్పుడు న‌ల్లారి ఫ్యామిలీ వ్యూహాలను గ‌మ‌నిస్తే ఇలాగే అనిపిస్తుంది. రాజ‌కీయాల్లో యాక్టివ్ అవ్వాల‌ని న‌ల్లారి సోద‌రులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. స‌మైక్యాంధ్ర మాజీ సీఎం న‌ల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోద‌రుడు న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే టీడీపీలో చేరినా.. వారికి విజ‌యం సాధించడం మాత్రం అంద‌ని ద్రాక్షే అని […]

నంద్యాల‌లో టీడీపీకి భారీ షాక్‌..సీమ‌లో బాబు లెక్క తప్పిందా..!

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు టీడీపీ అధినేత‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇటీవ‌లె మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో ఇక్క‌డ విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. భూమా మృతి త‌ర్వాత‌.. నంద్యాల‌లో పూర్తి ప‌ట్టు సాధించాల‌ని భావిస్తున్న శిల్పా వ‌ర్గానికి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఉప ఎన్నిక‌ల్లో భూమా వ‌ర్గానికి సీటు కేటాయించాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యించ‌డంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిణామంతో […]

మళ్ళీ మోసం చేసిన బీజేపీ … దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ .. పోలవరం లేనట్టే ..!

ఏపీకి వ‌ర‌ప్ర‌దాయిని అని తెలుగు దేశం నాయ‌కులు, సీఎం చంద్ర‌బాబు ఆర్భాటంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న పోల‌వరం ప్రాజెక్టు వెనుక ఉన్న గుట్టు రట్టు అయింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్య‌త తామేన‌ని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై మ‌రో మెలిక పెట్టింది. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మాట మార్చిన ట్టుగానే ఇప్పుడు పోల‌వ‌రం గురించి కూడా మాట మార్చింది. ప్రాజెక్టుకు నిధుల లోటు లేకుండా చేస్తామ‌ని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై యూ ట‌ర్న్ తీసుకుంది. 2019లోగా […]

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ ఇదే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ అంటే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎంతో సన్నిహితులు అయిన వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. జ‌ల్సా హిట్ అయితే అత్తారింటికి దారేది ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్ అవ్వ‌డంతో పాటు ప‌వ‌న్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. 2013లో వ‌చ్చిన అత్తారింటికి దారేది త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా కోసం ప‌వ‌న్‌, […]