ప్రతిపక్ష నేత జగన్ మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రధాని మోడీని ఢిల్లీలో కలిసిన నాటి నుంచి ప్రతిపక్ష నేత జగన్ వ్యవహారశైలిపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటూ ఆయన మొండిగా ముందుకు వెళుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి ఇది మరింత ఎక్కవైందని రాజకీయవర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి రామనాథ్ కోవింద్‌ను జగన్ ఏపీలో కాకుండా తెలంగాణలో కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. […]
Author: admin
వర్మ చేతిలో ఎన్టీఆర్ జీవితం
సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. యదార్థ గాథలను తనదైన టేకింగ్‌తో వెండితెరపై ఆవిష్కరించిన వర్మ.. ఇప్పుడు తెలుగు సినిమా గతిని, రాజకీయాలను మార్చేసిన విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను తీస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అటు రాజకీయ నాయకుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు. సన్మానాలు, ఒడిదుడుకులు.. కష్టాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాలకు ముడి పడి ఉన్నాయి. మరి వీటన్నింటినీ వర్మ […]
పవన్ సర్వే ఏ పార్టీకి?
2019 ఏపీలో ఎన్నికల నామ సంవత్సరం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలకు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నికల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే థీమ్‌తో ఇటీవల ఆయన ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక, ప్రశ్నిస్తానంటూ […]
ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై జక్కన్న షాకింగ్ కామెంట్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మంచి డాన్సర్, మంచి నటుడు.. ఎంతటి డైలాగులైనా అవలీలగా.. అలవోకగా చెప్పేస్తాడు.. ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడంలో దిట్ట! ఇవే అందరిలోనూ ఉన్న అభిప్రాయాలు! కానీ ఎన్టీఆర్‌ను దగ్గరగా చూసిన, ఎంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తుల్లో జక్కన్న రాజమౌళి కూడా ఒకరు. అయితే అందరూ ఎన్టీఆర్‌లో నటుడిని చూస్తే.. జక్కన్న మాత్రం మరో ఎన్టీఆర్‌ను చూశారట. ఎన్టీఆర్‌కు సినిమాల తర్వాత రాజకీయాలే బాగా సెట్ అవుతాయంటూ […]
వైసీపీలోకి సీనియర్.. అమరావతిలో టీడీపీకి ఇబ్బందే!
విపక్షం వైసీపీకి రాజధాని ప్రాంతం అమరావతిలో గట్టి పట్టు దొరుకుతోందా? వచ్చే ఎన్నికల్లో విజయవాడ ప్రాంతంలో పార్టీని ముందుండి నడిపించగల నేత వస్తున్నాడా? ముఖ్యంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి.. మొగుడు లాంటి కేండిట్ వైసీపీలోకి వస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. గతంలో సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన మల్లాది విష్ణు ఇప్పుడు జగన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైందని రెండు మూడు రోజులుగా […]
నంద్యాల ఓటర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు
నంద్యాలలో పసుపు జెండా రెపరెపలాడించేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇది తమ నియోజకవర్గమని, నాయకులు వెళ్లినా క్యాడర్ మాత్రం తమ వైపే ఉందని.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. తమ అభ్యర్థిగా ఆర్థికంగా, శ్రేణుల్లోనూ బలంగా ఉన్న శిల్పామోహన రెడ్డిని ప్రకటించడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కేవలం సెంటిమెంట్‌ను నమ్ముకునే బరిలోకి దిగుతున్నామన్న అపవాదు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాయిలాల మీద తాయిలలు ప్రకటిస్తున్నారు. నిధులు, […]
టీకాంగ్రెస్‌లో మూడు ముక్కలాట
విభజన తర్వాత ఏపీలో పూర్తిగా దెబ్బతిన్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పునర్వైభవం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఉన్న నేతలందరూ సీఎం పీఠంపై కన్నేసి.. లాబీయింగ్‌కు కూడా తెరలేపారు. ఎవరికి వారు తామే సీఎం అభ్యర్థి అని ప్రకటించేసుకుంటున్నారు. సర్వేలు చేయించేస్తున్నారు. తన కంటే జూనియర్లు సీఎం కుర్చీ కోసం తెగ ప్రయత్నిస్తుంటే.. నేనెందుకు ప్రయత్నించకూడదు అనుకున్నారో ఏమో.. ఇప్పుడు ఈ రేసులోకి […]
ఉండవల్లి అమరావతి టూర్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
నిత్యం వార్తలో నిలుస్తూ.. సంచలనాలకు మారు పేరుగా నిలిచే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి అందరికీ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో ఆయనకూడా ఒకరు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. ఒంటికాలిపై లేస్తూ ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరిపోతారనే ప్రచారం కూడా జరిగిపోయింది. అలాంటి ఉండవల్లి.. ఏపీ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించడం ఆశ్చర్యం కలిగించకమానదు. అంతేకాదు.. […]
ఏపీ టీడీపీ -బీజేపీ గ్యాప్‌కు దుర్గమ్మే సాక్ష్యం
మిత్రపక్షాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజధాని ప్రాంతం, ఏపీకి కీలకమైన విజయవాడలో టీడీపీ-బీజేపీ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకూ ఇరు పార్టీల నేతల మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగిన సంఘటన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు… కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణాస్వీకారానికి గైర్హాజరవడం […]