2019 ఎన్నికల్లో జనసేన 83 సీట్లు గెలుస్తుందంటూ జనసేన అభిమాని నిర్వహించిన సర్వేలో తేలడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్న సమయంలో.. ఈ సర్వే రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. అయితే దీనిపై అటు రాజకీయ నాయకులు, ఇటు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సర్వే నిజమా? అబద్దమా? 83 సీట్లు ఎలా వస్తాయి? ఇంకా పార్టీ నిర్మాణమే పూర్తిగా లేని జనసేనకు […]
Author: admin
సబితా ఇంద్రారెడ్డి ప్లాన్…హైకమాండ్ ఒప్పుకుంటుందా ?
మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయంగా పెద్ద యాక్టివ్‌గా ఉండడం లేదు. గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సబితా టీ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుల దూకుడు ముందు పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోన్న ఆమె ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టు టీ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హోం మంత్రి అయిన సబితా […]
`తూర్పు` వైసీపీలో టికెట్ల లొల్లి షురూ!!
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలో గ్రూపు రాజకీయాలకు, అంతర్గత కుమ్ములాటలకు కొదవలేదు. ఇవి నిత్యం రగులుతూనే ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో ఎలాగైనా ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ కంటే తూర్పు గోదావరిలో కొంత బలం ఉన్న విషయం తెలిసిందే! అందుకే మరింత బలపడేం దుకు ఒక్కో నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జులు, కో-ఆర్డినేటర్లు ఇలా.. ఒకరికంటే ఎక్కువమందిని నియమించేశారు. ఇవే ఇప్పుడు ఆయనకు తలనొప్పి తీసుకొస్తున్నాయి. వాళ్లంతా తమకేటికెట్ దక్కుతుందని.. […]
తెలుగు మీడియాలో మరో పత్రిక వస్తోందా..?
స్వాతంత్య్ర సంగ్రామం కీలక దశలో ఉన్న సమయంలో.. ప్రజల్లో దేశభక్తిని రగిలించడంలో పత్రికలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. అయితే తదనంతరం కాలంతో పోటీపడలేక, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోలేక ఇవి కనుమరుగైపోయాయి. అలాంటి పత్రికకు జీవం పోసేందుకు పాత్రికేయులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగు మీడియాలో.. మరోసారి దీనిని తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. అదే ఆంధ్ర పత్రిక!! జాతీయోద్యమానికి ఊపిరులూదిన పత్రిక.. భిన్నమైన శైలితో ఆనాటి పాఠకులను సమ్మోహితుల్ని చేసిన పత్రిక.. దేశభక్తిని అణువణువునా నింపిన పత్రిక.. ఆంధ్రపత్రిక. […]
బీజేపీలోకి చంద్రబాబు అనుచరుడు..!
ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రియ శిష్యుడు. చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సదరు పారిశ్రామికవేత్తకు చంద్రబాబు ఏకంగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఓ సారి ఎంపీగా కూడా ఆయన గెలిచారు. సదరు పారిశ్రామికవేత్త కోసం చంద్రబాబు ఏకంగా టీడీపీలో ఓ సీనియర్‌ను కూడా వదులుకున్నారు. మరి చంద్రబాబు అంతలా ప్రయారిటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు బాబుకు షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా ? అంటే తెలంగాణలోని ఖమ్మం […]
ప్రశాంత్ మాట పక్కన పెట్టి మరీ..జగన్ ఆ నిర్ణయం
తాను ఎవరి మాట లెక్కచేయబోనని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టంచేశారు. ఇప్పటికే పార్టీలో సీనియర్లకు ఆయన మనస్తత్వం గురించి తెలుసు కనుక సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోవడం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్‌కు కూడా జగన్ ఝలక్ ఇచ్చారు. `మీరు చెప్పేది చెప్పండి.. నేను నాకిష్టమైనదే చేస్తా` అని చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరైతే బాగుంటుందనే అంశాలపై ఇప్పటికే ప్రశాంత్ బృందం ఆరా తీస్తోంది. సిట్టింగ్ […]
‘నిన్ను కోరి’ TJ రివ్యూ
సినిమా: నిన్ను కోరి నటీనటులు: నాని, నివేద థామస్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృథ్వి తదితరులు సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని సంగీతం: గోపీ సుందర్ నిర్మాత: డీవీవీ.దానయ్య స్క్రీన్‌ప్లే: కోన వెంకట్ దర్శకత్వం: శివ నిర్వాణ కథ ఎలా ఉంది… నిన్ను కోరి సినిమా కథా పరంగా చూస్తే కొత్తదేం కాదు. అప్పుడెప్పుడో దాసరి స్వయంవరం సినిమా నుంచి నేటి వరకు ఈ లైన్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకోవడం…వాళ్లలో అమ్మాయికి తల్లిదండ్రులు వేరే […]
ఉద్యోగులకు చిరు `కోటీశ్వరుడి` దెబ్బ
150వ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి తన సత్తా ఏంటో నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి! సంక్రాంతికి విడుదలైన `ఖైదీ నెం 150` సినిమా దాదాపు వంద కోట్లు వసూలు చేసింది. సిల్వర్ స్క్రీన్‌పై అదరగొట్టిన చిరు.. బుల్లితెరపై మాత్రం నిరాశపరిచాడు. మాటీవీ యాజమాన్యం స్టార్ చేతిలోకి వెళ్లిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా.. చిరు హోస్ట్‌గా `మీలో ఎవరు కోటీశ్వరుడు`ను ప్రారంభించింది. గత సిరీస్‌ల కన్నా ఇది పెద్ద హిట్ అవుతుందని భావించింది. కానీ అంచానాలు తారుమారయ్యాయి. అయితే […]
ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యేపై బాబు నిఘా..!
ఎన్నికలు, కప్పదాట్లు, జంపింగ్ జపాంగ్‌లు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. ఈ మూడేళ్లలో విపక్ష పార్టీల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఏపీలో అధికార టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోయారు. వచ్చే ఎన్నికలకు రెండేళ్లు కూడా టైం లేదు. అయితే వీరంతా ఇప్పుడు ఉన్న అధికార పార్టీల్లోనే ఉంటారా ? అంటే వచ్చే ఎన్నికలకు మరో పార్టీలోకి కూడా జంప్ చేసేందుకు తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారట. ఇక ఏపీలో జనసేన ఎంట్రీతో […]