హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో..!

పోలీసులు చట్టాన్ని అతిక్రమించలేరు. ఎంత ఆవేశం ఉన్నప్పటికీ చట్టం పరిధికి లోబడి మాత్రమే వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇదంతా నిజమే గానీ.. కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే చిత్రంగా కనిపిస్తుంటుంది. హత్యాచారం అయితేనే అంటే అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తేనే సీరియస్ గా తీసుకుంటారా? కేవలం అత్యాచారం మాత్రమే అయితే లైట్ తీసుకుంటారా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. సైదాబాద్ దుర్ఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. […]

జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]

భట్టి ప్రశ్నకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో..?

దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.. దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. కొన్ని కుటుంబాలకు ఈ మొత్తం అందింది కూడా. అయితే ఇపుడు కాంగ్రెస్ సీనియర్ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త ప్రశ్న, అనుమానం లేవనెత్తారు. దళితబంధు కింద ఇస్తున్న రూ. పది లక్షల డబ్బు మొత్తం రాయితీగా ఇస్తారా, లేక రుణం రూపంలో ఇస్తారా చెప్పాలని కోరుతున్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. […]

కారులో పదవుల పండగ.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..

తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం వచ్చే ఎన్నికలపై దృష్టి సారించింది. పార్టీలో అందరినీ సంతృప్తి పరచేందుకు ప్లాన్ రూపొందించింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానుండటంతో కేడర్ ను కాపాడుకునేందుకు పదవుల పంపకం ప్రారంభించింది. ఇన్ని రోజులు పార్టీపై లేని శ్రద్ద ఉన్నట్టుండి రావడంతో కేవలం ఎన్నికల కోసమే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం పార్టీ సమావేశంలో కేటీఆర్ చేసిన ఓ కామెంట్ తో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గ ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష […]

ఒక్కడి కోసం వెయ్యి మంది పోలీసులు..పోలీసు వ్యవస్థనే సవాల్ చేస్తున్న ఉన్మాది..

ఒక్కడు.. కేవలం ఒకే ఒక్కడు.. మొత్తం పోలీసులనే సవాల్ చేస్తున్నాడు.. అతనేమీ పెద్దగా చదువుకొనిందీ లేదు.. అంత తెలివి వంతుడు కూడా కాదు.. గంజాయి, మద్యానికి అలవాటు పడ్డ వాడు..రోజు కూలీ పనిచేసుకుంటూ బతుకున్న యువకుడు.. వారం రోజులుగా తెలంగాణ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ ఓ కుటుంబానికి రోదన, ఆవేదనను మిగిల్చాడు. అతడే ..రాజు.. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిని దారుణంగా లైంగిక దాడి చేసి.. హత్యచేసిన నిందితుడు. చాక్లెట్ ఆశ చూపించి అభం, […]

నిందితుడిని పాటించిన వారికీ అదిరిపోయే బహుమతి ప్రకటించిన.. ఆర్పీ పట్నాయక్​..!

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్​ సామాజిక అంశాల పట్ల కూడా చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇటీవల సాయిధరమ్​ తేజ్​ రోడ్డు ప్రమాదం విషయంలోనూ ఆర్పీ పట్నాయక్​ స్పందించారు. రోడ్డుపై ఇసుకు పేరుకుపోయినా పట్టించుకోని మున్సిపల్​ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆర్పీ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల సైదాబాద్​లోని సింగరేణి కాలనికి చెందిన ఓ చిన్నారి .. అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణానికి […]

బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు..నాని ట్వీట్..!

హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని కఠిన శిక్ష విధించాలని వీఐపీలు సహా సామాన్యులు కోరుతున్నారు. మంచు మనోజ్ బాధిత కుటుంబానికి పరామర్శ తెలిపి ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ప్రజలు కూడా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులకు సహకరించాలని కోరాడు. హీరో మహేష్ బాబు కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశాడు. సమాజంలో పరిస్థితులు […]

వినాయకుడి చేతిలో శానిటరీ ప్యాడ్స్​.. హిందూ సంఘాల మండిపాటు..!

మహిళల నెలసరి విషయంలో మనదేశంలో సరైన అవగాహన ఉండదన్న విషయం తెలిసిందే. బహిష్టు సమయంలో స్త్రీలపై వివక్ష ఉంటుంది. వారిని పవిత్ర కార్యక్రమాలు చేయనివ్వరు. గుడులు, గోపురాలకు వెళ్లనివ్వరు. శుభకార్యాలకు వెళ్లనివ్వరు. ఇటువంటి సంప్రదాయం మనదేశంలో ఉన్నదే. అయితే కేవలం నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లోనే కాక.. పట్టణ ప్రాంతాల్లోనూ ఈ ఆచారాన్ని చాలా మంది చదువుకున్న వాళ్లు పాటిస్తారు. ఈ క్రమంలో నెలసరి సమస్యలపై ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది. ఈ విషయాన్ని చాలా మంది బహిరంగంగా చర్చిస్తున్నారు. […]

తలైవి చాలా బాగుంది.. తలైవా ప్రశంసలు..!

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ తలైవి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించింది. ఈ సినిమాకు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. జయలలితగా కంగనా రనౌత్, ఎంజీఆర్ గా అరవింద్ స్వామి అద్భుతంగా నటించారంటూ […]