సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని.. ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్.. వినాయక చవితి పండుగ రోజు బైక్ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరగడంతో ఆయనకు […]
Author: admin
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి.. హీరో ఎవరంటే..!
అందం ఉండి అభినయం ఉండి ఇప్పటివరకు సరైన సక్సెస్ సాధించని హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నిధి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయమై మూడేళ్లు దాటినా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఆమె కెరీర్లో ఇప్పటి దాకా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కటే విజయం అందుకుంది. 2018 లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ద్వారా నిధి అగర్వాల్ టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి సినిమాతోనే […]
కోవిడ్ టైంలో అందరికీ ఫెయిల్యూర్స్.. ఆ స్టార్ కు మాత్రం బ్లాక్ బస్టర్స్..!
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలు కష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా టైంలో షూటింగ్ ఆగిపోయి కొన్ని సినిమాలు, షూటింగ్ పూర్తయి విడుదలకు నోచుకోని సినిమాలు, థియేటర్లలో సినిమాలు విడుదలై కలెక్షన్లు లేక చాలా మంది నష్టాలపాలయ్యారు.కానీ కొన్నేళ్లుగా హిట్టు ముఖం ఎరుగని ఇద్దరు అగ్ర హీరోలు మాత్రం కోవిడ్ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకొని తిరిగి ఫామ్ అందుకున్నారు. ఆ అగ్ర హీరోలు ఎవరో […]
రెండ్రోజులుగా శ్రీకాళహస్తిలోనే సమంత..కాపురాన్ని నిలబెట్టుకునేందుకు పూజలు ..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు శ్రీ కాళహస్తిలో వెలసిన ముక్కంటీశ్వరుడు అంటే అపారమైన భక్తి, నమ్మకం. తెలుగులో ఆమె హీరోయిన్ గా పరిచయం అయినప్పటి నుంచి శ్రీకాళహస్తికి తరచూ వచ్చి వెళ్తున్నారు. ప్రస్తుతం సమంత శ్రీకాళహస్తిలో రెండు రోజులుగా మకాం వేసింది. సమంత,అక్కినేని నాగచైతన్య కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ పుకార్లు చెలరేగుతున్నాయి. సమంత ట్విట్టర్ లో సమంత అక్కినేని గా ఉన్న తన పేరును జస్ట్ […]
దేశంలో మరో వైరస్ వ్యాప్తికి ప్రయత్నం.. చెన్నై విమానాశ్రయానికి విష పురుగుల పార్శిల్..
చైనాలోని వుహాన్ ల్యాబ్ ద్వారా లీకైన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా లక్షలాదిగా ప్రాణ నష్టం జరగడంతో పాటు ఆర్థికంగా కూడా చాలా దేశాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఇప్పటికే కోవిడ్ రెండు వేవ్ లను చాలా దేశాలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉంటుందన్న భయాందోళనలతో అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ నే ఎదుర్కోలేక మన దేశం కూడా సతమతమవుతుండగా తాజాగా దేశంలోకి మరో వైరస్ […]
తెలుగు ‘హనుమాన్ ‘అడ్వెంచర్ టీజర్ వచ్చేసింది !
హీరో నాని నిర్మాతగా మారి తీసిన ‘అ’ సినిమాతోనే విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తన రెండో సినిమాగా సీనియర్ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కల్కి ఓ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ తెలుగు తెరపై మొదటిసారిగా జాంబిల కాన్సెప్ట్ తో జాంబి రెడ్డి అనే సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు. జాంబిల కథకు […]
హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో!
పోలీసులు చట్టాన్ని అతిక్రమించలేరు. ఎంత ఆవేశం ఉన్నప్పటికీ చట్టం పరిధికి లోబడి మాత్రమే వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇదంతా నిజమే గానీ.. కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే చిత్రంగా కనిపిస్తుంటుంది. హత్యాచారం అయితేనే అంటే అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తేనే సీరియస్ గా తీసుకుంటారా? కేవలం అత్యాచారం మాత్రమే అయితే లైట్ తీసుకుంటారా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. సైదాబాద్ దుర్ఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. […]
ఆ ఎంపీ మహా పిరికి.. అయినా ఓవరాక్షన్ జాస్తి..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు.. తనకు లక్షలాది మంది ప్రజల ఫాలోయింగ్ ఉన్నదని.. తాను పోస్టులు పెడితే లక్షలాది మంది ఎగబడి చూస్తుంటారని.. ఈ రాష్ట్రంలో తనకున్నంత సోషల్ మీడియా ఫాలోయింగ్ మరే యితర నేతకూ లేదని చాలా తరచుగా చెప్పుకుంటూ విర్రవీగుతూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆయనకున్న ఫాలోయింగ్ మొత్తం.. ముఖ్యమంత్రి జగన్ ను తీవ్రంగా ద్వేషించే.. తెలుగుదేశం పార్టీకి చెందిన అతివాదులు మాత్రమే అనే సంగతి ఆయనకు తెలిసినా ఒప్పుకోరు. పేరుకు […]
మోడీ సర్కార్ కు సోనూసూద్ ఫోబియా ఉందా?
కాలం కాని కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎవరిమీదనైనా దాడులు నిర్వహించారంటే గనుక.. ఖచ్చితంగా అది రాజకీయ కక్ష సాధింపు చర్యలే అనే నిశ్చితాభిప్రాయం ఈ దేశ ప్రజలందరిలోనూ ఏర్పడిపోయింది. పైగా కేంద్రప్రభుత్వం తమకు కిట్టని వారిని వేధించడానికి, లొంగదీసుకోవడానికి, బెదిరించడానికి, కిమ్మనకుండా చేయడానికి ఎంచుకునే అస్త్రంగా ఐటీ దాడులకు అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు సినీనటుడు సోనూసూద్ కు చెందిన బొంబాయిలోని నివాసం మీద, లక్నోలోని కంపెనీ మీద ఐటీ దాడులు జరిగాయి. ఇవి కూడా […]









