రైతు చట్టాల రద్దు.. కమలం నేతల మౌనం

రాష్ట్ర ప్రభుత్వమే వరి కొనుగోలుచేయాలని నానా యాగీ చేసిన టీబీజేపీ నేతలు ఇపుడు ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. కేసీఆర్ పై అగ్గిమీద గుగ్గిలమయ్యే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ మౌనముద్రం దాల్చారు. మూడు రైతు చట్టాలను రద్దుచేస్తూ రైతులకు ప్రధాన మంత్రి మోదీ క్షమాపణ చెప్పిన అనంతరం ఎందుకో స్థానిక నాయకులకు మాటలు రావడం లేదు. మోదీ ప్రకటనను ఒకటికి రెండు […]

మంత్రి సీటువైపు మనసు లాగుతోంది..

రాజకీయాల నుంచి ఇక రిటైర్ కావాలని అనుకుంటున్నా.. స్పీకర్ సీటు బోరు కొట్టింది.. మంత్రిని చేయండి.. కొద్ది రోజులు పనిచేసి ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతా అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం జగన్ ను కోరుతున్నారట. ఎలాగైనా సరే కేబినెట్ లో బెర్త్ దక్కించుకోని తమ్మినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన తమ్మినేని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సమకాలీకులు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయన ఆముదాల […]

కేసీఆర్ మదిలో.. ముందస్తు ఎన్నికలు

‘‘నేను ఉద్యమాలనుంచి వచ్చిన వాడిని.. పదవులు నాకు లెక్కకాదు.. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశానో మీకు తెలుసు.. ’’ అని మొన్న ఇందిరాపార్కులో జరిగిన ధర్నా లో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతోంది. అంటే.. కేసీఆర్ మదిలో ఏదో ఉంది.. రాజీనామాలు చేసి ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశమూ ఉందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఏదైనా మాట్లాడారంటే దానికి ఓ లెక్క ఉంటుందని ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్నారు. వరి […]

ఓడిపోయినా.. మోడీని హీరో చేస్తున్నారే..!

కేంద్ర ప్రభుత్వం మూడువ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేసి తీరాల్సిందేనని రైతులు యుద్ధం ప్రకటించారు. మీకు తెలియడం లేదు.. మేం మిమ్మల్ని ఉద్ధరించడానికి చాలా మంచి చట్టాలు తెచ్చాం.. వాటివల్ల జరిగే మేలు ఏమిటో తెలుసుకునేంత తెలివితేటలు మీకు లేవు.. మేం చెప్పినమాట విని చట్టాలను ఫాలోకండి.. అని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. రైతులు తమ యుద్ధాన్ని అంతకంటె తీవ్రం చేశారు. మా బాగు ఏమిటో మాకు తెలుసు.. మరీ […]

వెనక్కి వెళ్లిన వివేకా హత్య కేసు..!

మామూలుగా అయితే శాసనసభ జరుగుతూ ఉండగా.. ఇటీవలి సంఘటనలను పరిణామాలను అన్నిటినీ బేరీజు వేసుకుంటే వివేకా హత్యకేసపు విషయంలో మాజీ డ్రైవరు దస్తగిరి వాంగ్మూలం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు శంకరరెడ్డి అరెస్టు అనే వ్యవహారాలు సభలో అట్టుడికిపోతుండాలి. రాష్ట్రవ్యాప్తంగా కూడా విపక్షాల వారు అందరూ ఆ విషయాల గురించే గోలచేస్తూ ఉండాలి. కానీ ఆ చర్చ మొత్తం హైజాక్ అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు మాట్లాడుకునే ఏ ఇద్దరు కలిసినా చంద్రబాబు గురించే మాట్లాడుకుంటున్నారు. […]

వైసీపీ భ్రష్టుపట్టడానికి కొడాలినాని ఒక్కడు చాలు..!

రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. అయితే ఈ విమర్శలు అనేవి అంశాలవారీగా ఉండాలి.. ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రతిపక్షాల వ్యవహార సరళిమీద ఉండాలి అనే తరహా రాజకీయ విలువలు ఎప్పుడో మంటగలిసిపోయాయి. ఇప్పుడంతా తిట్ల పర్వమే నడుస్తోంది. ఒకరినొకరు తిట్టుకోవడం, వ్యక్తిగత తిట్లు ఇవన్నీ కూడా చాలా సహజపరిణామాలుగా వచ్చేశాయి. వీటన్నింటినీ కూడా భరించవచ్చు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని తిట్టే తిట్లను వినడం కూడా సాధ్యం కాదు. మామూలుగానే కొడాలి నాని […]

మోదీపై సమర శంఖం పూరించిన కేసీఆర్‌

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది.. అదే రైతు ఉద్యమం.. దీనికి కేసీఆరే నేతృత్వం వహిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్‌ తెలంగాణ కోసం ఏళ్ల తరబడి కొట్లాడాడు.. నిరసన చేశాడు.. ధర్నాలు, దీక్షలు.. ఆమరణ నిరాహార దీక్ష..ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ఇన్ని నిరసన కార్యక్రమాలుచేసి.. అనేకమంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా క్రెడిట్‌ మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో […]

ఈటల వింత వాదన

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.. అక్కడ ఈటల రాజేందర్‌.. టీఆర్ఎస్‌ అభ్యర్థిపై గెలిచారు. అంతే.. ఈ చర్చ ఇపుడు ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులు ఈ విషయాల గురించి మాట్లాడతారు. అంతే.. అయితే గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాత్రం వింత విషయాన్ని తెరపైకి తెచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలవడం.. అందులోనూ తాను […]

చెప్పినట్టుగా చెప్పారు.. విన్నట్టుగా విన్నారు..

కొట్టినట్టుగా కొడితే.. ఏడిచినట్టుగా ఏడ్చారనే సామెత ఒకటి తెలుగునాట ఉంది. చిత్తశుద్ధి లేకుండా చేసే పనులకు ఈ సామెత అతికినట్టుగా సరిపోతుంది. తాజాగా ఏపీలో అమరావతి రాజధాని కోసం సాగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ క్రియాశీలంగా అండగా నిలుస్తుందా లేదా అనే సంగతి.. ఈ సామెతకు సరిపోయేలా ఉంది. అమరావతి రాజధాని పోరాటానికి పార్టీ నాయకులంతా మద్దతు ఇచ్చి తీరాల్సిందే అని అమిత్ షా తిరుపతి సమావేశంలో హూంకరించినట్టుగాను, అందరూ అందుకు సమ్మతించినట్టుగానూ వార్తలు వచ్చాయి. […]