టాలీవుడ్లో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఇటీవల ఏ ఫంక్షన్‌కు వచ్చినా మాట్లాడడం అరుదు. ఏ ఫంక్షన్లో అయినా రాఘవేంద్రుడు మాట్లాడితే రాఘవేంద్రుడు మాట్లాడాడని పెద్ద సంచలనంగా చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎంతో సీనియర్ అయిన రాఘవేంద్రరావు కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారు. ఆయన మాట్లాడే మాటలు కూడా ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా, నొప్పించకుండా ఉంటాయి. అయితే తాజాగా దర్శకేంద్రుడు చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌లో కాక రేపుతున్నాయి. వీటిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.
మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన రాఘవేంద్రుడు సాయిధరమ్‌పై చేసిన కామెంట్లే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మంట రేపుతున్నాయి. ఇంటికొక్కడు ఇలాంటి ఇలాంటి వ్యక్తి ఉంటే దేశం బాగుపడుతుందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పిన రాఘవేంద్రుడు మామయ్య మెగాస్టార్లో ఉన్న గ్రేస్ సాయిధరమ్ తేజ్‌లో కనిపిస్తోందని.. సాయి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటిలోను అదరగొట్టేస్తున్నాడని ఆయన ఆకాశానికి ఎత్తేశారు.
అక్కడితో ఆగకుండా ‘మెగా ఫ్యామిలీలో మరో మెగాస్టార్ తేజ్’ అంటూ రాఘవేంద్రరావు అతిశయోక్తిగా వాడిన మాటలు మెగా అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. వీటిపై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ తర్వాత స్థానం మెగాస్టార్‌దే అని, చిరంజీవి తర్వాత ప్లేస్ ఆయన వారసుడికే ఇవ్వాలి గాని, సాయిధరమ్ తేజ్‌కు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక మెగా ఫ్యామిలీలో డ్యాన్సులు గురించి చెప్పాలంటే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పేరే ముందుగా ప్రస్తావించాలి గాని దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు సాయిధరమ్ పేరు ఎలా ప్రస్తావిస్తారన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రాఘవేంద్రుడు జవాన్ సినిమాను ప్రమోట్ చేసేందుకు సాయిని పొగడడం కూడా తప్పయితే ఎలా ?