టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలోనే తాతగా ప్రమోషన్ పొందుతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి. మొదట నాగచైతన్య – శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ రూమర్స్ వినిపించగా.. ఇప్పుడు అఖిల్ – జైనబ్ తల్లిదండ్రులవుతున్నారని వార్తలు వినిపించాయి. దీనిపై తాజాగా ఓ హెల్త్ ఈవెంట్‌లో నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.. మీరు తాతగా ప్రమోట్ అవుతున్నారట కదా నిజమేనా.. అని అడిగిన ప్రశ్నకు నాగార్జున సమాధానం చెప్పుకొచ్చారు.

నవ్వుతూ.. చాలా తెలివిగా రియాక్ట్ అయ్యాడు. సరైన టైం వచ్చినప్పుడు నేనే ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తా అంటూ మాట దాటేశారు. ఈ వార్తను నాగార్జున ఖండించకపోవడంతో.. అక్కినేని ఇంట్లో త్వరలోనే వారసులు రాబోతున్నారేమో.. ఇదే నిజం కనుక నాగార్జున సరిగ్గా రియాక్ట్ కాలేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. అదే వేదికపై నాగార్జున తన హెల్త్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకున్నాడు.

గత 15 ఏళ్లుగా తీవ్రమైన మోకాళ్ళ నొప్పుతో ఆయన బాధపడుతున్నాడని.. సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేక లూబ్రికేంట్ ఫ్లూయిడ్స్ మరియు పిఆర్పి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. నొప్పి ఉన్న లేకపోయినా ప్రతి రోజు ఉదయం మోకాలి కోసం వ్యాయామం చేస్తానని,, అస్సలు మిస్ కానని తన రహస్యాన్ని రివీల్ చేశాడు. 60 ప్లస్ లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా కనిపించే నాగార్జున ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌తో కూడా తన క్రమశిక్షణను ఎక్కడ మిస్ చేయకపోవడంతో.. నాగార్జున విధానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

