గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలోవచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ తాండవం. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 2021 కరోనా టైంలో థియేటర్లకు ప్రేక్షకులను తండోపతండాలుగా రప్పించింది. అఖండకు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లపై కూడా జనం సినిమాకు వచ్చి బ్రహ్మరథం పట్టారు. కోవిడ్ 19 మహమ్మరి తర్వాత.. అసలు థియేటర్లో సినిమాలు చూస్తారా అనే సందేహం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతగానో నెలకొంది. ఆ సందేహాలు అన్నింటిని పట్టా పంచలు చేస్తూ వాటికి స్ట్రాంగ్ భరోసా ఇచ్చింది. ఇక సినిమాలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్‌గా తెరకెక్కించారు.

అయితే.. సినిమా సీక్వెల్ అఖండ 2.. ను 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ అచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇప్పుడు అఖండ 3 కూడా రానుంది. దీన్ని మరొక్క ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించనున్నారని టాక్ వైరల్ గా మారుతుంది. అఖండ 2 చూసిన ప్రతి ఒక్క ఆడియన్‌కు మరో సీక్వెల్ రాబోతుందని.. దాని పేరు జై అఖండ అని క్లారిటీ వచ్చేసింది. తాండవం పూర్తయిన తర్వాత బోయపాటి క్లైమాక్స్.. సీక్వెన్స్ జై అఖండ టైటిల్ వేశారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో సినిమాకు మరో కొత్త ప్రొడ్యూసర్ రానున్నారని ఫిలిం వర్గాల్లో టాక్ వైరల్ గా మారుతుంది.
కారణం.. బోయపాటి, బాలయ్య కూడా 14 రీల్స్ అధినేతలపై అసంతృప్తితో ఉన్నారట. దానికి కారణం విడుదలకు ముందు జరిగిన పరిణామాలేనన్ని టాక్ నడుస్తుంది. తాజాగా.. అఖండ తాండవం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో సైతం నిర్మాతల గురించి బాలయ్య, బోయపాటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే టైంలో.. డిసెంబర్ 5న సినిమా వాయిదా పడి 12న రిలీజ్ చేయడానికి సహకరించిన దిల్ రాజు, మ్యాంగో రామ్, శ్రీధర్ ,డాక్టర్ సురేంద్ర గురించి కూడా ప్రస్తావించారు. రిలీజ్ కు ముందు జరిగిన పరిణామాలు క్రమంలో జై అఖండ 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదట. అఖండ తాండవం సక్సెస్ సాధించిన క్రమంలో.. జై అఖండ ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్మాతలు ఎవరో తెలియాలంటే సినిమా సెట్స్ పైకి రావాల్సిందే.


