బోయపాటి శీను డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం.. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాలతో వాయిదా పడి.. డిసెంబర్ 12 కు ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా.. కొంతమంది నుంచి మాత్రం లాజిక్ లెస్ కంటెంట్ అనే నెగటివ్ కామెంట్లు.. ట్రోల్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన బోయపాటి.. ఈ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. తను ఈ సినిమాలో అన్ని లాజిక్ ప్రకారం ఉండేలా చూసుకున్నానని.. నిజానికి ఏ అంశం అయినా విభేదించగలవాళ్ళు ఎక్కడైనా ఉంటారని.. ఆయన చెప్పుకొచ్చాడు. ఒక విషయంలో ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చకపోవచ్చు. కానీ.. నేను మాత్రం పర్ఫెక్ట్ లాజిక్‌లతో సినిమాలు రాసుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అష్టసిద్ధి సాధన.. సుమారు 14 నుంచి 16 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని.. అది చేసిన తర్వాత ఆ సాధన చేసిన వారికి మానవతీత శక్తులు వస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ సినిమాలో కూడా అఖండ అష్టసిద్ధి సాధన చేసిన తర్వాతే ఆయన చేయి తగిలితేనే సవాలు లెగిసేలా పరిస్థితి నెలకొందని.. తాను ముందుగానే ఈ విషయంపై హింట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారని బోయపాటి వివరించాడు. తన సినిమా లాజిక్ విషయంలో ఎక్కడా పొరపాటు చేయలేదని వివరించాడు. అయితే.. బోయపాటి దగ్గర నుంచి ఇలాంటి పాజిటివ్, కూల్, బ్రిలియంట్ కామెంట్స్ ను ఎవరు ఊహించి ఉండరు. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం బోయపాటి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.



