టాలీవుడ్ 2025: భారీ లాభాలు కొట్టిన సినిమాలు ఇవే.. అసలు విన్నర్ ఆ హీరోనే..!

2025 తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ కొల‌గొట్టిన‌ టాప్ సినిమాల‌ లిస్ట్ వైరల్ గా మారుతుంది. ఆ లిస్టులో మొదట సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. జనవరి 14న సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను మించిపోయి.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా మారింది. ఈ సినిమా తర్వాత.. జనవరి 12న బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చి సెమీ హిట్ గా నిలిచింది.

సంక్రాంతికి వస్తున్నాం పాజిటివ్ టాక్.. బాలయ్య డాకు మహారాజుకు కాస్త దెబ్బ అయ్యిందనే చెప్పాలి. అయినా.. డాకు మహారాజ్ ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఫిబ్రవరిలో నాగచైతన్య హీరోగా వ‌చ్చిన తండేల్‌ సినిమా ఆయనకు మంచి కం బ్యాక్ ఇచ్చింది. మార్చి 14న వచ్చిన కోర్ట్‌ సినిమా ప్రొడ్యూసర్లకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. రూ.4 కోట్లతో తెర‌కెక్కి ఏకంగా.. రూ.60 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇదే నెలాఖరులో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ సైతం రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టి లాభాలను అందుకుంది. ఇక.. మే 1 న రిలీజ్ అయిన నాని హిట్ 3.. రూ.110 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి హిట్ ట్రాక్ లో దూసుకుపోయింది.

Mahavatar Narsimha' OTT release confirmed: When and where to watch the  blockbuster animated mythological movie | - The Times of India

తర్వాత వారంలో.. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సింగిల్ సినిమా సైతం మంచి సక్సెస్ అందుకుంది. రూ.40 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా మారింది. సమంత ప్రొడక్షన్ లో వచ్చిన శుభం సినిమా సైతం భారీ లాభాలను తెచ్చిపెట్టింది. జూన్ 24న‌ వచ్చిన శేఖర్ కమ్ముల కుబేర తెలుగులో మంచి హిట్ గా నిలిచింది. ఇక జూలైలో.. డైరెక్ట్ తెలుగు సినిమాలు ఏది సరైన సక్సెస్ అందుకోలేకపోయాయి. యానిమేషన్ మూవీగా వచ్చిన మహావతార నరసింహ మాత్రం రికార్డ్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన లిటిల్ హార్డ్స్ భారీ హీట్ గా మారింది. రూ.2.4 కోట్లతో వ‌చ్చి.. రూ.40 కోట్లు కలెక్షన్లు కొలగొట్టింది. అదే వారంలో సెకండ్ వీక్ లో వచ్చిన కిష్కింద పూరి, మీరాయ్‌ సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. సెప్టెంబర్ చివరివారంలో తెర‌కెక్కిన ఓజి భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

Mirai (2025 film) - Wikipedia

ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ టచ్ చేయలేకపోయింది. అక్టోబర్లో కిరణ్ అబ్బవరం కే – ర్యాంప్‌ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. నవంబర్‌లో ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో సినిమాలు పాజిటీవ్‌ టాక్ దక్కించుకున్నాయి. అయితే.. కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో దక్కించుకోలేదు. నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి వ‌చ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇలా 2025 డిసెంబర్ వరకు వచ్చిన అన్ని సినిమాల్లో పూర్తిస్థాయిలో హిట్గా నిలిచి భారీ లాభాలు తెచ్చి పెట్టిన ఏకైక మూవీ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ ఏడాది అసలైన బాక్స్ ఆఫీస్ విన్నర్‌గా వెంకటేష్ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే.. తాజాగా బాలకృష్ణ అఖండ 2 సినిమా రిలీజ్ అయిన ఇది ఫుల్ రన్‌లో ఎలాంటి కలెక్షన్లు కొల్లగొడుతుందో తెలియాల్సి ఉంది. అంతేకాదు.. డిసెంబర్ ఆఖరి వారంలో అరడజనుకు పైగా సినిమాలు తెర‌కెక్కనున్నాయి. అయితే ఇవన్నీ మీడియం రేంజ్ సినిమాలు కావడంతో.. సంక్రాంతికి వస్తున్నాం రికార్డును టచ్ చేసే అవకాశం లేదు.

Sankranthiki Vasthunnam sets all-time record among Telugu regional movies