బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. సుమారు మూడు నెలల క్రితం ప్రారంభమైన రియాలిటీ షో.. ఈ వారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఊహించని ట్విస్టులతో.. బుల్లితెర ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని అందించిన ఈ సీజన్‌లో.. గ్రాండ్ ఫినాలే విన్నర్ రేసులో కళ్యాణ్ పడాల, తనూజ ,ఇమ్మానియేల్, డిమాన్ పవన్, సంజనా గల్రాని పోటీ పడుతున్నారు. పేరుకు ఫైనలిస్టులు ఐదుగురు అయినా.. టైటిల్ రేసులో మాత్రం ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
వాళ్లలో పవన్ కళ్యాణ్ పడాల ఒకరు కాగా.. మరొకరు తనుజ పుట్టస్వామి. ఈ ఇద్దరిలో ఎవరు బిగ్ బాస్ కప్పు కొట్టనున్నారని ఆసక్తి అభిమానులందరిలోనూ మొదలైంది. ఇక.. ఇప్పటికే తాజాగా గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లైన్ కూడా మొదలైపోయింది. బిగ్ బాస్ తెలుగు 9 అఫీషియల్ పోటీటి ప్లాట్ఫామ్.. జియో హాట్‌స్టార్ ద్వారా భారీ ఓటింగ్ జరుగుతుంది. సాధారణంగా తనుజ నామినేషన్స్‌లో ఉన్నప్పుడు.. ఆమె మొదటి స్థానంలో ఉంటుంది. కళ్యాణ్ ఉన్నా కూడా చాలా వరకు తనుజదే లీడ్. కానీ.. గ్రాండ్ ఫినాలే మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యిందట. ఏ ఆన్లైన్ పోల్ చూసిన పవన్ కళ్యాణ్ పడాల టాప్ ఓటింగ్ లో దూసుకెళ్తున్నాడు.

ఓవరాల్ గా ఫస్టే ఓటింగ్ కళ్యాణ్ పడాలకి. ఏకంగా 45% పైగా ఓట్లు దక్కడం విశేషం. అలాగే తనుజకు 27% ఓట్ల పోల్ అయ్యాయి. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం టాప్ 1,2 పోసిషన్లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య ఓటింగ్ విషయంలోనూ భారీ వ్యత్యాసం నెలకొంది. అంటే చాలామంది కళ్యాణ్ పడాలకు ఓటు వేస్తున్నారు. ఇక వీళ్లిద్దరికీ మరింత దూరంగా ఇమ్మానియేల్ 12 శాతం ఓట్లతో 3వ స్థానంలో నిలిచాడు. 9 శాతం 4వ ప్లేస్ లో, సంజన 7% ఓటింగ్ తో చివరి పొజిషన్‌లో ఉన్నారు. ఈ ఓటింగ్కు ఇంకా చాలా టైం మిగిలింది కనుక ఎలాంటి మార్పులు సంభవిస్తాయో.. ఈ విన్నర్ రేస్‌లో చివరికి కప్ కొట్టేది ఎవరు చూడాలి. ఒకవేళ ఇదే ఓటింగ్ మాత్రం కంటిన్యూ అయితే బిగ్ బాస్ విన్నర్ గా పవన్ కళ్యాణ్ పడాల కప్పు అందుకోవడం ఖాయం.

