బోయపాటి – బాలయ్య కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ కూడా ముగించుకొని ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. సినిమా కచ్చితంగా ధియేటర్లలో చూసేలా.. ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్న టాప్ 10 కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం.
1.నందమూరి బాలకృష్ణ – బోయపాటి శీను హ్యాట్రిక్ కాంబినేషన్:
ఈ కాంబినేషన్ అంటేనే అభిమానులతో పాటు.. ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు నెలకొంటాయి. ఇప్పటికే.. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు థియేటర్ల దగ్గర సెన్సేషన్ సృష్టించాయి. భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఒకదాన్ని మించి మరొకటి అనే రేంజ్‌లో సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే.. అఖండను కచ్చితంగా థియేటర్‌లో ఎంజాయ్ చేయాలని చాలామంది ఫీలవుతున్నారు.
2.అఖండలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్:
2021లో ప్రతికూల పరిస్థితుల్లో.. అఖండ రిలీజ్ అయింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ భయపడుతున్న టైంలో పెద్ద సినిమాలకు టికెట్ హైక్.. అదనపు షోలు లాంటి వాటికి ప్రభుత్వం అనుమతులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో అఖండ రిలీజ్ అయింది. అతి తక్కువ టికెట్ రేట్లతోను కంటెంట్ ఆడియన్స్‌లో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే.. కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేసి బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అలాంటి సినిమా సీక్వెల్.. థియేటర్లలో చూడడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు.
3. అఘోర పాత్రలో బాలయ్య రుద్రతాండవం
అఖండ సినిమాలో అఘోర పాత్ర ఏ రేంజ్‌లో హైలైట్ అయిందో తెలిసిండే. పాత్ర ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు మాస్ ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించింది. ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో అంతకుమించి అఘోర పాత్ర పవర్ ఫుల్‌గా ఉండనుందని.. థియేటర్లలో సనాతన ధర్మాన్ని ఆవిష్కరిస్తూ.. బాలయ్య రుద్రతాండవం చేశాడంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది కూడా సినిమా థియేటర్లో చూడడానికి స్పెషల్ అంశంగా మారింది.
4.కూతురి సెంటిమెంట్:
ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్‌లో అఘోర పాత్ర.. తమ్ముడు కూతురికి ఎప్పుడు ఆపద వచ్చిన వస్తానంటూ ప్రామిస్ చేస్తాడు. ఇక సెకండ్ పార్ట్ లో ఏ ఆపద కలిగింది.. ఎలా దాన్ని ఎలివేట్ చేశారు అనే అంశం కూడా స్పెషల్ ఎట్రాక్షన్.
5.బాలయ్య కూతురుగా హర్షాలి మల్హోత్రా నటించడం:
2017లో బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్‌గా గెలిచిన భజరంగి బాయిజాన్‌లో మున్ని పాత్రలో హర్షలి మల్హోత్రా నటించి విమర్శలతో సైతం ప్రశంసలు అందుకుంది. ఇక.. దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత అమ్మడు మళ్ళీ.. వెండి తెరపై కనిపించనుంది. ఈ క్రమంలోనే.. స్క్రీన్ పై ఆమెను ప్రజెన్స్ చేసిన తీరు.. ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది. అలా.. హర్షాలి కూడా సినిమా ధియేటర్లలో చూడడానికి ఓ అంశం గా మారింది.

ఆది పినిశెట్టి పవర్ ఫుల్ రోల్:
యంగ్ నటుడు ఆది పిన్నిశెట్టి ఇప్పటికే సరైనోడు లాంటి సినిమాతో బోయపాటి డైరెక్షన్‌లో విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే.. అఖండ 2లో బాలయ్య లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీకి పోటీగా.. ఆది పిన్నిశెట్టి నటన ఎలా ఉండబోతుంది.. ఆయన పాత్ర ఎలా డిజైన్ చేశాడో.. తెలుసుకోవాలని ఆసక్తి.. ఓ అంశంగా మారింది.

7. సంయుక్త మీనన్:
టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ సంయుక్త.. ఏదైనా కంటెంట్ ఉందనిపిస్తేనే సినిమాలో నటిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పాత్ర అఖండ 2లో ఎలా ఉండబోతుందని ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది.
8.రామ్ – లక్ష్మణ్ ఫైట్ కొరియోగ్రఫీ:
బోయపాటి సినిమాలో రామ్ – లక్ష్మణ్ ఫైట్ కొరియోగ్రఫీ, ప్రెజంటేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ క్రమంలోనే బాలయ్య – బోయపాటి కాంబోలో.. రామ్ – లక్ష్మణ్ ఫైట్స్ అనగానే ఆడియన్స్ లో అంచనాలు ఆకాశానికి అంటాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలో ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయట. ఇది కూడా సినిమా ధియేటర్లలో చూడడానికి ఒక పాయింట్ అయింది.
![]()
9. థమన్ మ్యూజిక్:
అఖండ 2 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ వ్యవహరిస్తుండటంతో అభిమానులు సినిమాపై భారీ హోప్స్ పెట్టేసుకున్నారు. అఖండకు థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ప్లస్ పాయింట్ గా మారిందో తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి కూడా స్పీకర్లు బద్దలైపోతాయని అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.
10. అఖండ 2 సనాతన ధర్మం, శివతత్వం :
ఇప్పటికే అఖండ 2 నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లతో శివతత్వాని హైలైట్ చేస్తూ.. సనాతన ధర్మాన్ని ఆవిష్కరించబోతున్నామని క్లియర్గా చూపించారు. అలాగే.. ప్రమోషన్స్‌లోనూ ఇదే విషయాన్ని హైలెట్ చేశారు. ఈ క్రమంలోనే.. బాలయ్య రుద్ర తాండవం థియేటర్లలో ఎలా ఉండబోతుందో చూడాలని ఆసక్తి అందరిలోనూ మొదలయింది. అంతేకాదు.. సినిమా షూట్‌ను మహా కుంభమేళలో కూడా చేశారు. ఈ క్రమంలోనే ఈ అంశాలన్నీ వర్కౌట్ అయితే సినిమా సౌత్ తో పాటు నార్త్‌లో కూడా కలెక్షన్ వర్షం కురిపించడం ఖాయం.





