టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తీసే ఒక్కో సినిమాకు అంతకంతకు క్రియేటివిటీ పెంచుకుంటూ పోతున్నాడు జక్కన. ఇప్పటికే హాలీవుడ్ సైతం ఆయన విజన్, స్క్రీన్ ప్లేకు ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే.. వారణాసి సినిమాతో హాలీవుడ్ రికార్డులపై కన్నేసాడు జక్కన్న. మహేష్ బాబు ని ఈ మూవీలో ఓ సూపర్ హీరోగా చూపించనున్నాడు. తన సినీ కెరీర్‌లో ఎప్పుడు చేయని ఓ సరికొత్త ప్రయోగాన్ని చేయబోతున్నాడు.
![]()
వారణాసి సినిమాలో మహేష్ బాబు రాముడి క్యారెక్టర్ లో కనిపించనున్నాడని.. జక్కన్న స్వయంగా వివరించాడు. అయితే.. ఇందులో మహేష్ కేవలం రెండు పాత్రల్లో సరిపెట్టుకోడని.. ఏకంగా 5 డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే.. సినిమా కోసం అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీ కూడా ఉపయోగించడున్నాడట. ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాలకు కూడా ఉపయోగించని రేంజ్ లో ఈ సినిమా కోసం టెక్నాలజీని అప్లై చేస్తున్నారని.. అవతార్ రెండు భాగాలకు కూడా ఈ కొత్త టెక్నాలజీని వాడలేదని తెలుస్తుంది.

సినిమా చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ స్వయంగా ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీల్ కాలిగేలా.. క్వాలిటీ పిక్చరైజేషన్, గ్రాఫిక్స్, క్వాలిటీ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది మే లోపు ఈ సినిమా టాకీ పాట మొత్తం కంప్లీట్ అవుతుందని.. తర్వాత సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ కూడా పూర్తిచేసి.. రిలీజ్ కోసం సన్నాహాలు మొదలు పెడతారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక రాబోయే రోజులు ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేస్తారో ఏ రేంజ్ హైప్ తెస్తారో చూడాలి.

