టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో కోట్లాది మంది అభిమానిని సంపాదించుకున్న చరణ్.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మగధీర లాంటి ఇండస్ట్రియల్ హిట్ తర్వాత చరణ్ కి ఒక్కసారైనా సక్సెస్ కూడా అందలేదు. ఆరెంజ్ సినిమా ఇప్పుడు ఆడియన్స్‌ను మెప్పిస్తున్న అప్పట్లో మాత్రం బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. నిర్మాత నాగబాబు ఈ సినిమాతో అప్పుల్లో కూరుకుపోయాడు. తర్వాత వచ్చిన రచ్చ, నాయక్ సినిమాలు యావరేజ్.. చరణ్ కెరీర్ కు ఇవి పెద్దగా హెల్ప్ కాలేదు. దీనికి తోడు ఎప్పుడు చూసినా ఒకే ఎక్స్ప్రెషన్స్ తో రెగ్యులర్ మాస్ సినిమాలు చేస్తూ కెరియర్ లాగించేస్తున్నాడు అంటూ ట్రోల్స్ కూడా వినిపించాయి.
దీంతో.. చరణ్ తర్వాత నటించిన తుఫాన్, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ లాంటి సినిమాలు సైతం డిజాస్టర్లుగా నిలిచాయి. అలా చరణ్ కెరియర్ అటు ఇటుగా ఉన్న టైంలో హిట్ చాలా అవసరం అని అంత భావించారు. అలాంటి టైంలో సురేందర్ రెడ్డి చరణ్‌తో సినిమా చేసేందుకు కథలు సిద్ధం చేశారు. అదే తమిళ్లో హిట్ అయిన తనివర్వన్ రీమేక్. తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా ఈ సినిమా కథను మార్చి సురేందర్ రెడ్డి చరణ్ కోసం డిజైన్ చేశాడు. అలా వచ్చిందే థృవ మూవీ. ఈ సినిమా కోసం చరణ్ తన ఇమేజ్ను పక్కనపెట్టి మరీ నటించాడు. 2016 డిసెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమాలో ఆ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందని చిరంజీవి అరవింద్‌కు చెప్పాడట.
కానీ.. అరవింద్ మాత్రం సోలో రిలీజ్ అయితేనే బాగుంటుందని.. డిసెంబర్ 9న సినిమాను రిలీజ్ చేశారు. అది కూడా డిమోనెటైజేషన్ టైం.. పాత నోట్లు రద్దు కావడంతో లిక్విడ్ క్యాష్ కోసం జనాలు బ్యాంకులకు ఎగబడుతున్న రోజులు అలాంటి టైం లో ధృవ సినిమా రిలీజ్ కావడంతో వసూళ్లు కష్టం అయ్యాయి. అయినప్పటికీ సినిమాలో చరణ్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. ఓరిజినల్ కంటే సినిమా బాగుందని.. సురేందర్ రెడ్డి చరణ్ పై ప్రశంసలు కురిసాయి. ఇక నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్న ఈ రాంగ్ స్టెప్ కారణంగా సినిమా రిజల్ట్ మారిపోయింది. చిరు చెప్పినట్లు దసరా కానుకగా సినిమా రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఉండేది అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


