బాలయ్య – బోయపాటి కాంబో.. అఖండపై థమన్ సెన్సేషనల్ హింట్.. ఫ్లోలో రివీల్..!

సింహా,లెజెండ్, అఖండ ల‌తో హ్యాట్రిక్ త‌ర్వాత‌.. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌ అఖండ 2 తాండవం. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్గా ఈ మూవీ తెర‌కెక్కుతున్న క్రమంలో.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాకు మరో హైలెట్ ఎస్.ఎస్. థ‌మన్ మ్యూజిక్ అందించడం. రూ.200 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన సినిమా.. మరికొద్ది గంటలో గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పటికే.. సినిమా ప్రీమియర్ షోస్ కు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఈ క్రమంలోనే.. థ‌మన్.. తన సోషల్ మీడియా వేదికగా అఖండ యూనివర్సిటీ గురించి చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

అఖండ 2 నే కాదు.. ఏకంగా ఐదు భాగాలు రానున్నాయని టాక్ ఇండస్ట్రీ వర్కల్లో వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. థ‌మన్.. బాలయ్య సినిమాకు ఇచ్చే మ్యూజిక్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా థ‌మన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అఖండ సిరీస్ దాదాపు 5 పార్ట్‌లుగా వచ్చే అవకాశం ఉందని.. సెన్సేషనల్ కామెంట్స్ చేసి ఫ్యాన్స్‌లో హైప్‌ డబ్బల్‌ చేశాడు.

Akhanda 3 Hint in Akhanda 2 Climax? Big Reveal Drops

అయితే.. తర్వాత థ‌మ‌న్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో.. త‌న కామెంట్స్‌కు డైరెక్ట్ హింట్ ఇచ్చినట్లే ఉంది. ఇంతకీ ఆ పిక్ ఏంటంటే.. థ‌మ‌న్‌, బోయపాటి శ్రీను తో రిలాక్స్ మోడ్లో దిగిన ఫోటో.. శివతాండవాన్ని థియేటర్లో చూడండి అంటూ ట్యాగ్ను జోడించి పోస్ట్ చేశాడు. అయితే.. ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ పై పెద్ద అక్షరాలతో జై అఖండ అని రాసి ఉంది. దీంతో పార్ట్ 3 టైటిల్ అదేనంటూ.. థ‌మన్ లీక్ చేసేసాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. థ‌మన్ చేసిన ఈ పోస్ట్ తో అఖండ యూనివర్స్ నిజంగానే కొనసాగుతుందని విషయం క్లారిటీ వచ్చేసింది.