స్టార్ బ్యూటీ సమంత – దర్శక,నిర్మాత రాజ్ నిడమోరు పెళ్లి తర్వాత ఎక్కడ చూసినా భుత శుద్ధి వివాహం గురించి టాక్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ భూత శుద్ధి అంటే పంచభూతాలైన భూమి,నీరు, అగ్ని,వాయువు, ఆకాశాలను.. శుద్ధి చేయడమట. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక క్రియ.. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి.. వాళ్ళిద్దరి మధ్య మానసిక – శారీరక అనుబంధాన్ని బలపరచడానికి తోడ్పడుతుందని నమ్ముతారు. ఇక.. ఈ బూత శుద్ధి వివాహం అనేది ఒక కులం, మతం, సంప్రదాయానికి సంబంధించింది కాదు.

మనుషులకు సంబంధించినది. లింగ బైరవి దేవి భక్తులు.. ఈషా ఫౌండేషన్ అనుచరులు ఈ విధానాన్ని ఎక్కువగా నమ్ముతారు. అనుసరిస్తారు. మునపటి జన్మల కర్మ ఫలాలు శుద్ధి జరిగి.. ఆత్మ ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళు భావిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత, రాజ్ కూడా తమ లైఫ్ భూత్ శుద్ధి వివాహంతో మొదలు పెట్టారు. కేవలం వీళ్లే కాదు.. ఇప్పటివరకు ఈ పద్ధతిలో మరి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వివాహం చేసుకున్నారంటూ టాక్. బాలీవుడ్ బుల్లితెరకు చెందిన వరుణ్ జైన్, జియో మాణిక్ కూడా ఇదే భుత శుద్ధి విధానంతో ఒకటయ్యారు. అంతేకాదు.. టాలీవుడ్‌కు చెందిన యువ హీరో కూడా ఇదే పద్ధతిలో వివాహం చేసుకున్నట్లు న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. అంకిత్ కొయ్యి. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో రావు రమేష్ కొడుకుగా మెప్పించిన అంకిత్.. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్‌లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత.. మెల్లగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే.. ఇక్కడ మరో షాకింగ్ మ్యాటర్.. అంకిత్ కొయ్యకు కూడా ఇది రెండో వివామేనట. ఇండస్ట్రీలో ఇదే టాక్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు హైలైట్ గా మారడంతో.. భూతశుద్ధి అనే ఆధ్యాత్మిక వివాహ పద్ధతి జనాల్లోనూ ఆసక్తిని కలిగిస్తుంది. శరీరం, మనసు, ఆత్మలను శుద్ధి చేయడం.. ప్రశాంతంగా వివాహం చేసుకోవడం అనేది శుభప్రదంగా అంతా భావిస్తారు. ఈ క్రమంలోనే భూతశుద్ధి వివాహం చేసుకోవడానికి సెలబ్రిటీస్ సైతం ఆసక్తి చూపుతున్నారట.

