బాలయ్యకు చంద్రబాబు బిగ్ న్యూస్.. అఖండ 2కు మంచి బూస్టప్ ఇది..!

సింహా, లెజెండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ సక్సెస్ల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా సినిమా రిలీజ్ కానున్న‌ క్రమంలోనే.. తాజాగా ఏపీ గవర్నమెంట్ అఖండ 2 టీంకు గుడ్ న్యూస్ చెప్పారు. అఖండ 2 సినిమా రిలీజ్‌కు మారి కొద్దిరోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో.. నిర్మాతలు చేసిన విజ్ఞ‌ప్తికి ఏపీ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

AP Government Approves Special Premieres and Ticket Hikes for 'Akhanda 2' |  IndiaGlitz

ఈ ఈ మేరకు కొద్ది గంటల క్రితం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెటింట వైరల్ గా మారుతుంది. భారీ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమా.. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని కోరుతూ నిర్మాతలు.. ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోగా.. దానికి ఏపీ సర్కార్ అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4 రాత్రి 10:00 గంట‌ల‌ నుంచి బెనిఫిట్ షోస్‌ వేసుకోవచ్చని.. ఇక ఈ షో టికెట్ రూ.600గా ఫిక్స్ చేసింది. అలాగే.. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి.. పది రోజులపాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100గా టికెట్ రేట్‌ను పెంచుకునేలా అనుమతినిచ్చింది.

Akhanda 2 Gets AP Green Signal for Premieres

బాలయ్య‌ నటించిన అఖండ సినిమా సూపర్ హిట్ కావడంతో.. సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని.. శివతాండవమే అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఇప్పటికే మేకర్స్ సనాతన ధర్మాన్ని, శివతాత్వాన్ని ఆవిష్కరిస్తూ.. పవర్ఫుల్ మాస్, డివోషనల్ టచ్ తో ఆడియన్స్ అంచనాలను అందుకుంటుందని వివరించిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కూడా ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ త‌క్కించుకుంటుంది. ఇక.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.