స్టార్ బ్యూటీ సమంత.. తాజాగా దర్శక్ నిర్మాత.. రాజ్ నిడమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వీళ్ల పెళ్లి ఫొటోస్ మారుతున్నాయి. ఈ క్రమంలోనే సామ్, రాజ్ మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత అనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక.. సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సమంత. 1987 ఏప్రిల్ 28న జన్మించారు. ఇక ప్రస్తుతం సమంత వయసు 38 ఏళ్లు.
అలాగే డైరెక్టర్ రాజ్ 1975 ఆగస్టు నెల ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో జన్మించారు. 2025 నాటికి ఈయన వయసు 46 ఏళ్ళు. అలా దాదాపు.. సమంతా రాజ్ నిడమూరు మధ్యన 8 ఏళ్ల ఏజ్‌కు గ్యాప్ ఉందని టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. వీళ్ళిద్దరి బాండ్ ఎలా మొదలైంది అనే టాక్ కూడా వైరల్ అవుతుంది. అమెజాన్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2.. షో టైం లో డైరెక్టర్ రాజ్ నిడమోరుతో.. హీరోయిన్గా సమంత కలిసి పని చేసింది. ఈ సినిమా షో టైం లోనే ఒకరితో ఒకరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది.

అప్పటికి సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఇక.. ఈ సిరేస్ తర్వాత ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలకు పని చేశారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడంతో.. తాజాగా దాన్ని వివాహ బంధంగా మలుచుకున్నారు. ఇక వీళ్లిద్దరు కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు తాజాగా అఫీషియల్ గా వెల్లడించారు. ప్రస్తుతం వీళ్లిద్దరు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి,


