బాహుబలి, పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసిన చిన్న సినిమా రూ. 50 లక్షలతో తీస్తే బ్లాస్టింగ్ కలెక్షన్స్..!

ఇండస్ట్రీ ఏదైనా సరే.. సరైన కంటెంట్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెంట్ ఉంటే చాలు అందులో నటించే స్టార్స్, బడ్జెట్ తో సంబంధం లేకుండా చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు. ఇది ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో రోజువైంది. అత్తి చిన్న సినిమాగా వ‌చ్చి.. కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా ప్ర‌జెంట్‌.. టాలీవుడ్‌లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఊహించని రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పెద్ద వ్యక్తి కాకపోయినా.. థియేటర్లో మాత్రం సినిమా సత్తా చాటుకుంటుంది. సేమ్ ఇదే తరహాలో మరో సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. కేవలం రూ.50 లక్షలతో తెరకెక్కిన ఈ చిన్న సినిమా.. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

Laalo Movie Cast: ગુજરાતી ફિલ્મ "લાલો - કૃષ્ણ સદા સહાયતે" સાથે જોડાયેલા  દરેક વ્યક્તિને જાણો

దాదాపు 50 రోజులుగా థియేటర్లో కంటిన్యూగా ప్రదర్శితమైన ఆ మూవీ మరేదో కాదు.. లాలో. గుజరాతి భాషలో వ‌చ్చిన‌ ఈ సినిమాకు.. అంకిత్ సుఖియా దర్శకుడుగా వ్యవహరించారు. ఇక రీవారచ్, శ్రహద్ గోస్వామి, తరుణ్ జోషి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మెరుశారు. అక్టోబర్ 10న‌ అతి చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. దీంతో.. రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. రిలీజ్ అయిన మూడో వారం నుంచి ఈ సినిమా పేరు మరింతగా వైరల్ అయింది. ఇక.. ఇప్పుడు ఈ సినిమాకు రికార్డు లెవెల్ లో వసూళ్లు దక్కుతున్నాయి.

Laalo: Krishna Sada Sahaayate' Becomes Top-Grossing Gujarati Film in UK &  Ireland | Filme Shilmy

ఇక సినిమా కథ‌ మొత్తం లాలో( కరణ్ జోషి ) చుట్టు తిరుగుతుంది. అహంకారం, తప్పుల కారణంగా కష్టాల్లో కూరుకుపోతాడు లాలో. ఇక లాలో భార్య తులసి ( రివారచ్ ) తో త‌ను తరచూ గొడవ పడుతూ ఉంటాడు. ఇక అనుకోని కారణాలతో అనూహ్యంగా లాలో ఓ ఇంట్లో చిక్కుకుపోయి ముప్ప‌తిప్పలు ప‌డ‌తాడు. ఆ టైంలోనే ఒంటరితనంతో.. గతంలో తన తన భార్యతో ప్రవర్తించిన తీరును గుర్తుచేసుకొని తనలో తానే కుమ్ములిపోతాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణుడు (శ్రహద్ గోస్వామి) రూపంలో దేవుడే లాలోకి ఆశ దీపంగా కనిపిస్తాడు. ఇక తర్వాత ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు.. తన అహంకారం, తప్పులను తెలుసుకుని ఎలా వాటిని సరిదిద్దుకున్నాడు అనేది స్టోరీ.