టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబోకు ఆడియన్స్‌లో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే మాస్ ఫిస్ట్ కాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. అలా.. ఇప్పటికే వీళ్లిద్దరూ కాంబోలో సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక.. ప్రస్తుతం అఖండ లాంటి సెన్సేషనల్ సూపర్ హిట్‌కు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం రూపొందుతుంది. ఈ సినిమాతోను కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని.. ఆడియన్స్ బ్రహ్మరథం పడతారంటూ టీం స్ట్రాంగ్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక.. ఈ సినిమా వచ్చేనెల 5వ తారీకున గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఓవర్సీస్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. కాగా.. నార్త్‌లో ఈ సినిమాకు భారీ షాక్ తగులుతుంది. కనీసం లెవెల్ బుకింగ్స్ కూడా నమోదు కావడం లేదు. సినిమా రిలీజ్‌కి సరిగ్గా 11 రోజుల టైం ఉంది. ఈ 11 రోజుల్లో సినిమా మరో లక్ష డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక సీక్వెల్ సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాకు ఫ్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది.
ఈ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలతో సమానంగా అఖండ 2 బిజినెస్ జరుపుకుంది. రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజి రూ.23 కోట్ల బిజినెస్ మాత్రమే జరుపుకుంటే.. అఖండ ఏకంగా రూ.26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం గమనార్హం. ఇక.. అన్నిచోట్ల ఇదే తరహాలో బిజినెస్ జరుపుకొని.. ఈ జనరేషన్ హీరోల సినిమాల కంటే గ్రేట్ నెంబర్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా బ్రేక్ ఈవెన్‌కు టచ్ చేయాలంటే.. కచ్చితంగా రూ.115 కోట్ల షేర్ వసూళ్లు.. రూ.230 కోట్ల గ్రాస్ కొట్టాల్సి ఉంది. మరి ప్రస్తుతం ఉన్న ప్రమోషనల్ కంటెంట్‌కి ఈ రేంజ్ గ్రాస్ రావడం అంటే బాలయ్యకు పెద్ద పరీక్ష అనే చెప్పాలి. మరి.. సినిమా అవుట్ ఫుట్ బట్టి ఆడియన్స్ రిజల్ట్ చూపిస్తారు.



