టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మెరవనున్నారు. ఇక.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. మూవీ టీం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. తాజాగా.. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక.. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్ నెటింట పెద్ద దుమారంగా మారాయి. మారుతి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. డెఫినెట్గా చెప్తున్నా.. నేను వాళ్ళకులా కాలర్ ఎగరేసుకుంటారని మాత్రం చెప్పను.. అవన్నీ ఈ కటౌట్‌కు చాలా చిన్నవి.. మీ మనసులో నుంచి ప్రభాస్ గారు ఎలా వచ్చారు నాకు తెలుసు.

ప్రస్తుతం నేను అదే యూనివర్సిటీలో చదువుతున్న.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పని చేశా.. ఆ ఫోటో ఉంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అయిపోతారు అంటూ కామెంట్స్ చేశాడు. అయితే మారుతి చేసిన ఈ కామెంట్స్ లో వారిలా కాలర్ ఎగరేయను అని డైలాగ్ సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారి తీసింది. ఇది కావాలనే ఎన్టీఆర్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అంటూ తారక్ ఫ్యాన్స్ మారుతిపై ఫైర్ అయ్యారు. అయితే మరోపక్క ప్రభాస్ అభిమానులు మారుతికి సపోర్ట్ చేస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మారుతి.. ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు.
ఈ ఈవెంట్లో చేసిన కామెంట్స్ గురించి పర్సనల్ క్లారిటీ ఇవ్వాలనిపించింది.. ముందుగా ప్రతి ఫ్యాన్కు నేను హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్న. ఎవరిని బాధ పెట్టాలని.. ఆ గౌరవించాలని నా ఉద్దేశమేమి కాదు. కొన్నిసార్లు ఫ్లోలో మనం అర్థం చేసుకునే దానికి డిఫరెంట్ గా బయటకు వస్తాయి. నా కామెంట్స్ తప్పుగా వెళ్ళినందుకు నేనే ఫీల్ అవుతున్న. ఎన్టీఆర్ పట్ల, వారి అభిమానుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. సినిమా పట్ల.. మీ హీరో పట్ల మీరు చూపే ప్రేమకు నేను నిజంగా విలువ ఇస్తున్నా. మీరు పరిస్థితి.. దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మారుతి ఇచ్చిన ఈ క్లారిటీతో ఇప్పటివరకు కొనసాగుతున్న ఫ్యాన్ వర్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.

