తెలుగు టాలెంటెడ్ హీరో నిఖిల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న మరో హిస్టారికల్ ఎపిక్ మూవీ స్వయంభు. త్వరలోనే ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్స్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే.. చాలా కాలం నుంచి సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా.. మూవీ రిలీజ్ డేట్‌తో పాటు.. స్పెషల్ వీడియోను కూడా నిఖిల్ స్వయంగా షేర్ చేస్తూ.. ఆడియన్స్‌లో హైప్ పెంచేసాడు. ఈ మూవీ వచ్చే ఏడది ఫిబ్రవరి 13న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుందని వెల్లడించారు.

ఇక.. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. సంయుక్త మీనన్ నభానటాషా హీరోయిన్‌లుగా మెరవనున్నారు. ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్‌లో పవర్ఫుల్ వారియర్‌గా నిఖిల్ కనిపించనున్నాడు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాల ఫేమ్ సేంథెల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక రవి బసృర్ మ్యూజిక్ మరో హైలెట్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక.. నిఖిల్ తాజాగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది.
ఈ వీడియోని బట్టి సాంప్రదాయాలు, చరిత్ర చూడని ఎందరో రాజులు వారి కథల్లో ఓ గొప్ప యోధుడి కథ స్వయంభు అని అర్థమవుతుంది. అంతేకాదు.. ఈ వీడియోలో సినిమా షూట్ కంప్లీట్ అయిపోయిందని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు టీం. సినిమా షూట్ గురించి నికిల్ మాట్లాడుతు.. నా బెస్ట్ ఫ్రెండ్ మారుతి అని పరిచయం చేసాడు. అదే ఆయన గుర్రం. ప్రతిరోజు సెర్చ్ లో వెళ్లినప్పుడల్లా వెయ్యిఏళ్లు వెనక్కి వెళ్లిన ఎక్స్పీరియన్స్ నాకు కలుగుతుందని.. దీనికి ప్రొడక్షన్ డిజైనర్ ఎంతో కష్టపడి ప్రాణం పోసారంటూ చెప్పుకొచ్చాడు. ఇక సెంథిల్ సర్ ప్రపంచాన్ని అద్భుతంగా చూపించాడని.. మాయాజాలానికి జయగర్జన రవి భాస్కర్ మ్యూజిక్ అని.. ఇలా ప్రతి ఒక్కరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తం 170 రోజుల్లో సినిమా షూట్ కంప్లీట్ చేస్తామంటూ ఈ స్పెషల్ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. మీరు ఓ లుక్ వేసేయండి.

