స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

టాలీవుడ్ యంగ్ అండ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. త‌ను తెర‌కెక్కించిన సినిమాల‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న త‌రుణ్‌.. మొద‌ట్లో షార్ట్ ఫిలింతో కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక.. తన మొదటి సినిమా పెళ్లిచూపులతోనే మంచి సక్సెస్ అందుకున్న తర్వాత.. ఈ నగరానికి ఏమైంది, క్రీడాకోలా లాంటి సినిమాలను తెర‌కెక్కించి సక్సెస్ అందుకున్నాడు. ఇక.. ఈ సినిమాల తర్వాత డైరెక్టర్ కంటే న‌టుడిగానే ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు తరుణ్. అయితే.. గత కొంతకాలంగా త‌రుణ్‌ సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే వైర‌ల్ అవుతున్నాడు తరుణ్.

Tharun Bhaskar and Eesha Rebba Join Forces in New Film

క్రేజీ హీరోయిన్ ఈషా రెబ్బాతో భాస్కర్ ప్రేమలో ఉన్నాడంటూ.. వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు వైర‌ల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా తరుణ్ భాస్కర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. రాజు వెడ్స్ రాంబాబు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా హాజరైన తరుణ్ భాస్కర్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూ ఇప్పటివరకు మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ ఏంటి అని అడగగా.. బెస్ట్ లవ్ స్టోరీ నాదేనండి.. ప్రస్తుతం నేను లవ్ ను ఎంజాయ్ చేస్తున్నా.. ఫ్యూచర్లో అదే ది బెస్ట్ లవ్ స్టోరీ అవుతుందేమో అంటూ కామెంట్స్ చేశాడు.

Is tharun bhaskar and eesha rebba dating each other..?? : r/TollywoodGossips

దానికి ఆ జ‌ర్న‌లిస్ట్‌ ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలుసు.. కానీ చెప్పను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే.. తరుణ్ భాస్కర్ ఈషాను లవ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేసాడని.. కచ్చితంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఓం శాంతి శాంతి.. మలయాళం జయ జయహే సినిమా రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ టైంలోనే వీళ్ళిద్దరి మధ్యన మంచి బాండ్‌ ఏర్పడిందని.. అది కాస్త ప్రేమగా మారింది అంటూ టాక్‌ నడుస్తుంది. ఇక.. ఇప్పటివరకు వీళ్ళ లవ్ వార్తలపై ఇద్దరూ ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వకున్నా.. తాజాగా తరుణ్ చేసిన ఈ కామెంట్స్ ఆడియన్స్‌లో మరింత ఎక్సైట్మెంట్‌ను పెంచేశాయి. ఇక తరుణ్ చెప్పిన ఆ అమ్మాయి ఈషానా తెలియాలంటే.. మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.