” వారణాసి ” ప్రమోషన్ మైండ్ బ్లోయింగ్ బడ్జెట్.. ఆ ఖర్చుతో ఓ మూవీ తీసేయొచ్చు..

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న వారణాసిపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌ చేశాడు జక్కన్న. సినిమాలో అడ్వెంచర్, ఫిక్షన్, మైథాలజీ అన్ని అంశాలను మిక్స్ చేసి టైం ట్రావెలింగ్‌తో ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా.. రామాయణానికి సంబంధించిన ఓ కీలక ఘట్టం సినిమాలో ఉండబోతుందంటూ అఫీషియల్ గా వెల్లడించాడు. ఈ క్రమంలోనే.. మహేష్ అభిమానుల్లో శ్రీరాముడి పాత్రలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందని ఆసక్తి మొదలైంది. అయితే.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేకుండా చాలా డీసెంట్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్ ఇమేజ్తో దూసుకుపోతున్న జక్కన్నను వివాదాల్లోకి నెట్టింది కూడా ఈ ఈవెంట్ అనే చెప్పాలి.

ఆయన వారణాసి టైటిల్ వివాదం, దేవుళ్ళపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్‌కు కారణమయ్యాయి. అంతేకాదు.. పలు హిందూ సంఘాలు రాజమౌళి పై పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ గురించి బాలీవుడ్ మీడియాలో టాక్ తెగ వైరల్ గా మారుతుంది. మొదట్లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌లో సినిమా రూపొందుతుందని టాక్ వినిపించినా.. ఇప్పుడు న్యూ టెక్నాలజీ.. భారీ సెట్ల నిర్మాణం.. గ్లోబల్ లొకేషన్స్ ను వాడుకుంటూ.. ఏకంగా రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. అతి పెద్ద స్కేల్ లో ఉండే కొన్ని ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్లను కూడా సినిమాలో చూడబోతున్నామ‌ని.. దీనికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలుస్తుంది.

ఇక.. ఈ బడ్జెట్ ఇంతలా పెరిగిపోవడానికి మరో కారణం గ్లోబల్ ట్రోటర్‌ ఈవెంట్ కూడా అని సినీవర్గాలు చెబుతున్నాయి. కేవలం ఈ ఒక్క ఈవెంట్ కోసమే రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేశారట మూవీ టీం. ఇంటర్నేషనల్ లెవెల్ లో అతిథులు, భారీ ఎల్ఈడి సెటప్ లు, ప్రజెంటేషన్ టెక్నాలజీ అన్నింటిని ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటేనే ప్రమోషన్స్ కు భారీగా ఖర్చు అయ్యింద‌ని అర్థమవుతుంది. ఇక సినిమా పూర్తయ్యే సమయానికి ఈ ప్రమోషన్ క్యాంప్‌ల‌కు దాదాపు రూ.200 కోట్లు వరకు వెచ్చించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఇదే టాక్ నెటింట‌ వైరల్‌గా మారడంతో రాజమౌళి.. మహేష్ ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోతున్నారు. ఈ బడ్జెట్‌తో ఓ బడా సినిమాని తీసేయొచ్చు కదా.. మరీ ఈ రేంజ్ ప్రమోషన్సా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.