ఐ బొమ్మ రవికి ఈ రేంజ్ సపోర్ట్ ఎందుకు.. ఇండస్ట్రీ అసలు ఆలోచించదా..?

సినీ ఇండస్ట్రీకి వేలాది కోట్ల నష్టం తెచ్చి పెట్టి.. జనాల‌ పర్సనల్ డేటాని దొంగలించి దేశభద్రతకు ముప్పుగా మారిన ఇమ్మ‌డి రవి తాజాగా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. సిపీ సజ్జనర్ అతని ఆటకట్టించాడు. ఏళ్ల తరబడి రవి సృష్టించిన పైరసీ రాజ్యాన్ని కుప్పకూల్చేశాడు. ఇప్పటికే ఐ బొమ్మ ప్రధాన సైట్లు క్లోజ్ చేసిన హైదరాబాద్ పోలీస్ పైరసీ కంటెంట్ ఉన్న మిగతా వెబ్సైట్లోపై కూడా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇబ్బంది రవిని కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. రవి నెట్వర్క్ ను గుర్తించి ఐ బొమ్మ పైరసీ ఎంక్వయిరీలో రవి చెప్పిన మాటలకు పోలీసులు ఆశ్చర్యపోయారు. హార్డ్ డిస్క్లో 21 వేల సినిమాలు ఉన్నాయంటే చెప్పుకొచ్చిన రవి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు ఇంకా ఇతర భాషల సినిమాలు కూడా పొందుపరిచామని చెప్పుకొచ్చాడు.

అయితే.. త‌న‌కు ఆదాయం పైరసీ సినిమాల వల్ల కాదు.. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ వల్ల వ‌స్తుంద‌ని.. ఈ యాప్‌ల‌తో కోట్ల ఆదాయం అందుకున్నట్లు ఎంక్వైరీలో తేలింది. దీంతో.. పోలీసులకు బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా వన్ ఎక్స్ బెట్టింగ్ యాప్ కి ఐ బొమ్మ ద్వారా ప్రమోషన్లు చేస్తూ కోట్లు సంపాదించాడట రవి. తన వెబ్సైట్ వీక్షణలో సినిమాల డౌన్లోడ్ చేసుకుంటున్నా వారి పర్సనల్ డేటా చోరీ చేసి.. డార్క్ వెబ్ లకు అమ్ముతున్నట్లు తేలింది. అయితే జనాల పర్సనల్ డేటాను తీసుకుని ఏం చేశాడు.. ఎవరికి అమ్మాడు.. వాళ్ళు ఆ డేటాతో ఏం చేస్తున్నారని దానిపై పోలీసులు కూపి లాగడం మొదలుపెట్టారు. ఇక ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా కొత్త సినిమాలు చూసేస్తున్నామని జనాలు భావిస్తున్నారు మీ డేటా మొత్తం చోరీ చేసి ప్రపంచాన్ని నడుతున్నాడని.. సినిమా ఇండస్ట్రీ కంటే ప్రజలే ఎక్కువగా నష్టపోతారని గుర్తుంచుకోమంటూ పోలీసులు వివరించారు. నిజానికి పైరసీ గాళ్లు అనునిత్యం పట్టుబడుతూనే ఉన్నారు. కొన్ని సైట్లు కూడా మూతపడ్డాయి.

కానీ.. కొన్నాళ్ల తర్వాత మరో పేరుతో సైట్ మొదలవుతుంది. జనాలు పైరసీ సినిమాలకు ఏగ‌బడినంత కాలం ఇలాగే ఉంటుంది. పైరసీని అరికట్టడం ఐ బొమ్మ రవిని పట్టుకున్నంత సులభం కాదు.. ఇప్పుడు రవిని పట్టుకుంటే ఇంకొకడు అతను కాకపోతే మరొకటి దేశం నుంచి దర్జాగా వేరేచోటకు వెళ్ళిపోయి కొత్త పైరేటెడ్ సినిమాలను అప్లోడ్ చేస్తాడు. ఇక దీనికి పరిష్కారం పైరసీక్ డేటాను అప్లోడ్ చేసే కేటుగాళ‌ని పట్టుకోవడం కాదు.. పైరసీ వైపు జనాన్ని చూడకుండా స్వచ్ఛందంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేలా మోటివేట్ చేయాలి. ఆకాశాన్ని అంటుతున్న సినిమా టికెట్లు క్యాంటీన్ ఫీజులతో సామాన్య ఆడియన్స్ థియేటర్లకు రావడమే వదిలేశారు. నిజానికి.. ఐ బొమ్మ రవిని పట్టుకోగానే.. సినీ పెద్దలంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

తమ కష్టం దోచుకున్న వాడిని అరెస్ట్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. కామన్ ఆడియన్స్ మాత్రం రవికి సపోర్ట్ చేస్తూ.. అతని అరెస్ట్ చేయడం సరైనది కాదని.. అతని రాబిన్ హుడ్ అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీనే రవి దోచుకున్నాడు. కానీ బెనిఫిట్ షోస్‌, టికెట్ రేట్స్ హైక్‌ పేరుతో ప్రేక్షకులను దోచుకుంటుంది ఎవరు.. అంటూ ప్రశ్నిస్తున్నారు. థియేటర్ వైపు రాకుండా రేట్లతో భయపెడుతూ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. టికెట్ రేట్లు అమాంతం పెంచేస్తూ ప్రేక్షకుడిని భయపెడుతున్నారు. టికెట్ రేట్లు పెంచేసి జనాల అభిమానాన్ని డ‌బ్బు రూపంలో దోచేసుకుంటున్నారు.

పైరసీ దోపిడైతే.. మరి ఇది దోపిడీ కాదా అంటూ ఫైర్ అవుతున్నారు. అట్టర్ ప్లాప్ సినిమాకు విపరీతమైన హైప్‌ వస్తుంది. దీంతో.. ఫస్ట్ రెండు రోజులు అడ్డదిడ్డంగా కలెక్షన్లు దోచేస్తున్నారు. అదంతా దోపిడీ అవ్వదా అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు టికెట్ రేట్లతో చిల్లు పెడుతుంటే.. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, క్యాంటీన్ వోపిడి మరింతగా ఉంది. ఓ ఫ్యామిలీ మొత్తం కలిసి వీకెండ్ కో సినిమాకి వెళ్లాలంటే 10,000 గంగలో పోయాల్సిందే. పోనీ అంత ఖర్చుపెట్టిన ఎక్స్పీరియన్స్ బాగుంటుందా అంటే అది అంతంత మాత్రమే. ఇండస్ట్రీ థియేటర్లో యాజమాన్యం కంటే ఓటిటికి కాస్త బెట‌ర్‌.. ఇంట్లో అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో దోపిడీ కూడా మొదలైపోయింది.

Top Indian Film Industry in 2025

సబ్స్క్రిప్షన్ లో ప్లాన్లు మొదట తక్కువగా చూపించి తర్వాత భారీగా పెంచేస్తూ.. ఏదో అడపాదప చిన్న సినిమాలను మాత్రమే ఓటిటిలో ఎక్స్క్యూటివ్గా వదులుతున్నారు. అంటే.. ఏదైనా మంచి సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా వస్తుందంటే.. కచ్చితంగా ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టి సినిమా చూడాల్సిందే. ఇలా ఓటీటీలు భారీగా దండుకుంటుంటే.. పైరసీలు ఎందుకు రావు.. జనాల వీక్నెస్ ను వాడుకొని ఫ్రీ సినిమాలతో బిజినెస్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా ఎడాపెడా అందరు సినీ ప్రేక్షకులను దోచుకుంటూ.. త‌మ కష్టాన్ని కొలబడుతున్నారని ఆరోపిస్తున్న సినీ పెద్దలు దోపిడీలు గురించి మాత్రం ఎవరూ మాట్లాడరా.. పైరసీని ఆశ్రయించేలా చేసేందుకు కొందరు బడా దర్శక, నిర్మాతలు హీరోలే కారణం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పైరసీ తప్పే.. ఐ బొమ్మ రవి లాంటి వారు చేసింది నేరమే.. అయినా సినీ పెద్దలు చేస్తున్నది ఏంటి.. దానికి పరిష్కారం టికెట్ రేట్లు, క్యాంటీన్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచడమే.. అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.