పవన్‌తో మూవీ.. ఆ పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన దిల్ రాజు..!

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరిని మించి పోయే రేంజ్‌లో అభిమానాన్ని సంపాదించుకుని దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్.. చివరిగా హరిహర వీరమల్లు, ఓజి సినిమాలతో ఆడియన్స్ పలకరించిన సంగతి తెలిసిందే. అయితే.. వీరమల్లు సినిమా ఆడియన్స్‌ను కాస్త నిరాశపరిచినా.. ఓజి సినిమా మాత్రం ప్రేక్షకులకు మంచి రిక్ ఇచ్చింది. మేకింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ డైరెక్టర్ సుజిత్ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలపాడు. అసలు ఈ సినిమా సక్సెస్ కు కీలక పాత్ర పోషించింది సుజిత్‌ అనడంలో సందేహం లేదు.

ఇక ప్రస్తుతం పవన్.. హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇప్పటికే షూట్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రీ ప్రొడక్షన్ పనులను టీం సరవేగంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే.. పవన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు కమిట్ అయ్యాడని టాక్ తెగ వైరల్‌గా మారుతుంది. అందులో దిల్ రాజు బ్యానర్‌పై ఓ సినిమా చేయడానికి ఇప్పటికే సైన్ కూడా చేసేసాడట. ఇంతకీ.. దిల్ రాజు, పవన్ కాంబోలో వస్తున్న సినిమాకు డైరెక్టర్ ఎవరనే ఆసక్తి అంతటా మొదలైపోయింది. కాగా.. ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరి కాంబో మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయిందని.. దిల్ రాజు ఓ పవర్ ఫుల్ టైటిల్‌ను రిజిస్ట్రేషన్ చేయించాడంటూ టాక్ వైరల్‌గా మారుతుంది.

ఇంతకీ ఆ మూవీ టైటిల్ మరేదో కాదు.. అర్జున. ఈ టైటిల్ పవన్ సినిమా కోసమే దిల్ రాజు రిజిస్టర్ చేయించాడట. నిజానికి దిల్ రాజు, పవన్ కాంబోలో గతంలో వకీల్ సాబ్ వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు.. అంతకుమించిపోయే పవర్ ఫుల్ టైటిల్ అర్జున..తో ఆడియన్స్ను పలకరించేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. నిజంగానే దిల్ రాజు.. పవన్ కోసమే ఈ టైటిల్‌ ఫిక్స్ చేశాడా.. లేతా.. మ‌రేదైన సినిమా కోసం రిజిస్టర్ చేయించాడా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా వీళ్ళ కాంబినేషన్లో మూవీ మాత్రం పక్కాగా ఉంటుందట‌. కానీ.. అది ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుంది.. ఆ సినిమాకు దర్శకులు ఎవరు.. అనేది మాత్రం క్లారిటీ రావాలి. తొందరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్‌గా ప్రకటించి.. సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లేలా దిల్ రాజు ప్రయత్నాలు మొదలు పెట్టాడని స‌మాచారం.