వారణాసి విలన్ ” కుంభ ” రోల్ వెనుక ఉన్న బిగ్ స్టోరీ ఇదే..?

తాజాగా మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ వారణాసి టైటిల్, గ్లింప్స్‌ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీనికంటే ముందే సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో, మహేష్ బాబు ఫస్ట్ లుక్, ప్రియాంక చోప్రా పోస్టర్ ఆడియన్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. ఇక.. అన్నింటికంటే ముందు రిలీజైన పృధ్వీరాజ్ సుకుమారిన్ కుంభ‌ లుక్ మాత్రం వైవిధ్యమైన రెస్పాన్స్ అందుకుంది. కొందరు పోస్టర్‌పై పాజిటివ్‌గా రెస్పాండ్ అయితే.. మరికొందరు నెగిటివ్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలా.. మిక్స్డ్‌ టాక్‌ను దక్కించుకున్న కుంభ.. మూవీ విలన్ రోల్ అని సమాచారం. సాధర‌ణ జ‌క్క‌న సినిమాలో విల‌న్‌కు స్పెషల్ హైలెట్స్ ఉంటాయి.

Why did Kumbhakarna ask Brahma for the boon of eternal sleep? - Quora

బాహుబలి, ఈగ‌, ఆర్ఆర్ఆర్‌ సినిమాలను విభిన్నంగా తెరకెక్కించిన.. విలన్ బ్యాక్ గ్రౌండ్ మరింత బలం ఉంటుంది. కానీ.. పృథ్వీరాజ్ లుక్ చూస్తే మాత్రం పెదగా ఇంపాక్ట్ లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంట్లో భాగంగానే.. సినిమా స్టోరీ ఇదేనంటూ రకరకాల థియరీలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా.. పృథ్వీరాజ్ కుంభ‌ పేరు పెట్టడమే బిగ్ హాట్ టాపిక్. ఇది సాధారణమైన పేరు కాదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామాయణంలో అతి శక్తివంతమైన పాత్రల్లో కుంభకర్ణుడు కూడా ఒకటి. అదే పాత్ర స్ఫూర్తితో కుంభ రోల్‌ తీసుకున్నారట‌. కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రించే.. ఆరు నెలలు మేలుకునే వ్యక్తిత్వం ఎంతో స్పెషల్. ఇక రామాయణ కథలో రామ – రావణ యుద్ధంలో కుంభకర్ణుడు పాత్ర ఎంతో కీలకం.

KUMBHA' - 'RUDHRA' - 'MANDAKINI' . #Varanasi - #SSMB29 - 2027 🌎🔱🪘𓆗 .  #Globetrotter #TimeTrotter #SSRajamouli #MaheshBabu #PrithvirajSukumaran  #PriyankaChopra

రాముడికి సవాళ్లు విసురుతూ ఆయన ఎదురుగా నిలుచున్న కుంభకర్ణుడు ఇప్పటికీ పురాణాల్లో ప్రత్యేక పాత్రగా నిలిచిపోయాడు. ఇప్పుడు ఇదే పృథ్వీరాజ్ కుంభా లుక్‌ చేస్తూ.. చక్రాల కుర్చికు పరిమితమై.. చేతులు కాళ్లు బలహీనంగా చూపించారని.. కుంభ క్యారెక్టర్‌ను, కుంభకర్ణుడు యుద్ధంలో కోల్పోయిన అవయవాలకు ప్రత్యేకంగా డిజైన్ చేశారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రాజమౌళి కథకు రామాయణం ప్రేరణగా ఉందని.. రామాయణంలోని ముఖ్య ఘట్టాన్ని తీసుకున్నామంటూ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ రాముడు గా కనిపిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే.. హీరో, విలన్ మధ్య మైథాలజికల్ స్టైల్, క్లైమాక్స్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఆడియన్స్ థియ‌రీ అంత సరళమైన పాత్ర కాదు కుంభ. కుంభకర్ణుడు లాంటి ఓ శక్తివంతమైన పాత్ర. దాన్ని ఇప్పటి స్టైల్ లో అత్యంత పవర్ఫుల్ ప్రతి నాయకుడిగా రాజమౌళి డిజైన్ చేశాడన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.