గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పౌరాణిక సినిమాలు ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటున్నాయో.. ఏ రేంజ్ లో అదరగొడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. పురాణ కథలు ఆధారంగా కొన్ని ఫ్రిక్షన్ కథలు సైతం తెరకెక్కుతున్నాయి. అలా 2026 లోను భారీ బడ్జెట్ పౌరాణిక సినిమాలు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
రామాయణ్
రణబీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా సౌత్ స్టార్ హీరో పాత్రలో నటిస్తున్న రామాయణ్ పార్ట్ 1. 2026 లో ఈ మూవీ రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో.. సన్నీ డియోల్ కూడా ఓ కీలక పాత్రలో మెరవనున్నాడు. శ్రీరాముని జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. నితీష్ తివారి డైరెక్టర్‌గా.. నమిత్ మల్హోత్రా, శ్రీధర్ రాఘవ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందుతుంది. అంతేకాదు.. ఈ సినిమా సీరీస్లుమొత్తానికి రూ.2 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.
జై హనుమాన్
శ్రీరామునికి ఇచ్చిన మాటను హనుమంతుడు నిలబెట్టుకునే కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 2024 లో బ్లాక్ బస్టర్ కొట్టిన హనుమాన్ సీక్వెల్ ఇది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో కాంతారా హీరో రిషబ్ టైటిల్ రోల్లో మెరవనున్నాడు. ఇక.. ఈ సినిమాలో రానా, తేజ సజ్జా, అమృత అయ్యారు కీలకపాత్రలో కనిపించనున్నారు.
మహావతార్
స్త్రీ, భేదియా లాంటి హారర్ కామెడీ సినిమాలతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దినేష్ విజన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు మెరవనున్న ఈ సినిమాను విష్ణువు అవుతారమైన పరశురాముడి కథగా రూపొందిస్తున్నారు.
పవనపుత్రా
2026 దసరా కానుకగా మైథలాజికల్ మూవీ రిలీజ్ కానుంది అది కూడా టాలీవుడ్ యానిమేటెడ్ మూవీ కావడం విశేషం. పవనపుత్రా. హనుమంతుడి కథ ఆధారంగా చందుమొండేటి ఓ యానిమేషన్ సినిమాను రూపొందిస్తున్నాడు.
నాగ్జిల్లా
ఇక 2026 ఆగస్టు 14న ఫాంటసీ కామెడీ సినిమాగా కార్తీక్ ఆర్యన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో మృగదీప్ సింగ్ లంబ డైరెక్షన్లో నాగ్జిల్లా మూవీ రూపొందనుంది. ఈ సినిమాను మూడు భాగాలుగా రూపొందించనున్నట్లు సమాచారం.
హనుమాన్ జయంతి
ఈ సినిమా కూడా 2026 లోనే రిలీజ్ చేయనున్నారు. ఇది ఏ ఐ టెక్నాలజీతో రూపొందుతున్న సినిమా కావడం విశేషం. విక్రమ్ మల్హోత్ర, విజయ్ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వివరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.







