ప్రతి ఒక్కరి లైఫ్‌లో చిన్నప్పటి నుంచి ఓ గోల్ ఉంటుఏది. దాని గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ.. తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. మరో రంగంలో స్థిరపడాల్సి వస్తుంది. అలా.. ఓ టాలీవుడ్ హీరో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని.. ఎన్నో కలలు కన్నాదడు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఉన్నత చదువులని అమెరికా వెళ్లి.. అక్కడే స్థిరపడాల్సి వచ్చింది. సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ప్రారంభించి దాదాపు 700 మందికి పైగా ఉద్యోగాలు అందించాడు. మ్యూచువల్ ఫండ్ కంపెనీల కు సంబంధించిన సాఫ్ట్వేర్‌ను రన్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే.. తన సాఫ్ట్‌వేర్ కంపెనీని ఇండియాలో కూడా డెవలప్ చేయాలని అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. అయితే.. సినిమాలపై ఉన్న ఫ్యాషన్ మాత్రం అలాగే ఉండిపోయింది.
ఈ క్రమంలోనే.. ఇటీవల వాటన్నింటినీ వదిలేసి మరీ.. ఇండియాకు వచ్చేసి మరి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు. హీరోగా తనకంటూ ఒక స్టార్‌డంను క్రియేట్ చేసుకోవాలని.. స్ట్రాంగ్ గా నిలదొక్కుకోవాలని ఎంతగానో కష్టపడుతున్నాడు. అయితే.. ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసి.. ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. సంతాన ప్రాప్తిరస్తుతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న విక్రాంత్.. గతంలో స్పార్క్ ది లైఫ్ అనే ఒక డిఫరెంట్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించిన విక్రాంత్ ఈ సినిమాకు దర్శకుడుగాను తానే వ్యవహరించాడు.

2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా.. థియేటర్‌లలో ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ.. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు.. సంతాన ప్రాప్తిరస్తు పేరుతో మరో సినిమాను ఈ టాలెంటెడ్ హీరో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక సినిమాల్లో కలర్ ఫోటో బ్యూటీ చాందిని చౌదరి హీరోయిన్గా మెరిసింది. ఈ మూవీ నవంబర్ 14న ధియేటర్లో రిలీజ్ కానుంది. దీంతో.. ప్రమోషన్స్‌లో విక్రాంత్ సందడి చేస్తున్నాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే.. తాను సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నానని.. 700 మంది ఉద్యోగులు అందులో పని చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.

