సోషల్ మీడియాను రప్పాడిస్తున్న చరణ్, చిరు.. మెగా పవర్ చూపించారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లడంలో తమదైన పాత్ర పోషిస్తూ.. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. చిరు తన 50 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నో మైల్డ్‌ స్టోన్స్‌ను అధిగమిస్తే చరణ్ తండ్రికి తగ్గ వారసుడిగా కొనసాగుతూ.. కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు.

Chiranjeevi And Nayantharas 'Meesala Pilla Becomes An Instant Hit!

ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ నుంచి వచ్చిన మీసాల పిల్ల సాంగ్‌కు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్‌ ప్రేక్షకులను ఫిదా చేశాయి. సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడంతో.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దానిని తెగ ఎంజాయ్ చేస్తున్నారు రీల్స్‌, ఫ్యాన్స్‌ ఎడిట్స్‌తో మరింత ట్రెండ్ చేస్తున్నారు. బీమ్స్ మ్యూజిక్ సైతం ట్రెండిగా కొనసాగింది. అలా ఇటీవలస 50 మిలియన్ వ్యూస్ రికార్డ్‌లను క్రియేట్ చేసింది ఇక రామ్ చరణ్ పెద్ది నుంచి తాజాగా వచ్చిన చిక్కిరి చిక్కిరి సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే రికార్డుల వర్షం కురిపించింది.

ARR's Chikiri Chikiri is the Most viewed song in Indian Cinema 🫡 :  r/kollywood

ఒక్కరోజులో నాలుగు భాషల్లో కలిపి 46 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ పాటకు.. రెహమాన్ మ్యూజిక్ మరింత హైలెట్గా మారింది. రిలీజ్ అయిన 24 గంటలు 30 మిలియ‌న్ వ్యూస్ సాధించి.. ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం.. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా కంటిన్యూ అవుతుంది. చరణ్ డ్యాన్స్ మూమెంట్స్‌కు అయితే.. అభిమానులు రీల్స్ చేస్తూ.. మూమెంట్స్ రీ క్రియేట్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తూ మురిసిపోతున్నారు. ఇలా ప్రస్తుతం తండ్రి, కొడుకులు సోషల్ మీడియాను షేక్ చేస్తు మెగా పవర్ చూపిస్తున్నారు.